వులిమిరి రామలింగస్వామి

వికీపీడియా నుండి
(ఉలిమిరి రామలింగస్వామి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వులిమిరి రామలింగస్వామి
V. Ramalingaswami
జననంఆగష్టు 8, 1921
ఆంధ్ర ప్రదేశ్
మరణంమే 28, 2001
పౌరసత్వంభారతదేశం
జాతీయతభారతీయుడు
జాతిహిందూ
రంగములుపాథాలజీ
వృత్తిసంస్థలుఅఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ,
భారత వైద్య పరిశోధన మండలి,
ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ
చదువుకున్న సంస్థలుఆంధ్ర వైద్య కళాశాల
ప్రసిద్ధిరోగ నిదాన శాస్త్రవేత్త

వులిమిరి రామలింగస్వామి (ఆగష్టు 8, 1921 - మే 28, 2001) ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

రామలింగస్వామి శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళంలో 1921, ఆగష్టు 8 వ తేదీన జన్మించారు. తండ్రి పేరు గుంపస్వామి. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎం.బి.బి.యస్ ఆ తర్వాత ఎం.డి చదివారు. బ్రిటన్ దేశం వెళ్ళీ ఆక్స్‌ఫర్డు యూనివర్శిటీలో డి.ఫిల్, డి.ఎస్.సి పట్టాలను పుచ్చుకొన్నారు.[1]

వైద్య శాస్త్రంలో కీలకరంగమైన పాథాలజీలో పరిశోధనలు నిర్వహించిన ఈయన తొలుత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ లో పాథాలజిస్ట్ గా (1947-54) పనిచేశారు. డిప్యూటీ డైరక్టర్ పదోన్నతి పొంది మూడు సంవత్సరాలు పరిశోధనలు నిర్వహించారు. 1954 లో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ప్రవేశించి పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండి, తమ ప్రతిభాసంపన్నతను చూపారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ప్రొఫెసర్ ఎమెరిటస్ గా రాణించారు.

ప్రొఫెసర్ రామలింగస్వామి రోగ నిదాన శాస్త్రం అభివృద్ధికి అంకిత భావంతొ ఎనలేని సేవలు అందించారు. మన దేశంలో, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో యువ ప్రాయానికి ఎదుగుతున్న పిల్లల్లో విస్తృతంగా వ్యాపిస్తున్న వ్యాధులకు కారణమైన ప్రోటీన్, కాలరీ పోషకాహార లోపం (శరీర కణజాలములకు తగిన మాంసకృత్తులు, శక్తి ప్రమాణములు లోపించుట) అంశం మీద ఉన్నత స్థాయి అధ్యయనాలు, ప్రయోగాలు చేసి పరిష్కార మార్గాలు తెలిపారు. ఈయన పరిశోధనా ఫలితాల ద్వారా ప్రోటీన్ లు, కాలరీల లోపం వలన మానవ శరీరం ఎంతగా ప్రతిస్పందిస్తుందో అవగాహనకు రావడం జరిగింది. పోషకాహార లోపములకు సంబంధించిన పాథోఝికియాలజీ అంశం మీద సుదీర్ఘ పరిశోధనలు జరిపారు హిమాలయన్ ఎండెమిక్ గొయిత్రి (హిమాలయ ప్రాంతంలో ఎల్లప్పుడూ ప్రబలి ఉంచే గొంతు కణితి (థైరాయిడ్ గ్రంథి పెరుగుట) వ్యాధి) కు కారణాలు అన్వేషించి, పరిష్కార మార్గాలు తెలిపారు. అయొడైజ్డ్ ఉప్పు వాడకాన్ని అమలు చేయటమే ఈ తరహా వ్యాధులకు పరిష్కారమని తొలిసరిగా నిర్దేశించారు. ఈయన తమ పరిశోధనలన్నిటి ఆధారంగా 140 కి పైగా పరిశోధనా పత్రాలను వెలువరించారు. వైద్య శాస్త్రానికి సంబంధించిన పలు ప్రామాణిక గ్రంథాలలో కొన్ని అధ్యాయాలను రచించారు. ఈయన మేథా సంపత్తికి, పరిశోధనా ఫలితాలకు దేశ విదేశాలలో నీరాజనాలందాయి.

గౌరవాలు

[మార్చు]
  • ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడామీకి అధ్యక్షులుగా (1979 - 80)
  • రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ (లండన్) కు గౌరవాధ్యక్షులుగా (1970)
  • అమెరికన్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ కు హానరరీ ఫెలోగా (1970)
  • రాయల్ సొసైటీ (లండన్) కు ఉపాధ్యక్షులుగా (1986)
  • నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఫెలోగా
యితర పదవులు
  • ఇండియన్ అసోషియన్ ఆఫ్ పాథోలిజిస్ట్స్ అండ్ బాక్టీరియాలజిస్ట్స్ లో సభ్యులు.
  • ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ పాథాలజీ సభ్యులు
  • న్యూట్రిషన్ సొసైటీ ఆఫ్ ఇంగ్లండ్ సభ్యులు
  • ఇండియన్ మెడికల్ అసోషియేషన్, సభ్యులు
  • ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాథోలిజిస్ట్స్ సభ్యులు
  • ఇండియన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లో సభ్యులు మొదలయిన దేశ విదేసీ ప్రతిష్ఠాత్మక గౌరవాలు పొందారు.

పురస్కారాలు

[మార్చు]
  • 1953 :ఆక్స్‌ఫర్డ్ లోని మగ్జాలెన్ కాలేజీ వారు ఎడ్వర్డ్ చాప్‌మన్ రీసెర్చి ప్రైజ్
  • 1962 : వాటుమల్ ఆవార్డ్ ఫర్ మెదికల్ సైన్సెస్
  • 1965 : శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు
  • 1966 :బసంతి దేవి అమీర్ చంద్ ప్రైజ్
  • 1967 : ఆంధ్రా విశ్వవిద్యాలయం వారి డి.ఎస్.సి (Hon. Cau)
  • 1969 : పద్మశ్రీ
  • 1971 : పద్మభూషణ్
  • 1974 : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి సిల్వర్ జూబ్లీ రీసెర్చ్ అవార్డు
  • 1974 : స్వీడన్ డేసంలోని కరోలిన్ స్కా ఇన్‌స్టిట్యూట్ వారి మెదిసిన్ కు సంబంధించిన హానరరీ డాక్టరేట్
  • 1976 : ప్రపంచ ఆరోగ్య సంస్థ (జెనీవా) వారి లియోన్ బెర్నార్డ్ పౌందేషన్ ప్రైజ్.
  • 1977 : జగదీశ్ చంద్ర బోస్ మెడల్.
  • 1980 : రామేశ్వర దాస్ బిర్లా నేషనల్ అవాఅర్డు.
  • 1994 : ఆర్యభట్ట మెడల్

మరణం

[మార్చు]

2001, మే 28 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. డా. ఆర్. అనంత పద్మనాభరావు (2000). ఢిల్లీ ఆంధ్ర ప్రముఖులు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. p. 164.

బయటి లింకులు

[మార్చు]