Jump to content

శొంఠి దక్షిణామూర్తి

వికీపీడియా నుండి

శొంఠి దక్షిణామూర్తి (ఆంగ్లం: Sonti Dakshinamurthy) (1899-1975) ప్రసిద్ధి పొందిన వైద్యశాస్త్ర ప్రముఖులు.

వీరు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో డిసెంబర్ 22, 1899 సంవత్సరం జన్మించారు. చెన్నైలో ఎం.బి.బి.అస్. పట్టా పొందిన అనంతరం ఇంగ్లాండులో ఉన్నత విద్యాభ్యాసం చేసి డి.పి.హెచ్., డి.టి.ఎం. అండ్ హెచ్. పట్టాలను, ఆర్.సి.పి.ఎస్.పట్టాలను పొందారు. లండన్లో పరిశోధన చేసి పి.హెచ్.డి. పట్టా పొందారు.

మొదట విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో (1932-1938) మధ్య ఉపన్యాసకులుగా, తరువాత వైనాడ్ లో (1939-1941) మలేరియా ఆఫీసరుగాను, మలేరియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో (1941-1944) అసిస్టెంట్ డైరెక్టరుగాను, (1948-1951) డిప్యూటీ డైరెక్టరు, ఆక్టింగ్ డైరెక్టరుగాను పనిచేశారు. 1953-1955లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ డైరెక్టరు అయ్యారు. ప్రజారోగ్య వ్యాధి నిరోధక, సాంఘిక చికిత్సా విభాగంలో విశేష నైపుణ్యం పొందారు.

నానాజాతి సమితిలోను, ప్రపంచ ఆరోగ్య సంస్థలోను 25 సంవత్సరాల పైబడి పనిచేసిన భారతీయ వైద్యులు వీరు ఒక్కరే. నానాజాతి సమితి ఆరోగ్య సంస్థ దూర ప్రాచ్య శాఖకు సింగపూరులో (1940-1942) వీరు డిప్యూటీ డైరెక్టరుగా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఇరాక్ లో మలేరియా ప్రాజెక్టులో వైద్య దళ నాయకులుగా అలెగ్జాండ్రియాలో (1952-1953) వీరు పనిచేశారు. జినీవాలోని కేంద్ర కార్యాలయంలో మలేరియా సమస్యల సలహాదారుగా (1957-1958) ఉన్నారు.

ఇంతటి విశ్వ విఖ్యాత వైద్యులు 1975లో పరమపదించారు.

బయటి లింకులు

[మార్చు]