ఆధార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బయోమెట్రిక్ కార్డుల వల్ల ఎవరైనా... ఎక్కడైనా...ఠక్కున గుర్తించవచ్చు. ప్రతి పౌరుడికీ గుర్తింపు కార్డును జారీ చేయాలన్న ఉద్దేశంతో 'జాతీయ జనాభా రిజిస్టర్' తయారీ, 'జాతీయ పౌరగుర్తింపు కార్డు లివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని బట్టి తీర ప్రాంతాలకు అపరిచితులు ఎవరు వచ్చినా వెంటనే పసిగట్టే అవకాశం ఉంటుంది. ముందుగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వారికి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. జాతీయ జనాభా నమోదు (నేషనల్ పాప్యులేషన్ రిజిష్ట్రేషన్) కార్యక్రమం కింద ముందుగా తీర ప్రాంతాలలో ఉన్న కుటుంబాలను సర్వే చేస్తారు. ఇంటింటికీ తిరిగి వేలి ముద్రలు ఫొటోలు నమోదు చేసి గుర్తింపు కార్డులు రూపొందిస్తారు.ముఖ్యంగా సముద్రంపై చేపలు పట్టే మత్స్యకారులకు ఈ కార్డుల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. చేపలవేట లో భాగంగా దేశంలో ఎక్కడకు వెళ్లినా ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఎవరికైనా అనుమానం వచ్చి అతని వివరాలు తెలుసుకోవాలనుకున్నా, చాలా సులభంగా ఈ బయోమెట్రిక్ కార్డుని కంప్యూటర్లో పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. అతనిది ఏ దేశం? ఏ ప్రాంతం? మత్స్యకారుడా? ఉగ్రవాదా? అతని రక్తం గ్రూపు, వేలిముద్రలతో సహా మొత్తం వివరాలు తెలుస్తాయి.

ఆధార్ కార్డు(వివరాలు అస్పష్టంచేయబడ్డాయి)

కళ్లు, చేతివేళ్లు[మార్చు]

విశిష్ట గుర్తింపు కార్డు కు ఇవే ఆనవాళ్లు. గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ చేసేందుకు వారి కళ్లను స్కాన్‌ చేయడంతో పాటు మొత్తం పది చేతివేళ్ల ముద్రలు సేకరించాలని యూఐడీఏఐ సంస్థ యోచిస్తోంది. అధిక శ్రమ వల్ల గ్రామాల్లో నివసించే ప్రజలు తమ శారీరక గుర్తులు కొంత వరకు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొందరికి కంటి చూపు, మరికొందరికి చేతివేళ్ల అరుగుదల సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున మరో ప్రత్యామ్నాయం లేదని యూఐడీఏఐ అధికారులు పేర్కొన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికి 16 అంకెలు గల బయోమెట్రిక్‌ విశిష్ట సంఖ్యను దేని ఆధారంగా ఇవ్వాలనే అంశం మీద గత కొద్ది రోజులుగా అధికారుల మధ్య చర్చలు సాగాయి.ప్రజల గుర్తింపు కోసం మొత్తం పది చేతివేళ్లు లేదా కళ్లు స్కాన్‌ చేయాలని సూచించిందని అధికారులు వెల్లడించారు. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో మాత్రం వీటిలో ఏదైనా ఒకదానిని అనుసరించాలని కమిటీ పేర్కొంది. గ్రామాల్లో మాత్రం రెండూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. అయితే ప్రజల నుంచి డీఎన్‌ఏ గుర్తులు సేకరించాలనే సలహాను కమిటీ తిరస్కరించింది. డీఎన్‌ఏ సేకరణ వల్ల పలు సమస్యలు ఉత్పన్నం కావచ్చని కమిటీ అభిప్రాయపడింది.[1]

ఇతర గుర్తింపు లేక అనుమతి పత్రాలు[మార్చు]

 • -1. ఎన్నికల సంఘం జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు ,
 • 2. భారత విదేశాంగ శాఖ జారీ చేసిన పాస్‌పోర్టు ,
 • 3. డ్రైవింగ్‌ లైసెన్స్ ,
 • 4.పాన్‌ కార్డు,
 • 5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఇతర రంగాల్లో పని చేస్తున్న వారు సంబంధిత సంస్థచే జారీచేసిన గుర్తింపు కార్డు,
 • 6. బ్యాంకు, కిసాన్‌, పోస్టాఫీస్‌ పాసుబుక్కులు,
 • 7. విద్యార్థుల విషయంలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలు జారీచేసే గుర్తింపు కార్డులు,
 • 8. పట్టాదారు పాసు పుస్తకాలు ,
 • 9. రిజిస్టర్డ్‌ డీడ్‌ లాంటి ఆస్తి సంబంధ పత్రాలు,
 • 10. రేషన్‌ కార్డు ,
 • 11. ఎస్సీ, ఎస్టీ, బి.సి.లకు సంబంధిత అధికార సంస్థలు జారీచేసే పత్రాలు,
 • 12. పింఛను మంజూరు పత్రాలు,
 • 13. రైల్వే గుర్తింపు కార్డు,
 • 14. స్వాతంత్రం పోరాట యోధుల గుర్తింపు కార్డు,
 • 15. ఆయుధాల అనుమతి పత్రాలు (లైసెన్సులు),
 • 16. వికలాంగుల పత్రాలు.

ప్రస్తావనలు[మార్చు]

 1. "Services Offered by the UIDAI Official Website". 
"https://te.wikipedia.org/w/index.php?title=ఆధార్&oldid=2307991" నుండి వెలికితీశారు