ఆనంద్ సాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆనంద్ సాయి
జననం
పర్లాకిమిడి
వృత్తికళా దర్శకుడు
జీవిత భాగస్వామివాసుకి
పిల్లలుహర్ష (కూతురు), సందీప్ విశ్వ బ్రాహ్మణ(కొడుకు)
తల్లిదండ్రులు
  • బి. చలం (తండ్రి)

ఆనంద్ సాయి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో కళా దర్శకుడు. తెలంగాణాలోని యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో ఇతను రూపకర్తగా వ్యవహరించాడు.[1] ఆనంద్ సాయి తొలిప్రేమ, యమదొంగ, సైనికుడు, గుడుంబా శంకర్, బాలు లాంటి చిత్రాలకు కళాదర్శకుడిగా వ్యవహరించాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆనంద్ సాయి తండ్రి బి. చలం సినీ పరిశ్రమలో కళాదర్శకుడు. తొలిప్రేమ చిత్రానికి ఆనంద్ సాయి పనిచేసేటపుడే అందులో కథానాయకుడి చెల్లెలుగా నటించిన వాసుకిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం.[2]

సినిమాలు[మార్చు]

తొలిప్రేమ ఆనంద్ సాయికి కళా దర్శకుడిగా మొదటి సినిమా.[3] ఆ సినిమాలో సముద్రపు గట్టున ఆనంద్ సాయి రూపొందించిన తాజ మహల్ సెట్ అతనికి మంచి పేరు తెచ్చింది.

ఆనంద్ సాయి కళా దర్శకుడిగా పనిచేసిన కొన్ని సినిమాలు.

దేవాలయాల రూపకర్తగా[మార్చు]

సినిమాలకు పనిచేస్తున్నప్పుడే రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని తమ ఆశ్రమ రూపకల్పన కోసం చినజీయర్ స్వామి నుంచి ఆనంద్ సాయికి పిలుపు వచ్చింది. కొద్ది కాలం చినజీయర్ స్వామితో పాటు రెండున్నరేళ్ళ పాటు దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ సందర్శించాడు. తర్వాత తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నుంచి యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణానికి రూపకల్పన చేయమని పిలుపు వచ్చింది.[2][4]

యాదాద్రి తరహాలోనే శైవ ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ఆనంద్ సాయి 2022 ఏప్రిల్ 4న ఈ ఆలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు.[5]

మూలాలు[మార్చు]

  1. Adivi, Sashidhar (2021-02-27). "Yadadri temple is an architectural marvel: Anand Sai". Deccan Chronicle. Retrieved 2021-03-04.
  2. 2.0 2.1 "పవన్‌..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం! - alitho saradaga". www.eenadu.net. Retrieved 2021-03-04.
  3. Sharma, Swati (2016-06-19). "Jab we met: A filmi love story". Deccan Chronicle. Archived from the original on 2022-01-30. Retrieved 2021-03-04.
  4. Eenadu (20 March 2022). "ఆ సూర్యకిరణం.. ఓ అనుకోని అద్భుతం". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  5. "యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ పునర్నిర్మాణం.. రెండు వారాల్లో ఎములాడకు కేసీఆర్‌". Prabha News. 2022-04-04. Retrieved 2022-04-04.