ఆనం వెంకటరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆనం వెంకటరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకులు. ఆయన ప్రముఖ నాయకుడు ‎ఆనం చెంచుసుబ్బారెడ్డి సోదరుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన సెప్టెంబరు 29 1910 న సుబ్బరామరెడ్డి, నారాయణమ్మ దంపతులకు జన్మించారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

నిరంతరం పేద, మధ్యతరగతి ప్రజల్లోనే ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేసి ప్రజానాయకులుగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆనం వెంకటరెడ్డి.సర్పంచి పదవి నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఎన్నో పదవులను అలంకరించినా, ఏనాడు హంగులు, ఆర్భాటాలకు పోకుండా అత్యంత సామాన్యమైన నిరాడంబర జీవితం గడిపిన ఆదర్శప్రాయులాయన.[1] 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు[2].

ఆయన సోదరుడు ‎ఆనం చెంచుసుబ్బారెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆనం వెంకటరెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రుల వద్ద, ఆయన కుమారుడు ఆనం రామనారాయణరెడ్డి 1983లో ఒకే సారి శాసనసభ్యులుగానూ, ఆనం వివేకానందరెడ్డి 1999 నుండి 2014 వరకు కాంగ్రెస్ పక్షాన శాసనసభ్యులుగా ఉన్నారు. రామనారాయణరెడ్డి రాపూరుకు ప్రాతినిధ్యం వహించగా ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు సిటీ నుండి, రూరల్ నుండి ఎన్నికై శాసనసభలో ప్రవేశించడం విశేషం. తండ్రి, ఇద్దరు కొడుకులు ముగ్గురు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం కూడా ప్రత్యేకతే.[3]

ఆయన సోమశిల నెల్లూరు జిల్లాకు తీసుకుని రావడంతో ఎనలేని కృషి చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు అండగా నిలబడి వారి శ్రేయస్సుకు ఎంతో కృషి చేశారు[4].

1972 అసెంబ్లీ ఎన్నికలలో[మార్చు]

1972 అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నియోజకవర్గ స్థితి ఇలా ఉంది. మొత్తం ఓట్లు 93, 675లో 55, 994 ఓట్లు పోల్ కాగా, విజయం పొందిన కాంగ్రెస్ అభ్యర్థి ఆనం వెంకటరెడ్డికి 33, 359 ఓట్లు వచ్చాయి. ఓడిన వారిలో ఎం.ఆర్లప్పకు (మార్క్సిస్ట్) 9, 039 ఓట్లు, అన్నదాత మాధవరావుకు (జన్ సంఘ్) 7, 920 ఓట్లు, అబ్దుల్ ఖాదరుకు (డి.ఎం.కె) 5, 228 ఓట్లు, ఏ.రామానుజం శెట్టికి (ఇం) 269 ఓట్లు, సూరం కృష్ణయ్యకు (ఇం) 1165 ఓట్లు వరకు ఉన్నాయి.[5]

కుటుంబం[మార్చు]

ఆయన సోదరుడు ఆనం చెంచుసుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా మూడుసార్లు పనిచేసారు. వెంకటరెడ్డి కుమారులు ఆనం రామనారాయణరెడ్డి మరియు ఆనం వివేకానంద రెడ్డి కూడా శాసన సభ్యులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో ప్రసిద్ధులైనారు. ఆనం రామనారాయణరెడ్డి 2012 నాటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లో ఆర్థికశాఖమంత్రిగా ఉన్నారు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ పార్టీ యొక్క సభ్యుడు.

మరణం[మార్చు]

ఆయన జూన్ 5 1995 న మరణించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]