Jump to content

ఆముదపుకుటుంబము

వికీపీడియా నుండి
ఆముదం కాయలు
ఆముదపుకుటుంబము

ఆముదపు చెట్టు 2 - 5 అడుగుల ఎత్తువరకు పెరుగును.

ప్రకాండము
గుల్మము. కొయ్య వంటి దారు లేదు. లేత కొమ్మల మీదను, తొడిమల మీదను తెల్లని మెత్తని పదార్థము గలదు. అది లేగొమ్మలను ఎండకు ఎండి పోకుండ కాపాడును.
ఆకులు. ఒంటరి చేరిక. లఘు పత్రము. మొగ్గగా నున్నప్పుడు దానిని గప్పుచు 2 కణుపు పుచ్ఛములు గలవు. పత్రముతో దొడిమ చేరు చోట దీనికిరు పక్కల బత్రము మీద గ్రంథి గోళములు గలవు. తొడిమ పాత్రము యొక్క అంచుతో చేరక కొంచెము మధ్యగా కలియు చున్నది. తాళపత్ర వైఖరి 7, 8 తమ్మెలున్నవి. తమ్మెల అంచున రంపపు పండ్లు గలవు. కొన సన్నము. బహుకాష్టకము. రెండు వైపుల నున్నగా నుండును.
పుష్పమంజరి
రెమ్మ గెల. ఏకలింగ పుష్స్పములు. ఒక కొమ్మమీదనే స్త్రే, పురుష పుష్పములు గలవు. వృంతమలడుగు భాగమున స్త్రీ పుష్పములు, పైభాగమున పురుష పుష్పములు.
పురుష పుష్పము

పుష్ప కోశము. ( పుష్పనిచోళము) 3--5 రక్షక పత్రము ఒకదానినొకటి తాకు చుండును. దళవలయము. లేదు.

కింజల్కములు, అసంఖ్యములు, కాడలు శాఖోపశాకలు నున్నవి. పుప్పొడి తిత్తులు గుండ్రము.
అండకోశము
లేదు;
స్త్రీ పుష్పము

పుష్ప కోశము త్వరగా రాలి పోవును. నీచము. సంయుక్తము.

దళ వలయము
లేదు.
కింజల్కములు : లేవు.
అండ కోశము
అండకోశము ఉచ్చము. 3 దగులు. కీలములు 3 ఒక్కొక చీలిక కొన భాగమందు రెండుగా చీలి యున్నది. ఒక్కొక గదిలో నొక్కక గింజ. అది గది కప్పు ఒక్క లోపల మూలను అలరించి యున్నది. కాయ బహు విదారులు ఫలము. గింజ పొర మిక్కిలి గట్టిగా నుండును. విత్తనములకు బీజ పుచ్చము. గలదు. విత్తనములో అంకురచ్చదనము గలదు.
నేల యుసిరి
నేల యుసిరి తోటలలో బెరుగు చిన్నమొక్క. గుల్మము. 1 - 2 అడుగుల యెట్టు పెరుగును. ప్రకాండము గుండ్రము గాను నున్నగాను నుండును.
ఆకులు. ఒంటరి చేరిక, లఘు పత్రము. చిన్నది. తొడిమ లేదు. సమ గోళాకారము. సమాంచలము. విషమ అరేఖ పత్రము. నున్నగానుండును. కొన గుండ్రము.
పుష్ప మంజరి
కణుపు సందులందు ఒకటో, రెండో పుసుష పుష్పములు, ఒకస్త్రీ పుషము ఉంది.
పురుష పుష్పములు.
పుష్పకోశము
రక్షక పత్రములు 6. నీచము
దళవలయము
లేదు
కింజల్కములు. 3 కాడలు కలసి ఒకటిగా నేర్పడియున్నవి.
స్త్రీ పుష్పము.
పుష్పకోశము
రక్షక పత్రములు. 6 నీచము
దళవలయము
లేదు
అడకోశము
అండాసయము ఉచ్చము. 3 గదులు రెండేసి గింజలు ఫలము బహు విదారణ ఫలము. కీలము 3 చీలికలు.
కొండాముదము

కొండాముదము 3- 6 అడుగుల ఒకరు పెరుగును. కొమ్మలు గుండ్రము. లేగొమ్మలమీద మెత్తని యొకవిధమగు పొడి గలదు.

ఆకులు. ఒంటరి చేరిక. కణుపు పుచ్చములు లేవు. అండాకారము. లఘు పత్రము. కొన్నిటికి తమ్మెలుండును. 3 పెద్ద ఈనెలు గలవు. కొద్దిగరోమములున్నవి. అంచున నిడుపాటి రంపపు పండ్లు గలవు.
పుష్పమంజరి. కణుపు సందులందుండి యొక గెల.
పురుష పుష్పము.
పుష్ప కోశము. రక్షక పత్రములు. 5. నీచము.
దళవలయము
లేదు.
కింజల్కములు. అసంఖ్యములు. విడివిడిగా నుండును. వీని చుట్టును

మధుకోశము గలదు. పుప్పొడి తిత్తులు గదులు పైన విడిగానుండును.

అండకోఅము
లేదు.

స్త్రీ పుష్పము.

పుష్పకోశము సంయుక్తము. 5 దంతములు. నీచము. దీని యందును మధు కోశము గలదు.
దళవలము
లేదు.

కింజల్కములు: లేవు బొమ్మ: ఆముదపు చెట్టు.

అండకోశము. అండాశయము ఉచ్చము. 3 గదులు. ఒక్కొక్క గింజ. బీజపుచ్చము గలదు. కాయ బహు విదారుణ ఫలము.

ఈ కుటుంబపు మొక్కలలో ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు. పువ్వులు చిన్నవి. ఏకలింగ పుష్పములు. అండకోశములో సాధారణముగ 3 గదులు. వ్రేలాడువిత్తులు. ఈ కుటుంబమును, అండాశయము యొక్క గదులయందు నొక్కొక గింజ కలదో, రెండేసి యో, పుష్పము లందాకర్షణ పత్రములు గలవో లేవో, కింజల్కములెన్ని గలవో, కాయ ఎండు కాయయో, కింజల్కములెన్ని గలవో కాయ ఎందు కాయయో లోపెంకు కండకాయమో, ఈ యంశములను బట్టి జాతులుగను తెగలుగను విభజించి యున్నారు. ఆముదపు మొక్కలలోనే రెండు మూడు రకములు గలవు. కొన్ని మూడడుగులే బెరుగును కాని మరికొన్ని 6 -7 అడుగుల వరకు కూడా పెరుగును. అవి నల్ల గారిడి నేలలో గాని, ఇసుక నేలలో గాని బాగుగ పెరుగ నేరవు. నివి వరి మొదలగు వాని చేల గట్ల మీద గాని, ప్రత్యేకముగా వానినే పొలములలో గాని వేయుదురు. విత్తనములు చల్లిన పిదప రెండు మూడు వర్షములు కురిసిన చో మొక్కలు ఏపుగా బెరుగును 7 = 8 నెలలలోనే పంటకు వచ్చును. సాధారణముగ కాయలు పగులబోవు నప్పుడు కోసెదరు. ఒక వేళ అవి పగుల కున్న యెడల వానిని గోసి, ఎండ బెట్టి రోకళ్ళతో గొట్టుదురు. లేదా రెండు ముడు దినములలో గోతిలో బాతి పెట్టిన పిదప వానిని నలుగ గొట్టుదురు. దీని గింజలనుండి ఆముదమును నాల్గు విధముల దీయు చున్నారు. కొందరీ గింజల నొక సంచిలో బోసి రోకండ్ల వంటి వాని మధ్యన బెట్టి వానిని (మరల సహాయమున) దగ్గరగా నొక్కు చున్నారు. కొందరట్లు నొక్కుటకు బూర్వమొక రాత్రి గింజలను నీళ్ళలో నాన బెట్టెదరు. మరి కొందరు గింజలను వేయించి పొడుము గొట్టి ఈ పొడుమును నాలిగింతల నీళ్ళలో పోసు మరుగ బెట్టుదురు. ఆముదము నీళ్ళకంటె తేలిగగుట చే నీళ్ళమీద తేలుచుండును. అట్లు తేలు దానిని మరియొక పాత్రలోని కోడ్చుచుందురు. వేయించుటకు బదులు నీళ్ళతో గాచి ఎండబెట్టుట మరియొక పద్ధతి. ఈ పద్ధతులన్నియు మరలు లేని చోట్ల గలవు కాని యంత్ర సాహాయ్యమున ఆముదము చేయుటయే ముఖ్య పద్ధతి.దాదాపు ఇరువది సంవత్సరముల వెనుక వరకు ఆముదమునమ్మకము ఎక్కువగా నుండెడిది. అందరును దీపములకు దీనినే ఉపయోగించెడి వారు. దీని దీపము ప్రకాశముగానే యుండును. కాని క్ ఇరసనాయలు దీని కంటే చౌక యగుట చేతను, ఆముదము చిక్కగా నుండి గాజు దీపముల కనుకూలింపక యుండుట చేతను దీనిని మానినాము. ఇప్పుడును గొందరు కొందరు కిరసనాయులు పొగ అనారోగ్యమని ఎంచి పడక గదులందు ఆముదపు దీపములనే పెట్టుకొను చున్నారు. చంటి పిల్లలకు పెట్టెడు ఆముదము వేయించిన గింజలనుండి గాని, ఉడకబెట్టిన గింజలనుండి గాని తీసిన చమురు. పచ్చి ఆముదము కంటే నిది ఎక్కువ ఆఆరోగ్యము. ఆముదము మంచి విరోచన కారి. మరలు త్రుప్పుపట్టకుండ దీనిని రాయు చుందురు.ఆముదపు తెలకపిండిని పశువులకు నేయుదురు కాని అది అంత మంచిది కాదందురు. అది బాగుగ మండును గాన వంట చెరుగుకా నుపయోగించు చున్నారు. ఇది చెరుకు తోటలక్కు మిక్కిలి బలము చేయును.ఆముదపు ఆకులు పశువులు తినిన పాలెక్కువనిచ్చును. ఆముదము విత్తులు కూడా మన దేశమునుండి ఇతర దేశములకు చాల ఎగుమతి అగు చున్నవి.

కొండాముదము
. కొండలమీద విరివిగా పెరుగును. కాయలు ఆముదపు కాయలవలెనే యుండును. దీని గింజల చమురు విరేచనకారి.
ఉచ్చి ఉసిరిక
సాగు చేయు మెట్ట నేలలందు బెరుగును. పురుష పుష్పములకు తొడిమ లేదు. కాని స్త్రీ పుష్పములకు గలదు. ఆకులు, పువ్వులు కాయలు కూడా మూత్ర వ్యాధులందౌషధములుగా నుపయోగించును. ఆకులను మజ్జిగలో నాన వేసి దీనితో శరీరము రుద్దులినిన యెడల చిడుము పోవును.

నేలసిరియు సాగు చేయు చోట్లనే బెరుగును. ఔషధ ములందు దీని వేళ్ళు ఉపయోగ పడును. తెల్ల ఉసిరక నేల యుసిరిక వలె నుండును. దీని ఆడు పువ్వులలో కొన్ని గొడ్డు పువ్వులే గాని కాయలుగాయవు. ఎర్ర ఉసిరక కొమ్మలు ఎర్రగా నుండును. దీనిని పశువులు తినును.

రవసల బర్రకాడ
సముద్ర తీరముల నుండును. సంవత్సరము పొడవున పుష్పించును. కొమ్మల పై భాగమున
స్త్రీ పుష్పములు
. అడుగు భాగమున పురుష పుష్పములు గలవు.
నేల పురుగుడు
ఒక తీగ. కాలువల వారలను దొంకల మీదను నుండును. దీని పువ్వులు తెల్లగా నుండును.
ఎర్రపురుగుడు
పెక్కు చోట్ల గలదు. ఇది పెద్ద మొక్క. దీని పండ్లెర్రగా నుండును.
పెద్ద ఉసిరి
. రాచ ఉసిరియు, ఆడవులంనును తోటలందును పెరుగు చున్నవి. పెద్దయుసిరియన్నను మనకు గౌరవము గలదు. తోటలలో నొక మొక్క యుండినా, తోట పావనమైనట్లు భావింతుము. క్షీరాబ్ధి ద్వాదశినాడు దీని కొమ్మ నొక దానిని తెచ్చి పూజ చేతుము. పెద్ద ఉసిరి కాయలతో పచ్చడి పెట్టి నిలువ యుంచుదుము. రాచ యుసిరి కాయల తోడను పచ్చడి పులూ చేసి కొందుము. రాచ ఉసిరి ఆకులందొక విశేషము గలదు. సాధారణముగ అన్ని ఆకులు మొదలు నుండి పెరుగుచు త్వరలోనే పెద్దదై యిక పెరుగుట మానును. కాని రాచ యుసిరి ఆకులు (మిశ్రమ పత్రములు) చిట్టి ఆకు వేయుచునే యుండును. పెద్ద యుసిరి కాయలు, చెట్టు బెరడుల ఆకులును చరెమములు బాగు చేయుటకు యందు పనికి వచ్చును.
మూర్కొండ అన్ని చోట్ల పెరుగును. దాని పువ్వులగుత్తులందము గానుండుట చే తోటలందు పెంతురు.
జయపాల మొక్క ఆకునకు చెడు వాసన గలదు.

తెల్ల చెట్తు అడవులలోను తేమ చోట్ల నుండును. కొమ్మలు నరుగకానె తెల్లని పాలు గారును. ఈ పాలతో రబ్బరు చేయవచ్చును. కలప పెట్టెలు చేయుటకు పనికి వచ్చును. గాని పెట్టెలంత గట్టిగా నుండవు. దీని యందు త్వరగా నంటుకొని మండెడు గుణము గలదు కాన అద్దిపుల్లలు చేయుటకు వీలుగా నుండును.

జముడు చెట్టు చెట్టంతయు ఆకు పచ్చగానే యుండును. ఆకులున్నట్లే గనుపింపవు గాని, దూర దూరముగ సన్నని ఆకులు గలవు. ఇవియు త్వరగా రాలిపోవును. ఆకులుండినయెడల ఆకుల ద్వారా నీరు పోవుఛుండును గనుక నీరు సమృద్ధిగ దొరకని చోట్ల పెరుగు చెట్లకు ఆకులు చిన్నవిగా నుండుటయే.. లేకుండుటయో తటస్థించును. ఆకులు లేనప్పుడు, వాని పనియు కొమ్మలే చేయవలసి యుండును గనుక, చెట్ల కావశ్యకమై సాధారణముగా ఆకౌలందుండు ఆకుపచ్చని పదార్థము దీని కొమ్మల యందే గలగు చున్నది. దీని పాలనుండియు రబ్బరు చేయ వచ్చును. కొన్ని చోట్ల కాకులను చంపుటకు దీనిపాలతో నన్నము కలిపి పెట్టుదురు. పౌండ్లకు గాని కంటికి గాని ఈ పాలు దగిలినా బాధ పెట్టును.
బొమ్మజెముడు
. సాధారణముగ కంచెలుగ పెరుగు నాగ జెముడు కాదు. ఆకులు లేక, దళసరిగను వెడల్పుగను, ఆకు పచ్చగ నుండును కొమ్మలుండుట చే నాగ జెముడు వలెనే యుండును. కాని ఇవి రెండును వేరు వేరు కుటుంబముల లోనివి.
శిఖండి మొక్క
కూడా బొమ్మ జెముడువలెనే యుండును. పై రెండింతి పుష్పములందును దీని పుష్పముల యందొక్క విశేషము గలదు. మనకు చూడగనే పువ్వు వలె నగుపడు నది యొక పువ్వుగాదు. అది పువ్వుల గి8త్తి. దానిలోపల ఎన్నో పువ్వులు గలవు. ఈ పువ్వు లోని రేకులు తామర గన్నేరు పువ్వులందలి రేకుల వంటివి కావు (ఇవి చేటికలు) ఇవియు రేకులు గానిచో నిక రేకులు లేవే. ఇది యెట్లు పూల గుత్తియనునని సందేహము కలుగ వచ్చును. వీనిలోపల ల్పెద్దు కింజల్కములును కొన్నిటి మధ్యనొక యండకోశమును గలదు. ఒక్కొక్క కింజల్కము, ఒక్కొక అండ కోశమే,. యెక్కొక పువ్వు. పుష్పమునకు ప్రధానాంగములు కింజల్కము అండ కోశములే గాని పత్రములు గావు. ఆముదపు వుప్పునందు (పుష్పకోశము) ఈ ముఖ్యాగములను గాపాడుటకు పత్రములును కింజల్కములో, అండకోశమో మాత్రము గలదు. దీని యందీ పత్రములు కూడా లేకుండ పోయెను. ఇట్టిది నిర్ధారణ చేయు టెట్లనిన కింజల్కములను చూచినను బోధకము కాగలదు. వీని కాడలు సరాసరిగ లేవు. మధ్యనొక కణపు గలదు. కణుపు దగ్గిరకు వానిని సులభముగ విరువ వచ్చును. కణుపు వరకును పుష్పమునకు ఉండెడు కాడ, పైది కింజల్కము యొక్క కాడ. ఈ కణపు వద్దనే పత్రములు పెరుగ వలసినది గాని పెరుగ లేదు ఈ విధముననే స్త్రీ పుష్పము కూడా గలదు.

సిందూరము చెట్లు మనదేశములో పలు తావుల బెరుగు చున్నవి. వాని కాయల నుండి రంగు తీయుదురు. కాయల మీద రోమముల వంటివి యున్నవి. వీని యందే రంగు పదార్థము గలదు. కాన నివి రాలి పోవు వరకు కాయలను చేతులతోడరాచెదరు. లేదా, ఒక సంచిలో బోసికొట్టెద్రు. ఈ పొడుమును కాయ ముక్కలు లేకుండ బాగు చేసి రంగుగ నుపయోగింతురు. ఈ రంగు తరుచుగా బట్టు బట్టలకే వేయుచుందురు. పెంటంగచెట్టు కొండలమీద పెద్దదిగా పెరుగును. దీని పువ్వులు ఆకు పచ్చగా నుండును. (అండాశయము) కాయలో రెండు గదులే గలవు. ఒక్కొక్క గదిలో రెండేసి గింజలుండును. కొఱమాను చెట్టు కూడా కొండలమీద పెద్దగా పెరుగును. దీని పువ్వులందును బెంటింగి పువ్వులందువలె పచ్చని రేకులు గ్లవు. దీని కలప గట్టిగనే యుండును. ఆకులు పశువులు తినును. డొంకి బూర కాలువల గట్లు మీద డొంకల మీద ప్రాకుచుండును. నేపాళము పెక్కు చోట్ల చిన్నమొక్కగ పెరుగు చున్నది. దీని గింజ్ల నుండి తీయు చమురు విరేచనములగుటకును డోకులు వచ్చుటకును, చర్మ వ్యాధులకుకును పనికి వచ్చును. కాని గింజలనే తినినచో ప్రాణహానియు వాటిల్లును. కొన్ని చోట్ల దీని ఆకులను పట్టు పురుగులకు ఆహారముగ పెట్టుచున్నారు.

మూలం

[మార్చు]

https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:VrukshaSastramu.djvu/429&action=edit[permanent dead link]