ఆరికట్లవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"ఆరికట్లవారిపాలెం" ప్రకాశం జిల్లా జే.పంగులూరు మండలానికి చెందిన గ్రామం.


ఆరికట్లవారిపాలెం
గ్రామం
ఆరికట్లవారిపాలెం is located in Andhra Pradesh
ఆరికట్లవారిపాలెం
ఆరికట్లవారిపాలెం
నిర్దేశాంకాలు: 15°47′24″N 80°03′47″E / 15.79°N 80.063°E / 15.79; 80.063Coordinates: 15°47′24″N 80°03′47″E / 15.79°N 80.063°E / 15.79; 80.063 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాజే.పంగులూరు మండలం
మండలంజే.పంగులూరు Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08593 Edit this at Wikidata)
పిన్(PIN)Edit this at Wikidata

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

  1. స్థానిక ఎస్.సి.కాలనీలోని ఈ 37వ నంబరు పాఠశాలకు ఇంకొంత స్థలం అవసరం కాగా, పాఠశాల ప్రక్కనే ఉన్న 3 సెంట్లస్థలం, పాఠశాల పూర్వ విద్యార్థులు వితరణతో సమకూరినది. [2]
  2. ఈ పాఠశాల శతసంవత్సర వేడుకలకు సిద్ధంగా ఉంది. [2]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ స్వయంపు ఆంజనేయులు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
  2. ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం శిథిలమవడంతో, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్.నిధులతో, ఒక నూతన భవన నిర్మాణం ప్రారంభించి 4 సంవత్సరలయినది. అయిననూ నిర్మాణం పూర్తి కాలేదు. [4]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అమరలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)[మార్చు]

గ్రామములో నూతనంగా ఈ ఆలయ నిర్మాణం చేపట్టడానికి 8 లక్షల విలువైన 40 సెంట్ల స్థలాన్ని ఇద్దరు దాతలు వితరణచేసారు. ఈ గ్రామానికి చెందిన కీ.శే.మాగులూరి సీతారామాంజనేయులు ఙాపకార్ధం, వారి సతీమణి కస్తూరి 20 సెంట్లు, కీ.శే.ఏలూరు సుబ్బారావు ఙాపకార్ధం వారి సతీమణి సీతారామమ్మ 20 సెంట్లు స్థలాన్ని అందజేసినారు. దాతల విరాళాలు 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఈ ఆలయ నిర్మాణం జరుగుచున్నది. ఆలయంతోపాటు పార్వతీదేవి అమ్మవారు, గణపతిమూర్తి, నవగ్రహ మండపాల నిర్మాణం చేపట్టినారు. ఆలయం చుట్టూ రక్షణ గోడ నిర్మాణం గూడా నిర్మించుచున్నారు. 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, స్వామివారు, పరివార దేవతల ఆలయాలకు ప్రధాన ద్వారబంధాల ఏర్పాటు, ఋత్విక్కుల వేదమంత్రాల మధ్య, నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [3],[6]&[7]

నవగ్రహ మండపం[మార్చు]

ఈ గ్రామములో, దాత శ్రీ పుల్లెల సుబ్రహ్మణ్యం అందిన ఐదు లక్షల రూపాయల విరాళంతో నిర్మించనున్న ఈ మండప నిర్మాణానికి 2016, నవంబరు-9వ తేదీ బుధవారంనాడు భూమిపూజ నిర్వహించారు. [5]

దాతల విరాళాలు 65 లక్షల రూపాయలతో ఈ ఆలయ నిర్మాణపనులు చురుకుగా జరుగుచున్నవి. పార్వతీదేవి అమ్మవారు, వినాయకస్వామి, నవగ్రహమండప నిర్మాణాలు జరుగుచున్నవి. 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, స్వామివారి ఆలయానికి ముందు, గాలిగోపురం నిర్మించుచున్నారు. [8]

గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- 2015, సెప్టెంబరు-8వ తేదీ శ్రావణ మంగళవారం సందర్భంగా, ఈ ఆలయంలోని అమ్మవారికి పాలపొంగళ్ళు పొంగించారు. మహిళలు పొంగలి ప్రసాదాలతో మేళతాళాలతో ఊరేగింపుగా గ్రామం నుండి ఆలయానికి చేరుకున్నారు. పసుపు, కుంకుమ, పొంగలి, నూతనవస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. శ్రావణమంగళవారం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలకరించారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు,

గ్రామ ప్రముఖులు[మార్చు]

మగులురి.రమెష్

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-9; 3వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,సెప్టెంబరు-27; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,డిసెంబరు-11; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,జనవరి-25; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,నవంబరు-10; 2వపేజీ. [6] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2016,నవంబరు-15; 3వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,మార్చి-14; 1వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2017,మే-26; 1వపేజీ.