ఆరిమిల్లి రాధాకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరిమిల్లి రాధాకృష్ణ

పదవీ కాలం
2014 – 2019
నియోజకవర్గం తణుకు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1973-08-25) 1973 ఆగస్టు 25 (వయసు 50)
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
తల్లిదండ్రులు చక్రధర రావు, వెంకట లక్ష్మి
జీవిత భాగస్వామి కృష్ణ తులసి
సంతానం నిఖిల్ రత్న
నివాసం వేల్పూరు, తణుకు,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

ఆరిమిల్లి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తణుకు శాసనసభ నియోజకవర్గం నుండి 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఆరిమిల్లి రాధాకృష్ణ 1973 ఆగస్టు 25న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలం, వేల్పూరులో చక్రధర రావు, వెంకట లక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఆరిమిల్లి రాధాకృష్ణ 18 సంవత్సరాల పాటు సింగపూర్‌లో ఉద్యోగం చేసి అక్కడ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేసి 2013లో తిరిగి స్వదేశం చేరుకొని సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాడు.[2] ఆయన 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి చీర్ల రాధాకృష్ణ పై 30,948 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆరిమిల్లి రాధాకృష్ణ 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పై 2,195 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.

మూలాలు

[మార్చు]
  1. "SRI ARIMILLI RADHA KRISHNA". Government of Andhra Pradesh. Archived from the original on 18 January 2015. Retrieved 14 January 2015.
  2. Sakshi (29 April 2014). "తణుకు.. టీడీపీలో వణుకు". Archived from the original on 7 November 2023. Retrieved 7 November 2023.