ఆరోగ్య మహిళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరోగ్య మహిళ
పథకం రకంమహిళల ఆరోగ్యం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
మంత్రిత్వ శాఖరాష్ట్ర వైద్యారోగ్య శాఖ
ప్రారంభం8 మార్చి 2023 (2023-03-08)
తెలంగాణ
స్థితిఅమలులో వుంది

ఆరోగ్య మహిళ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలన్న ఉద్దేశ్యంతో మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించడంకోసం ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది.[1] ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే రెఫర్‌ చేయడంద్వారా పెద్దాసుపత్రుల్లో వారికి సాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్‌లు అందుబాటులో ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 2023 మే 30నాటికి 1,02,463 మంది పరీక్షలు చేయించుకోగా, అనుమానిత లక్షణాలు గుర్తించిన 7,177 మందిని పైదవాఖానలకు రెఫర్‌ చేశారు.

రూపకల్పన

[మార్చు]

2023 మార్చి 4న హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిర్వహించబడింది. రాష్ట్రంలో మహిళల ఆరోగ్య రక్షణకు ఇప్పటికే పలు చర్యలు, పథకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆరోగ్య మహిళ’ అనే పేరుతో మరో గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, హెల్త్‌ సెక్రటరీ రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్‌, డైరెక్టర్‌ పీఆర్‌ హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.[2]

ప్రారంభం

[మార్చు]

2023 మార్చి 8న రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీశ్ రావు కరీంనగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు.[3] మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక క్లినిక్‌లు ప్రారంభించి, ఆయా వైద్య పరీక్షలపై ప్రత్యేక యాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తారు.

2023 మార్చి 14 మంగళవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 24 జిల్లాల్లో 100 కేంద్రాల్లో వైద్య సేవలతో ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి రోజు 4793 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించబడగా, 975 మందికి అవసరమైన ఔషధాలు అందజేయబడ్డాయి. దశల వారీగా 1200 కేంద్రాలకు వైద్య సేవలను విస్తరించనున్నారు.[4][5]

పరీక్షలు

[మార్చు]

పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, బస్తీ దవాఖానల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా 57 ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే అనేక రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నారు.[6]

  1. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
  2. ఓరల్‌, సర్వైకల్‌, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్‌
  3. థైరాయిడ్‌ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం, అయోడిన్‌ సమస్య, ఫోలిక్‌యాసిడ్‌, ఐరన్‌లోపంతోపాటు విటమిన్‌ బీ12, విటమిన్‌ డీ పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేయడం
  4. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు
  5. మెనోపాజ్‌ దశకు సంబంధించి పరీక్షలు చేసి, అవసరమైన వారికి హార్మోన్‌ రీప్లేస్మెంట్‌ థెరపీ చేయడంతోపాటు కౌన్సెలింగ్‌ నిర్వహించడం
  6. నెలసరి, సంతాన సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి, వైద్యంతోపాటు అవగాహన కల్పించడం. అవసరమైనవారికి అల్ట్రాసౌండ్‌ పరీక్షలు చేయడం
  7. సెక్స్‌ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి, అవగాహన కల్పించడం. అవసరమైన వారికి వైద్యం అందించడం
  8. బరువు నియంత్రణ, యోగా, వ్యాయామంపై అవగాహన కల్పించడం

ఫలితాలు

[మార్చు]
  • 2023 ఏప్రిల్ 11న ఐదో మంగళవారం రోజున 10,025 మంది మహిళలు వైద్యసేవలు పొందారు.

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2023-03-07). "మహిళా ఆరోగ్యానికి మరో వరం". www.ntnews.com. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.
  2. "ఆమె కోసం ఆరోగ్య మహిళ". EENADU. 2023-03-07. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.
  3. "Arogya Mahila Scheme: తెలంగాణ‌లో 'ఆరోగ్య మహిళ' ప‌థ‌కం ప్రారంభం". Sakshi Education. 2023-03-08. Archived from the original on 2023-03-16. Retrieved 2023-03-16.
  4. telugu, NT News (2023-03-15). "'ఆరోగ్య మహిళ' షురూ". www.ntnews.com. Archived from the original on 2023-03-15. Retrieved 2023-03-16.
  5. ABN (2023-03-15). "'ఆరోగ్య మహిళ' ప్రారంభం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-14. Retrieved 2023-03-16.
  6. Desk, HT Telugu (2023-03-05). "Arogya Mahila Scheme: మహిళల కోసం మరో కొత్త స్కీమ్.. ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు". Hindustantimes Telugu. Archived from the original on 2023-03-07. Retrieved 2023-03-07.