Jump to content

ఆర్తి సింగ్ రావు

వికీపీడియా నుండి
ఆర్తి సింగ్ రావు
ఆర్తి సింగ్ రావు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 అక్టోబరు 17
గవర్నరు బండారు దత్తాత్రేయ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 అక్టోబరు 8
ముందు సీతారాం యాదవ్
నియోజకవర్గం అటేలి

వ్యక్తిగత వివరాలు

జననం (1979-07-03) 1979 జూలై 3 (వయసు 45)
భగవత్ భక్తి ఆశ్రమం దగ్గర, రాంపుర, రేవారి, హర్యానా, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు రావు ఇంద్రజిత్ సింగ్, మానిట సింగ్
నివాసం రేవారి
పూర్వ విద్యార్థి గ్రాడ్యుయేట్
వృత్తి రాజకీయ నాయకురాలు & అంతర్జాతీయ స్కీట్ షూటర్

ఆర్తి సింగ్ రావు హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 లో హర్యానా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై,[1][2] 2024 అక్టోబరు 17 న నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో ఆరోగ్య, వైద్య విద్య & పరిశోధన ఆయుష్ శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టింది.[3]

షూటింగ్ కెరీర్

[మార్చు]

ఆర్తి సింగ్ 1998లో షూటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించి 1999లో తన మొదటి పోటీలో పాల్గొని ఆసియా గేమ్స్‌లో బహుళ పతకాలను గెలిచింది. ఆమె 2005 ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్‌, ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు, 2005 లో ఒక స్వర్ణం, 2003, 2009 లో రెండు రజతాలు, 2004 లో ఒక కాంస్యం గెలుచుకుంది. ఆమె 2001 దోహాలో రెండు స్కీట్ షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్‌లలో ఆడింది. 2012 మారిబోర్ రెండుసార్లు తొమ్మిదో ర్యాంక్‌తో, 2009 మారిబోర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆమె అత్యుత్తమ ర్యాంక్ 20ని సాధించింది.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆర్తి సింగ్ రావు రాజకీయ కుటుంబం నుండి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024 ఎన్నికలలో అటేలి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అత్తర్ లాల్ పై 3085 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[5][6] 2024 అక్టోబరు 17 న నాయబ్ సింగ్ సైనీ మంత్రివర్గంలో ఆరోగ్య, వైద్య విద్య & పరిశోధన ఆయుష్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[7]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. ThePrint (8 October 2024). "BJP's Arti Rao wins close contest with BSP's Attar Lal in Ateli. Congress's Anita Yadav a distant 3rd". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  3. The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  4. The Indian Express (19 July 2024). "Shooting range to the poll arena, Union Minister Rao Inderjit's daughter has a new goal in her sights" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  5. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Ateli". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
  6. The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
  7. The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.