Jump to content

రాజనాల నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
(ఆర్‌.నాగేశ్వరరావు నుండి దారిమార్పు చెందింది)

రాజనాల ఇంటిపేరుతో ఉన్న అయోమయ నివృత్తి పేజీ రాజనాల చూడండి.

ఆర్. నాగేశ్వరరావు

ఆర్‌.నాగేశ్వరరావుగా ప్రసిద్ధుడైన తెలుగు సినిమా నటుని పూర్తి పేరు రాజనాల నాగేశ్వరరావు (1928 - 1959). విలన్‌ అంటే గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు ఉన్న వ్యక్తులు మన కళ్ళ ముందు మెదులుతారు. అయితే అవేమీ అక్కరలేకుండా విలన్‌ పాత్రధారి కూడా హీరో తరహాలో సాత్వికంగా కనబడవచ్చని, అతనిలోని క్రూరత్వానికి, బయటకు కనిపించే ఆకారానికి సంబంధం లేదని ‘విలనీ’కి కొత్త అర్ధం చెప్పిన విలక్షణ నటుడు ఆర్‌.నాగేశ్వరరావు. "బాబులు గాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి" అంటూ ఆయన చెప్పిన డైలాగ్‌ అప్పట్లో అందరి నోటా వినిపించేది. అదే నోటితో ఆయన చెప్పిన "అదే మామా మన తక్షణ కర్తవ్యం" అంటూ పలికిన డైలాగ్‌ కూడా ఇప్పటికీ మరచిపోలేం. మొదటి డైలాగ్‌ అన్నపూర్ణా వారి దొంగరాముడు చిత్రంలోనిది కాగా, రెండవది విజయా వారి మాయాబజార్ చిత్రంలోనిది. కౄరమైన పాత్రలు పోషించడంలో ఆర్‌.నాగేశ్వరరావు తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇల్లరికం, ఇంటిగుట్టు, ఇలవేల్పు, శభాష్‌ రాముడు వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. విలన్‌ పాత్రలు వేయడంలో ఆయన ఎంత దిట్టో, వ్యక్తిగతంగా అంత వినయశీలి, సౌమ్యుడు. తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న ఆర్‌.నాగేశ్వరరావు ఒకసారి కోడంబాక్కం అడవుల్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఆయన జీపునకు అడ్డంగా ఒక పులి వచ్చి నిలబడింది. అది ఆయనపై దూకడానికి సిద్ధపడడంతో చాకచక్యంగా జీపు నడిపి జీపుతో పులిని ఢీకొని చంపేశారు. ఆ విధంగా మృత్యువుని జయించిన ఆయన కొద్దిరోజుల్లోనే క్షయవ్యాధి బారినపడి తన 33వ ఏటనే కన్నుమూశారు. అప్పటికే ఆయనకు భార్య, అయిదుగురు పిల్లలు ఉన్నారు. విధికి తలవంచిన మంచి నటుడుగా రాజనాల నాగేశ్వరరావు పరిశ్రమ గుండెల్లో పదిలంగా ఉండిపోతారు.

పేరుతెచ్చిన సినిమాల జాబితా

[మార్చు]
  1. దేవదాసు (1953)
  2. కన్నతల్లి (1953) .... చలపతి
  3. పరోపకారం (1953)
  4. అగ్గి రాముడు (1954)
  5. దొంగ రాముడు (1955) .... బాబులు
  6. జయం మనదే (1956)
  7. మాయా బజార్ (1957) .... దుశ్శాసనుడు
  8. వినాయక చవితి (1957)
  9. పెళ్ళినాటి ప్రమాణాలు (1958) .... భీమసేనా రావు కొడుకు
  10. అప్పు చేసి పప్పు కూడు (1958) .... రామ్ సింగ్
  11. ముందడుగు (1958)
  12. ఇల్లరికం (1959) .... శేషగిరి
  13. పెళ్ళిసందడి (1959)

వనరులు

[మార్చు]