Jump to content

ఆర్.ఎ. స్వరూప్

వికీపీడియా నుండి
ఆర్.ఎ. స్వరూప్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రాయపెత్ అర్జున్ స్వరూప్
పుట్టిన తేదీ (1965-08-20) 1965 ఆగస్టు 20 (వయసు 59)
సికింద్రాబాదు, తెలంగాణ, భారతదేశం
ఎత్తు5 అ. 11 అం. (1.80 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుస్పిన్ బౌలింగ్
పాత్రఆల్-రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1987/88–1994/95హైదరాబాదు క్రికెట్ జట్టు
1995/96–2000/01బరోడా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 69 32
చేసిన పరుగులు 3,475 710
బ్యాటింగు సగటు 35.45 27.30
100లు/50లు 7/18 0/4
అత్యధిక స్కోరు 165 79
వేసిన బంతులు 10,061 1,409
వికెట్లు 132 33
బౌలింగు సగటు 29.65 26.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 6 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 n/a
అత్యుత్తమ బౌలింగు 6/121 4/37
క్యాచ్‌లు/స్టంపింగులు 56/– 9/–
మూలం: ఇఎస్పిఎన్ క్రిక్ ఇన్ఫో, 2016 మార్చి 20

అర్జున్ స్వరూప్, (జననం 20 ఆగస్టు 1965) హైదరాబాదుకు చెందిన భారతీయ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్. హైదరాబాదు, బరోడా క్రికెట్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తరువాత హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్‌గా కూడా పనిచేశాడు.

క్రీడారంగం

[మార్చు]

స్వరూప్ 1987/88 సీజన్లో హైదరాబాదు క్రికెట్ జట్టు తరఫున కుడిచేతి వాటం, స్పిన్ బౌలింగ్ చేసిన ఆల్ రౌండర్ గా క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. 1994/95 సీజన్ వరకు జట్టు కోసం ఆడాడు. ఆ తరువాత సీజన్ లో బరోడాకు మారి అక్కడ ఆరు సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాడు.[1]

స్వరూప్ సౌత్ జోన్, వెస్ట్ జోన్, బోర్డు ప్రెసిడెంట్స్ XI ల మ్యచ్ లలో కూడా ఆడాడు. తన 69 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో 35.45 సగటుతో 3475 పరుగులు చేశాడు, 29.65 తో 132 వికెట్లు తీసుకున్నాడు. తన లిస్ట్ ఎ కెరీర్‌లో 30 కి పైగా వికెట్లు తీస్తూ, 700 ప్లస్ పరుగులు చేశాడు.[2]

పదవీ విరమణ తరువాత, హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ సీనియర్ టీమ్ సెలక్షన్ ప్యానెల్ సభ్యుడిగా పనిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1965, ఆగస్టు 20న సికింద్రాబాద్‌లో జన్మించిన స్వరూప్, 1970 లలో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నాడు. పాఠశాల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ జట్టులో సత్య నాదెళ్ళ కూడా ఆఫ్ స్పిన్నర్‌గా ఆడాడు. స్వరూప్ ఐఎల్ఎఫ్ఎస్ జనరల్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Rayapeth Swaroop". CricketArchive. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  2. "RA Swaroop". ESPNcricinfo. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= (help)
  3. "Abdul Azeem named Hyderabad coach". Deccan Chronicle. సెప్టెంబరు 12 2014. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  4. Subrahmanyam, V V (ఫిబ్రవరి 27 2014). "Skipper's simple move changed Satya". The Hindu. Retrieved జూలై 21 2021. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)

బయటి లింకులు

[మార్చు]