ఆర్.వి.గురుపాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆర్.వి.గురుపాదం
జననం1970 జనవరి 1
మరణం2023 ఫిబ్రవరి 4(2023-02-04) (వయసు 53)
వృత్తిసినిమా నిర్మాత

ఆర్వీ గురుపాదం (1970 జనవరి 1 - 2023 ఫిబ్రవరి 4) దక్షిణ భారత సినిమా నిర్మాత. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో జి.ఆర్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలో 25 చిత్రాలకు పైగా నిర్మించారు. ఆయన కెరీర్ లో ప్రముఖంగా తమిళంలో ఇరు నిలవుగల్ (1977), హిందీలో శ్రీదేవి కథానాయికగా అకల్ మండ్ (1983), టాలీవుడ్ లో ఇదు సరిత (1984), వయ్యారి భామలు వగలమారి భర్తలు, పులి బొబ్బిలి, సొమ్ము ఒకడిది సోకు ఒకడిది, తిరుపతి క్షేత్ర మహాత్యం చిత్రాలు ఉన్నాయి. పలు తమిళ, మలయాళ చిత్రాలను తెలుగులోకి అనువాద చిత్రాలుగా ఆయన తీసుకొచ్చారు.

మరణం

[మార్చు]

53 ఏళ్ల ఆర్.వి. గురుపాదం బెంగళూరులోని తన నివాసంలో 2023 ఫిబ్రవరి 4న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "RV Gurupadam: సీనియర్‌ నిర్మాత గురుపాదం కన్నుమూత". web.archive.org. 2023-02-04. Archived from the original on 2023-02-04. Retrieved 2023-02-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Namasthe Telangana (4 February 2023). "ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత గురుపాదం మృతి..!". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.