ఆలపాటి అప్పారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

డాక్టర్ ఆలపాటి అప్పారావు వ్యవసాయశాస్త్రవేత్త, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వివిద్యాలయ విశ్రాంత కులపతి.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన గుంటూరు జిల్లా యడ్లపల్లి గ్రామం లో 1926 జూలై 1 న జన్మించారు. స్థానికంగా ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు వ్యవసాయ డిగ్రీ బీఎస్సీ చదివారు. 1945లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో మొదటి ర్యాంకుతో ఉత్తీర్ణులయ్యారు. 1957లో వరిలో "అగ్గితెగులు" పై పరిశోధన పత్రం రాసి పీహెచ్‌డీ పొందారు. అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పత్తి పంటపై పరిశోధనా సహాయకుడుగా చేరారు.[2] పరిశోధనానంతర కోర్సును అమెరికాలోని కన్సాస్ విశ్వవిద్యాలయంలో 1962లో పూర్తిచేసారు. ప్రత్తిపంటపై పరిశోధనా సహాయకుడిగా నంద్యాల పరిశోధనా కేంద్రంలో చేరిన ఆయన మొక్కల తెగుళ్ళపై ప్రొఫెసరుగా 1967లో ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయంలో పదోన్నతి పొందినారు. అంచెలంచెలుగా ఎదిగి 1973-1982 మధ్యకాలంలో విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకుడిగా పనిచేసారు. తరువాత ప్రపంచబ్యాంకులో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేసారు. తిరిగి వచ్చి, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా 1985 నుండి 1991 వరకు బాధ్యతలు నిర్వహించారు. వ్యవసాయ అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా, పాలకుడిగా అత్యుత్తమ సేవలందించిన అప్పారావుగారు, పలు పురస్కారాలు అందుకున్నారు. జాతీయ వ్యవసాయశాస్త్ర విజ్ఞాన సంస్థలో "ఫెలో" తో పాటు, పలు ఇతర సంస్థలలో, కమిటీలలో సభ్యులుగా ఆయన సేవలందించారు. "ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్" అను సంస్థ నుండి ప్రతిష్టాత్మకమైన "ఆర్ & డి లింకర్" పురస్కారాన్ని సైతం ఆయన అందుకున్నారు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయనకు భార్య స్వర్ణకుమారి, ముగ్గురు కుమారులు సాంబశివప్రసాద్, హరిప్రసాద్‌, శివశంకరప్రసాద్‌ ఉన్నారు.

మరణం[మార్చు]

ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతూ సోమాజీగూడ యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మే 7 2014 న మరణించారు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]