ఆలమండ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆలమండ శాసనసభ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1952లో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన ఆలమండ శాసనసభ నియోజకవర్గం, 1955లో ఆంధ్ర రాష్ట్రంలో రద్దయ్యి రేవిడి శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1] 1952లో ఈ నియోజకవర్గం నుండి సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి మద్రాసు శాసనసభకు ఎన్నికైన కె.వి.ఆర్.ఎస్.పద్మనాభరాజు, ఆ తర్వాత కొద్దికాలానికే రాజీనామా చేసి, తత్ఫలితంగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1953 (ఉప ఎన్నిక) ఆలమండ కాకర్లపూడి విజయ రాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు పు ప్రజా సోషలిస్టు పార్టీ ఏకగ్రీవం
1952 ఆలమండ కాకర్లపూడి విజయ రాఘవ సత్యనారాయణ పద్మనాభరాజు పు సోషలిస్టు పార్టీ 32078 జి.వి.అప్పారావు పు కాంగ్రేసు 14616

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 27.