ఆలీసాగర్ జలాశయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలీసాగర్ జలాశయం
ప్రదేశంతెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు18°46′30″N 43°33′36″E / 18.7749°N 43.56°E / 18.7749; 43.56
రకంజలాశయం
ప్రవహించే దేశాలుభారతదేశం

ఆలీసాగర్ జలాశయం, అనేది నిజామాబాదు జిల్లా, ఎడపల్లి మండలం, థానాకలాన్ గ్రామంలోని ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం బ్యాక్ వాటర్ కోసం నిర్మించిన జలాశయం. నిజామాబాదు పట్టణం నుండి 13 కి.మీల దూరంలో ఈ జలాశయం ఉంది.[1] నవీపేట, రేంజల్, ఎడపల్లి, నిజామాబాదు, డిచ్‌పల్లి, మాక్లూర్ మండలాల్లో ఉన్న నిజాంసాగర్ ఆయకట్టులోని 53,793 ఎకరాలకు సాగునీటి పారుదల స్థిరీకరణకోసం ఆలీసాగర్ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు.

పర్యాటక ప్రదేశం[మార్చు]

ఈ జలాశయం సమీపంలోని 33 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ నిజాంలు ఏర్పాటుచేసిన చేసిన తోట ఉంది. ఇందులో ఆకర్షణాయమైన ఫౌంటైన్‌లు, ట్రీ హౌస్, పూల తోటలు ఉన్నాయి. 1985లో ఇక్కడ జింకల పార్కుకు ఏర్పాటు చేయబడింది. ఈ పార్కులో అనేక రకాల జింకలు కూడా ఉన్నాయి.[2] ఆలీసాగర్ జలాశయం మధ్యలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపానికి చేరుకోవడానికి బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. కొండపైన అతిథి గృహం, ట్రెక్కింగ్ ఇక్కడి ప్రత్యేకతలు.[3]

సందర్శకులే కాకుండా, షార్ట్ ఫిల్మ్ లేదా వీడియో మేకర్స్ కూడా రిజర్వాయర్‌ దగ్గరికి వచ్చి అందమైన ప్రకృతి దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు. ఫోటోగ్రాఫర్‌లు సైట్‌లో ప్రీ-వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లను నిర్వహిస్తున్నారు.[4]

Alisagar lake
అలీసాగర్ జలాశయం

ఇతర వివరాలు[మార్చు]

ఇక్కడ ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ నుండి నిజామాబాద్‌కి నీరు అందుతోంది. నిజామాబాద్ కోటను నిర్మించిన రఘునాథ్ దాస్ ఈ ట్యాంక్ నిర్మించాడు. ఈ జలాశయంలో అరుదైన చేపలు లభిస్తాయి.[5]

మూలాలు[మార్చు]

  1. "ALISAGAR RESERVOIR - TELANGANA TOURISM". tourism.telangana.gov.in. Archived from the original on 2022-04-29. Retrieved 2022-04-29.
  2. "Ali Sagar Deer Park Wild Life in Telangana :: Telangana Tourism". telanganatourism.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2022-01-12. Retrieved 2022-04-29.
  3. "Alisagar Reservoir - IndiaAirport.com". indiaairport.com. Archived from the original on 2022-04-29. Retrieved 2022-04-29.
  4. "Alisagar reservoir to be next tourist attraction in Telangana's Nizamabad district". The New Indian Express. 2021-11-15. Archived from the original on 2021-11-15. Retrieved 2022-05-02.
  5. "అలీసాగర్‌లో భారీ చేప లభ్యం". www.andhrajyothy.com (in ఇంగ్లీష్). 2021-07-11. Archived from the original on 2021-07-11. Retrieved 2022-04-29.