ఆల్ట్ బాలాజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆల్ట్ బాలాజీ
Typeఅనుబంధ సంస్థ
పరిశ్రమవినోదం, మాస్ మీడియా
GenreOTT ప్లాట్‌ఫారమ్ (ఓవర్-ది-టాప్ మీడియా సర్వీస్)
స్థాపన2017; 7 సంవత్సరాల క్రితం (2017)
Foundersఏక్తా కపూర్
ప్రధాన కార్యాలయంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
Areas served
ప్రాంతాల సేవలు
Key people
శోభా కపూర్ (మేనేజింగ్ డైరెక్టర్, బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్)

ఏక్తా కపూర్ (జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, బాలాజీ టెలిఫిలిమ్స్ లిమిటెడ్)
నచికేత్ పంత్వైద్య (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)
ఫైజ్ ఖాన్ (చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్)

ప్రజ్వల్ కౌశిక్ (సినిమా దర్శకుడు)
Productsప్రజ్వల్ కౌశిక్
Services
  • సినిమా నిర్మాణం
  • సినిమా పంపిణీ
  • టెలివిజన్ ప్రొడక్షన్
Ownerబాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్
Websitealtbalaji.com Edit this on Wikidata

ఆల్ట్‌ బాలాజీ (ఆంగ్లం: ALTBalaji) అనేది భారతీయ సబ్‌స్క్రిప్షన్ ఆధారిత వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫారమ్. ఇది బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ.[1][2][3] డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో అసలైన OTT కంటెంట్‌ని రూపొందించడానికి ఆల్ట్ బాలాజీ ముంబై నగరంలో ప్రధాన కేంద్రంగా 2017 ఏప్రిల్ 16న ప్రారంభించబడినది.[4][5]

ఫార్చూన్ ఇండియాలో 2020 వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో బాలాజీ టెలిఫిల్మ్స్ జాయింట్ డైరెక్టర్ ఎక్తా కపూర్ ఒకరిగా చోటు దక్కింది. దీనికి కారణం ఆమె నాయకత్వంలో ప్రైమ్ టైమ్ వ్యూయిర్ షిప్ 18శాతం షేర్ దక్కించుకుని, మొత్తంగా OTT ప్లాట్ ఫాంపై ఆదాయం 77 కోట్లకు చేరడమే. కాగా 2012లోనూ ఆమె ఫోర్భ్స్ ఏసియాలో శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. కళల రంగంలో ఏక్తా కపూర్ చేసిన కృషికి 2020లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.[6]

ప్లాట్ ఫామ్స్[మార్చు]

ప్రపంచంలోని వివిధ మూలల్లో భారతీయ సీరియల్‌లు, వినోద కార్యక్రమాలను చూడలేని విదేశీ భారతీయులందరికి చేరవేయడమే ఆల్ట్ బాలాజీ ప్రధాన లక్ష్యం. కాగా వీక్షకులకు 32 విభిన్న ఇంటర్‌ఫేస్‌లలో ఇది అందుబాటులో ఉంది. ఈ కంటెంట్ మొబైల్, టాబ్లెట్ పరికరాలలో (యాపిల్ ఫోన్, యాపిల్ ఐప్యాడ్, ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ టాబ్లెట్), వెబ్ బ్రౌజర్ (డెస్క్‌టాప్ బ్రౌజర్), ఆండ్రాయిడ్ టీవీ, విండోస్ (విండోస్ పిసి, విండోస్ మొబైల్, విండోస్ టాబ్లెట్)లో అందుబాటులో ఉంది.[7]

షోలు[మార్చు]

2022లో ఆల్ట్ బాలాజీ నాలుగు షోలను మాత్రమే విడుదల చేసింది, అవి లాక్ ఉప్ (సీజన్ 1), పవిత్ర రిష్తా (సీజన్ 2), అపరన్ (వెబ్ సిరీస్) (సీజన్ 2), కోడ్ ఎం (సీజన్ 2). ప్రస్తుతం డ్రామా, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ వంటి కథల శైలితో OTT కంటెంట్ బ్యాంక్‌లో భారతదేశంలోని అగ్ర నటులు, దర్శకులు ఉన్నారు. కంటెంట్ బ్యాంక్‌లో 100+ గంటల పిల్లల కంటెంట్ అలాగే బెంగాలీ, హిందీ, మరాఠీ, పంజాబీ, తమిళం.. ఇలా అనేక ఇతర భాషలలో పట్టణ ప్రాంతీయ షోలు ఉన్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే విడుదలైన సంవత్సరం, వ్యవధి, స్టార్ తారాగణం, భాష, జానర్ వివరాలతో కూడిన బాలీవుడ్ హిట్‌లు ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో జాన్ అబ్రహం, సన్నీ లియోన్, అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా, సోనాక్షి సిన్హా, ఇమ్రాన్ హష్మీ మొదలైన ప్రముఖ బాలీవుడ్ నటుల హిట్‌లు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. Paul, Binu (14 August 2015). "TV serials & movie producer Balaji Telefilms launches online platform with original digital content". VCCircle. Retrieved 12 May 2017.
  2. "ALT Digital Media Entertainment Ltd. – Balaji Telefilms Ltd". Balaji Telefilms. Retrieved 12 May 2017.
  3. Paul, Binu (13 August 2015). "Balaji Telefilms Launches ALTBalaji Mobile App". News18. Retrieved 12 May 2017.
  4. Jha, Lata (14 April 2017). "Balaji launches online streaming platform ALTBalaji". Mint. Retrieved 12 May 2017.
  5. "बालाजी टेलीफिल्म के एप 'ALT बालाजी' के लॉन्च पर नजर आए इंडस्ट्री के तमाम सितारे". ABP Live (in హిందీ). Archived from the original on 22 May 2017. Retrieved 12 May 2017.
  6. "అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళల్లో ఆ ముగ్గురు.. వీరి సంపాదన ఎంతంటే? - 10TV Telugu". web.archive.org. 2023-03-06. Archived from the original on 2023-03-06. Retrieved 2023-03-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. Malik, Tanya (15 August 2015). "Ekta Kapoor launches Alt Balaji Application, promises content for everyone". Woman's Era. Archived from the original on 18 April 2017. Retrieved 12 May 2017.