సిద్ధార్థ్ మల్హోత్రా
సిద్దార్ధ్ మల్హోత్రా (జననం 16 జనవరి 1985)[1][2] ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ మోడల్. తన 18వ ఏటన మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు దర్శకుడు కరణ్ జోహార్ వద్ద సహాయ దర్శకునిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. కరణ్ దర్శకత్వంల్) స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు సిద్ధార్ధ్. ఈ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ మేల్ డెబ్యూ పురస్కారం అందుకున్నారు.
2014లో హసేతో ఫసే, ఏక్ విలన్, 2016లో కపూర్ & సన్స్ సినిమాల్లో నటించారు సిద్దార్ధ్. ఏక్ విలన్, కపూర్ & సన్స్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1 బిలియన్ వసూళ్ళు సాధించాయి.
జీవిత సంగ్రహణ, కెరీర్[మార్చు]
తొలినాళ్ళ జీవితం, మొదటి చిత్రం[మార్చు]
పంజాబీ హిందూ కుటుంబంలో 16 జనవరి 1985న ఢిల్లీలో జన్మించారు సిద్దార్ధ్.[3] తండ్రి సునిల్ మర్చెంట్ నేవీ లో కెప్టెన్ గా పని చేశారు. తల్లి రీమా మల్హోత్రా గృహిణి.[4] ఢిల్లీలోని డాన్ బొస్కో స్కూల్, బిర్లా విద్యా నికేతన్, షాహిద్ భగత్ సింగ్ కళాశాలలోనూ చదువుకున్నారు ఆయన.[5] తన 18వ ఏట మోడలింగ్ మొదలు పెట్టారు. మోడలింగ్ వృత్తిలో ఆయన విజయవంతంగానే ఉన్నా, 4 ఏళ్ళ తరువాత తాను అసంతృప్తిగా ఉన్నానంటూ ఆ వృత్తిని వదిలేశారు సిద్ధార్ధ్.[6] నటునిగా మారాలని అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాకు ఆడిషన్స్ కు వెళ్ళారు ఆయన. ఆయన్ను ఎంపిక చేసినప్పటికీ, సినిమా మొదలవ్వలేదు. ఆ తరువాత మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు దర్శకుడు కరణ్ జోహార్ వద్ద సహాయ దర్శకునిగా చేరారు సిద్ధార్ధ్.[5][7]
2012లో కరణ్ దర్శకత్వంలో స్టుడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో నటునిగా తెరంగేట్రం చేశారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్, ఆలియా భట్ లతో కలసి నటించారాయన. ఈ సినిమాలోని సిద్ధార్ధ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి.[8] ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది. 700 మిలియన్ వసూళ్ళు సాధించింది.[9][10]
ఆ తరువాత 2014లో పరిణీతి చోప్రా, అదా శర్మ హీరోయిన్లుగా హసీ తో ఫసీ సినిమాలో నటించారు సిద్ధార్ధ్. ఈ సినిమాలో పరిణీతి, సిద్దార్ధ్ ల కెమిస్ట్రీ బాగా కుదిరిందని విమర్శకులు మెచ్చుకున్నారు. ఎన్డీటీవీ కి చెందిన విమర్శకుడు సైబల్ చటర్జీ, సిద్దార్ధ్ నటనను తొలినాళ్ళ అమితాబ్ బచ్చన్ నటనతో పోల్చి ప్రశంసించారు.[11][12] సినిమా మంచి హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా 620 మిలియన్ వసూళ్ళు సాధించింది.[13]
కెరీర్ లో పెద్ద మలుపు-ఏక్ విలన్[మార్చు]
2014లో మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఏక్ విలన్ సినిమాలో సీరియల్ హంతకునిగా నటించారు సిద్దార్ధ్. ప్రముఖ పత్రికల విమర్శకులు అయన నటనకు ప్రశంసలు కురిపించారు.[14] కొరియన్ సినిమా నుంచి కథను తీసుకున్నారని వచ్చిన ఆరోపణలను దర్శకుడు మోహిత్ తోసిపుచ్చారు.[15] ఒక్క భారత్ లోనే 1 బిలియన్ వసూళ్ళు రాబట్టింది ఈ సినిమా.[16] ఈ సినిమా విజయం ఆయన కెరీర్ లోనే అతిపెద్ద మలుపుగా నిలిచింది. ఈ తరం బాలీవుడ్ నటుల్లో అత్యంత విజయవంతమైన హీరోగా సిద్దార్ధ్ ను నిలబెట్టిన సినిమా ఇది.[17][18]
2015లో హాలీవుడ్ సినిమావారియర్ (2011)కు రీమేక్ అయిన బ్రదర్స్ సినిమాలో నటించారు సిద్దార్ధ్. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలోఅక్షయ్ కుమార్తో కలసి ఈ సినిమాలో కనిపించారాయన.[19][20] ఈ సినిమా ఫ్లాప్ అయింది.[21] కానీ ఆ తరువాత ఆయన నటించిన కపూర్ & సన్స్ కమర్షియల్ గా హిట్ కావడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.[22][23] ది హిందూ పత్రికకు చెందిన విమర్శకులు నమ్రతా జోషి సినిమాలో సిద్దార్ధ్ నటనను బాగా ప్రశంసించారు.[24][25]
2016 నిత్యా మెహ్రా దర్శకత్వంలో కత్రినా కైఫ్ తో కలసి బార్ బార్ దేఖో సినిమా పూర్తిచేశారు.[26] ప్రస్తుతం జాక్వెలైన్ ఫెర్నాండేజ్ తో కలిసి ఒక యాక్షన్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. రాజ్ నిడిమోరు, కృష్ణ.డి.కెలు దర్శకత్వం వహిస్తున్నారు.[27] మోహిత్ సూరి దర్శకత్వంలో ఆలియా భట్ తో కలసి ఆషికీ-3లో నటించడానికి ఒప్పుకున్నారు.[28] ఐట్టెఫక్ (1969) సినిమా రీమేక్ లో కూడా నటించనున్నారు సిద్దార్ధ్.[29]
సినిమాలు కాక...[మార్చు]
సినిమాల్లో నటించడమే కాక, చాలా బ్రాండ్లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా ఉంటున్నారు సిద్దార్ధ్. కోకో-కోలా, కొర్నెటో అమెరికన్ స్వాన్ వంటి అంతర్జాతీయ ఉత్పత్తుల ఎడ్వర్టైజ్మెంట్లలో కనిపిస్తారు ఆయన.[30] 2013లో ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్ధం చేసిన కార్యక్రమంలో వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, శ్రద్ధ కపూర్, హుమా కురేషిలతో కలసి పాల్గొన్నారు సిద్దార్ధ్.[31] పెటా సంస్థతో కలసి కుక్కల రక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు కూడా చేశారాయన.[32]
సినిమాలు[మార్చు]
అవార్డులు, నామినేషన్లు[మార్చు]
ఇతర గౌరవాలు[మార్చు]
- 2014: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2013[33]
- 2013: టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ మెన్ ఆఫ్ 2013[34]
- 2013: టైమ్స్ ఆఫ్ ఇండియా హాట్ లిస్ట్ మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ 2012
- 2013: టైమ్స్ ఆఫ్ ఇండియా 50 హాండ్సం హంక్స్ ఇన్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా[35]
- 2014:వాగ్ బ్యూటీ అవార్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ మ్యాన్[36]
References[మార్చు]
- ↑ "Sidharth Malhotra turns 30, ready for 'action'". The Times of India. Retrieved 10 September 2015.
- ↑ "Happy Birthday Sidharth Malhotra: 'Ek Villain' actor gets ready for 'action' at 30". The Indian Express. Indo-Asian News Service. Retrieved 10 September 2015.
- ↑ Lakhe, Amruta (7 February 2014). "Sidharth Malhotra talks about his journey from being the junior most to a lead actor". The Indian Express. Retrieved 9 January 2016.
- ↑ Iyer, Meena (30 June 2012). "Siddharth Malhotra's short journey to stardom". The Times of India. Retrieved 17 June 2014.
- ↑ 5.0 5.1 Gupta, Priya (11 December 2013). "I was dating a South African girl, but I'm now single: Sidharth Malhotra". The Times of India. Retrieved 17 June 2014.
- ↑ Lakhe, Amruta (7 February 2014). "Sidharth Malhotra talks about his journey from being the junior most to a lead actor". The Indian Express. Retrieved 17 June 2014.
- ↑ "The new stars of Bollywood". Hindustan Times. 31 December 2010. Archived from the original on 5 అక్టోబరు 2012. Retrieved 27 September 2012.
- ↑ Masand, Rajeev (20 October 2012). "'Student of the Year' Review: If fun is what you're seeking, you won't be disappointed". CNN-IBN. Archived from the original on 21 అక్టోబరు 2012. Retrieved 19 March 2014.
- ↑ "Sidharth Malhotra". Box Office India. Retrieved 6 April 2014.
- ↑ "Box office verdict 2012". Koimoi.com. Archived from the original on 20 ఫిబ్రవరి 2014. Retrieved 19 March 2014.
- ↑ Basu, Mohar (7 February 2014). "Hasee Toh Phasee Movie Review: Sidharth Malhotra, Parineeti Chopra". Koimoi.com. Retrieved 8 May 2014.
- ↑ Chatterjee, Saibal (7 February 2014). "Hasee Toh Phasee movie review". NDTV. Archived from the original on 23 మే 2014. Retrieved 5 July 2014.
- ↑ "Top Worldwide Grossers 2014". Box Office India. 8 May 2014. Retrieved 8 May 2014.
- ↑ Gupta, Shubhra (30 June 2014). "Ek Villain review: Sidharth Malhotra is watchable but has hard time doing menace". The Indian Express. Retrieved 5 July 2014.
- ↑ "Ek Villain not inspired by Korean film, says Mohit Suri". India Today. 28 May 2014. Retrieved 27 June 2014.
- ↑ Mobhani, Suleman. "Bollywood's 100 Crore club". Bollywood Hungama. Retrieved 11 July 2014.
- ↑ "Ek Villain changed Sidharth Malhotra's luck?". The Times of India. 4 July 2014. Retrieved 5 July 2014.
- ↑ Sinha Jha, Priyanka (4 July 2014). "Newbie Central". The Financial Express. Retrieved 5 July 2014.
- ↑ "Akshay Kumar, Sidharth Malhotra's 'Brothers' shoot over". Indian Express. 18 April 2015. Retrieved 18 April 2015.
- ↑ Ramachandran, Naman (22 August 2014). "Akshay Kumar to Star in Lionsgate, Endemol Indian Remake 'Warrior'". Variety. Retrieved 22 August 2014.
- ↑ "'Brothers' box-office: Akshay Kumar-Sidharth Malhotra starrer collects about Rs 70.61 crore in 3 weeks". The Times of India. 9 September 2015. Retrieved 18 March 2016.
- ↑ Mehta, Ankita (28 March 2016). "Box office collection: Now 'Kapoor & Sons' to cross Rs 100 crore mark in India; 'Neerja' earns Rs 75 crore". International Business Times. Retrieved 28 March 2016.
- ↑ Sarkar, Suparno (18 March 2016). "'Kapoor & Sons' review round-up: Here is what critics have to say about the rom-com". International Business Times. Retrieved 28 March 2016.
- ↑ Bhattacharya, Ananya (18 March 2016). "Kapoor and Sons movie review: Fawad, Alia, Sidharth in a madhouse drama". India Today. Retrieved 18 March 2016.
- ↑ Joshi, Namrata (18 March 2016). "Kapoor & Sons: The ultimate family film". The Hindu. Retrieved 18 March 2016.
- ↑ "Sidharth Malhotra, Katrina Kaif wrap up 'Baar Baar Dekho'". CNN IBN. 16 April 2016. Retrieved 17 April 2016.
- ↑ "Sidharth Malhotra, Jacqueline Fernandez start shooting for their action film". The Indian Express. 8 May 2016. Retrieved 8 May 2016.
- ↑ "Confirmed: Rumoured lovebirds Alia Bhatt and Sidharth Malhotra to star in Aashiqui 3". India Today. 12 April 2016. Retrieved 17 April 2016.
- ↑ "Sidharth Malhotra to be seen in remake of Rajesh Khanna's 'Ittefaq'". Daily News and Analysis. 13 June 2016. Retrieved 14 June 2016.
- ↑ "Sidharth Malhotra to endorse American Swan". The Indian Express. 9 March 2015. Retrieved 9 March 2015.
- ↑ "Varun Dhawan, Alia Bhatt and Siddharth Malhotra unite for a cause | Latest News & Updates at Daily News & Analysis". Dnaindia.com. 10 August 2013. Retrieved 8 May 2014.
- ↑ "Sidharth Malhotra shoots for PETA". Indian Express. 4 July 2013. Retrieved 8 May 2014.
- ↑ "Times Most Desirable Men 2013 – Results". ITimes. Retrieved 22 July 2014.
- ↑ "Times Most Desirable Men 2012 – Results". ITimes. Retrieved 20 June 2013.
- ↑ "Siddharth Malhotra: Karan Johar's new find, Delhi boy Siddharth Malhotra has the dashing looks and a strong screen presence which got him the title of the most promising debutant of the year 2012". The Times Of India.
- ↑ "Meet the Vogue Beauty Awards 2014 winners". 22 July 2014. Retrieved 25 July 2014.