ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్
జననంAlbert Saperstein
(1906-08-26)1906 ఆగస్టు 26
Białystok, Russian Empire
మరణం1993 మార్చి 3(1993-03-03) (వయసు 86)
Washington, D.C, United States
Heart Failure
పౌరసత్వంPoland, United States
రంగములుimmunology, virology
చదువుకున్న సంస్థలున్యూయార్క్ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధిoral polio vaccine
ముఖ్యమైన పురస్కారాలుsee article

ఆల్బర్ట్ బ్రూస్ సాబిన్ (జననం అబ్రామ్ శాపర్‌స్టీన్ ; 1906 ఆగస్టు 26 - 1993 మార్చి 3) ఒక పోలిష్ అమెరికన్, వైద్య పరిశోధకుడు, నోటి పోలియో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇది పోలియో వ్యాధిని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించింది. 1969-72లో, అతను ఇజ్రాయెల్‌లోని వైజ్మాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

జీవిత విశేషాలు[మార్చు]

సాబిన్ రష్యన్ సామ్రాజ్యం లోని బయాలీస్టాక్ (1918 నుండి పోలాండ్) లో పోలిష్ యూదు తల్లిదండ్రులు జాకబ్ శాపర్‌స్టీన్, టిల్లీ క్రుగ్మాన్ లకు జన్మించాడు. [1] 1921 లో అతను తన కుటుంబంతో ఎస్ఎస్ లాప్‌లాండ్‌ నౌకలో అబ్రామ్ సపెర్‌స్టెజ్న్‌గా వలస వెళ్ళాడు. ఈ నౌక బెల్జియంలోని ఆంట్వెర్ప్ నుండి న్యూయార్క్ నౌకాశ్రయానికి ప్రయాణించింది. 1930 లో, అతను యునైటెడ్ స్టేట్స్ యొక్క సహజ పౌరుడు అయ్యాడు. తన పేరును సాబిన్ గా మార్చుకున్నాడు. బ్రూస్ అనే మధ్య పేరును కూడా పెట్టుకున్నాడు. అతను న్యూజెర్సీలోని పాటర్సన్ లోని ఉన్నత పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు.[2]

సాబిన్ దంతవైద్యంలో విశ్వవిద్యాలయ చదువును ప్రారంభించాడు. కాని వైరాలజీపై ఆసక్తితో తన మేజర్లను మార్చుకున్నాడు. 1928 లో సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి 1931 లో మెడికల్ డిగ్రీ పొందాడు.[3][4] సాబిన్ 1931-1933 వరకు న్యూయార్క్ నగరంలోని బెల్లేవ్ హాస్పిటల్‌లో అంతర్గత మెడిసిన్, పాథాలజీ, శస్త్రచికిత్సలో శిక్షణ పొందాడు. 1934 లో, అతను ఇంగ్లాండ్‌లోని ది లిస్టర్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో పరిశోధనలు జరిపాడు. తరువాత రాక్‌ఫెల్లర్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఇప్పుడు రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయం) లో చేరాడు. ఈ సమయంలో, అతను పరిశోధనలపైన, ముఖ్యంగా అంటు వ్యాధుల పరిశోధనపై, తీవ్రమైన ఆసక్తిని పెంచుకున్నాడు.

పోలియో పరిశోధన[మార్చు]

పోలియో వైరస్ యొక్క ఉత్పరివర్తన జాతుల ఆధారంగా సాబిన్ నోటి ద్వారా వేసే టీకాను అభివృద్ధి చేశాడు. ఇది యాంటీబాడీ ఉత్పత్తిని ప్రేరేపించింది కాని పక్షవాతం కలిగించలేదు. అతని నోటి టీకా తీఉకున్న వాళ్లలో స్వయంగా తాను, తన కుటుంబం, అతడి సహచరులూ ఉన్నారు. సాబిన్ యొక్క మొట్టమొదటి క్లినికల్ ట్రయల్స్ 1954 చివరలో చిల్లికోథే ఓహియో రిఫార్మేటరీలో జరిగాయి. 1956 – 1960 నుండి, అతను రష్యన్ సహచరులతో కలిసి నోటి టీకాను పరిపూర్ణం చేయడానికీ, దాని అసాధారణ ప్రభావాన్ని, భద్రతనూ నిరూపించడానికీ పనిచేశాడు. ఈ టీకా పేగులలో పనిచేయలేదుగానీ, పోలియో వైరస్ రక్తప్రవాహంలోకి రాకుండా మాత్రం నిరోధించింది.[5]

టైప్ 1 పోలియోవైరస్లకు వ్యతిరేకంగా ప్రజోపయోగం కోసం మొట్టమొదటి నోటి పోలియోవైరస్ టీకా (OPV) 1961 లో అమెరికాలో లైసెన్స్ పొందింది. టైప్ 2, టైప్ 3 పోలియోవైరస్ల కోసం అతని టీకాలు 1962 లో లైసెన్స్ పొందాయి. 1964 లో, మూడు వైరల్ సెరోటైప్‌లనూ కలిగి ఉన్న ఒకే టీకా ఆమోదం పొందింది.[6][7] సాబిన్ యొక్క నోటి వ్యాక్సిన్ 1954 లో సాల్క్ అభివృద్ధి చేసిన టీకా కంటే ఇవ్వడం సులభమే కాక, దాని ప్రభావాలు ఎక్కువసేపు కొనసాగాయి. తరువాతి మూడు దశాబ్దాల్లో యునైటెడ్ స్టేట్స్లో పోలియోకు వ్యతిరేకంగా టీకాలు వేసే ప్రధాన పద్ధతి సాబిన్ వ్యాక్సినే. ఇది వైరస్ యొక్క ప్రసార గొలుసును విచ్ఛిన్నం చేసింది. పోలియోను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది.[8][9]

సాబిన్ మెదడు వాపు, డెంగ్యూతో సహా ఇతర వైరల్ వ్యాధులకు కూడా టీకాలను అభివృద్ధి చేశాడు. వైరస్లు, కొన్ని రకాల క్యాన్సర్ల మధ్య సంబంధాలను కూడా పరిశోధించాడు.

దాతృత్వం, మానవత[మార్చు]

సాబిన్ తన టీకాకు పేటెంట్ తీసుకోడానికి నిరాకరించాడు. పేటెంటు తీసుకుంటే టీక ధర ఎక్కువ అవుతుందని, వ్యాపార ఔషధ పరిశ్రమల వాణిజ్య దోపిడీకి అడ్డుకట్ట వెయ్యలనీ తడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తక్కువ ధర ఉంటే చికిత్స యొక్క మరింత విస్తృతంగా వ్యాపిస్తుంది. తన టీకా అభివృద్ధి ద్వారా సాబిన్ ఒక్క పైసా కూడా సంపాదించలేదు. ప్రొఫెసర్‌గా తనకు వచ్చే జీతం తోనే జీవించాడు. టీకాల అభివృద్ధిని కొనసాగించడానికి 1993 లో సాబిన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ స్థాపించాడు. సాబిన్ చేసిన మార్గదర్శకమైన పనికి గుర్తింపుగా, టీకాల రంగంలో విశేష కృషి చేసిన వారికి, ఈ సంస్థ ఏటా ఆల్బర్ట్ బి. సాబిన్ గోల్డ్ మెడల్ ఇస్తోంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Moreno, Barry (4 October 2017). Ellis Island's Famous Immigrants. Arcadia Publishing. ISBN 9780738555331. Retrieved 4 October 2017 – via Google Books.
  2. "Jonas Salk and Albert Bruce Sabin". Science History Institute. January 8, 2017. Retrieved June 15, 2020.
  3. "Jonas Salk and Albert Bruce Sabin". Science History Institute. January 8, 2017. Retrieved June 15, 2020.
  4. "Albert Sabin Biography". Notable Biographies. Retrieved 4 October 2017.
  5. Racaniello, Vincent (30 March 2009). "Learning vaccinology from an immunization record". Virology Blog. Retrieved 15 June 2020.
  6. Racaniello, Vincent (30 March 2009). "Learning vaccinology from an immunization record". Virology Blog. Retrieved 15 June 2020.
  7. Wilson, Daniel J. (2009). Polio. Santa Barbara, California: ABC-CLIO. pp. 95, 123–125. ISBN 9780313358975. Retrieved 15 June 2020.
  8. "Jonas Salk and Albert Bruce Sabin". Science History Institute. January 8, 2017. Retrieved June 15, 2020.
  9. Wilson, Daniel J. (2009). Polio. Santa Barbara, California: ABC-CLIO. pp. 95, 123–125. Retrieved 15 June 2020.