పోలియో టీకా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పోలియో టీకా
Vaccine description
Target disease Polio virus
Type Killed/Inactivated
Clinical data
ప్రెగ్నన్సీ వర్గం C (both OPV and IPV)
చట్టపరమైన స్థితి Administered by or under the supervision of a health care professional.
Routes Parenteral (IPV), Oral drops (OPV)
Identifiers
ATC code J07BF01 J07BF02 J07BF03

పోలియోమైఏలిటిస్ (లేదా పోలియో)ను ఎదుర్కొవడానికి ప్రపంచవ్యాప్తంగా రెండు పోలియో టీకా మందులు ఉపయోగించారు. మొదటిదాన్ని జోనస్ సాల్క్ వృద్ధి చేశాడు, ఇది మొదటిసారిగా 1952లో పరీక్షించబడింది. 1955 ఏప్రిల్ 12న సాల్క్ ప్రపంచానికి దీనిపై ప్రకటన చేశాడు, దీంట్లో ఇంజెక్ట్ చేయబడిన క్రియాశూన్యమైన (మృత) పోలియోవైరస్ యొక్క డోస్ ఉంది. నోటితో తీసుకునే టీకా‌ని దుర్బలపరిచే పోలియో వైరస్‌ని ఉపయోగించి ఆల్బర్ట్ సబిన్ వృద్ధి చేశాడు. సబిన్ టీకా‌ని మానవ నమూనాలకు ఉపయోగించడం 1957లో మొదలైంది, 1962లో దీనికి లైసెన్స్ దొరికింది.[1] ఎందుకంటే రోగనిరోధకశక్తితో పోటీపడే వ్యక్తులలో పోలియోవైరస్‌కోసం దీర్ఘకాలం కొనసాగే వాహక స్థితి లేదు, పోలియోవైరస్ స్వాభావికంగా వానరేతర రిజర్వాయర్ కలిగిలేదు మరియు ఒక పొడిగించబడిన కాలానికి వాతావరణంలో వైరస్ మనుగడ సాధించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. అందుచేత, టీకా మందు ద్వారా మనిషి నుంచి మనిషికి వైరస్ బదలాయింపును అడ్డుకోవడం ప్రపంచ పోలియో నిర్మూలనలో సంక్లిష్ట దిశగా ఉంటోంది.[2] రెండు టీకా మందులు ప్రపంచంలోని పలు దేశాలనుంచి పోలియోని నిర్మూలించాయి,[3][4] మరియు ఇది 1988లో ప్రపంచమంతటా ఉన్న 350,000 కేసులను 2007లో 1,625 కేసులకు తగ్గించగలిగిందని అంచనా వేయబడింది.[5][6][7]

అభివృద్ధి[మార్చు]

సాధారణ వ్యాప్తి అర్థంలో, వాక్సినేషన్ ఒక 'ఇమ్యునోజెన్‌'తో రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడం ద్వారా పనిచేస్తుంది. వైరస్ సోకగల ఏజెంట్‌ను ఉపయోగించి రోగనిరోధక స్పందనను ఉద్దీప్తం చేయడాన్ని రోగ నిరోధీకరణ అని అంటున్నారు. పోలియోకి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని వృద్ధి చేయడమన్నది ప్రాణాంతక పోలియోవైరస్ మనిషినుంచి మనిషికి బదలాయింపు కాకుండా సమర్థవతంగా అడ్డుకుంటుంది, తద్వారా వ్యక్తిగత టీకా గ్రహీతలు మరియు విస్తృత కమ్యూనిటీ ఇద్దరినీ అది కాపాడుతుంది.[2]

1936లో, న్యూయార్క్ యూనివర్శిటీలో పరిశోధక సహాయకుడు మౌరిస్ బ్రాడీ, ఫార్మల్‌డీహైడ్‌-ని నిర్మూలించిన పోలియో టీకా‌ని నేలమీద పెరిగే కోతి వెన్నెముకలనుంచి తయారు చేయడానికి ప్రయత్నించాడు. తగినంత పరిమాణంలో వైరస్‌ని సాధించలేకపోవడంతో ప్రారంభంలో అతడి ప్రయత్నాలకు దెబ్బతగిలింది. బ్రాడీ మొదట తనమీద, తన పలువురు సహాయకుల మీద టీకా‌ని పరీక్షించుకున్నాడు. తర్వాత అతడు టీకా‌ని మూడువేలమంది పిల్లలకు ఇచ్చాడు, వీరిలో అనేకమందికి అలర్జీ సంబంధిత రియాక్షన్‌లు కలిగాయి కాని ఒక్కరికీ పోలియో నుంచి రోగనిరోధక శక్తి పెంపొందలేదు.[8] ఫిలడెల్పియా రోగలక్షణ శాస్త్రజ్ఞుడు జాన్ కోల్మెర్ కూడా అదే సంవత్సరం టీకా‌ని వృద్ధి చేసినట్లు ప్రకటించుకున్నాడు. అయితే ఇతడి టీకా కూడా రోగనిరోధకతను తయారు చేయలేకపోయింది పైగా అనేక ఇతర కేసులను, కొన్ని తీవ్రమైన వాటిని కూడా కలిగించిందని పేరుపొందింది.[9]

నేషనల్ పోలియో ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ప్రారంభ దినాల్లో జార్జియాలోని కొలంబస్‌లో సామూహిక పోలియా టీకా మందు

బోస్టన్ చిల్డ్రన్స్ ఆసుపత్రికి చెందిన జాన్ ఎండెర్స్ ప్రయోగశాలలో, మానవ కణాలలో పోలియోవైరస్‌ని విజయవంతంగా ప్రవేశపెట్టడంతో 1948లో ఒక పెద్ద మార్పు సంభవించింది.[10] ఈ పురోగమనం టీకా పరిశోధనకు చక్కని బాట ఏర్పర్చింది మరియు పోలియోను నిరోధించే టీకా అభివృద్ధికి అంతిమంగా అనుమతించింది. ఎండెర్స్ అతడి సహచరులు, థామస్ హెచ్. వెల్లెర్ మరియు ఫ్రెడ్రిక్ సి రాబిన్స్‌ విశేష కృషికి గాను 1954లో ఫిజియాలజీ లేదా రోగచికిత్సా శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది.[11] తర్వాత మరో మూడు పోలియో వైరస్‌లు స్టీరియోటైప్‌లు (పోలియో వైరస్ టైప్ 1 — PV1, లేదా మహోనీ; PV2, లాన్సింగ్; మరియు PV3, లియోన్) లను గుర్తించడంతో పోలియో టీకా అభివృద్దికి ఇవి ముఖ్యమైన దోహదకారులుగా నిలిచిపోయాయి; పక్షవాతానికి ముందుగా వైరస్ తప్పకుండా రక్తంలో కనబడుతుందని, గామా-గ్లోబ్యులిన్ రూపంలో యాంటీబాడీస్ అనేవి పారలైటిక్ పోలియోకు వ్యతిరేకంగా పనిచేస్తాయని వీటి ద్వారా తెలిసిపోయింది.[6][12]

1952లో మరియు 1953లో యు.ఎస్‌ వరుసగా 58,000 మరియు 35,000 పోలియో కేసులను చవిచూసింది, అంతకుముందు సంవత్సరానికి 20,000 కేసులు మాత్రమే నమోదయ్యేవి. పోలియో వ్యాధికి తోడుగా, యు.ఎస్‌లో పోలియో వాక్సిన్‌ను కనుగొని దాన్ని మార్కెట్ చేయడానికి, వ్యాపార ప్రయోజనాలతో లక్షలాది డాలర్లు మదుపు చేశారు. మదుపుసంస్థల్లో H. R. కాక్స్ మార్గదర్శకత్వంలో ఉన్న న్యూయార్క్ లోని లెడెర్లె ల్యాబరేటరీస్ కూడా ఒకటిగా ఉండేది లెడ్రెల్ వద్ద పనిచేస్తున్న పోలిస్ జాతీయుడైన వైరస్ అధ్యయనవేత్త మరియు రోగనిరోధక నిపుణుడు హిలరీ కోప్రొవ్‌స్కీ, 1950లోనే తాను విజయవంతంగా పనిచేసే పోలియో టీకా‌ని రూపొందించినట్లు ప్రకటించాడు. అయితే, అతడు రూపొందించిన టీకా దుర్బలపరిచే సజీవ వైరస్‌ని నోటిద్వారా తీసుకోవలసి వచ్చేది, పైగా అది ఇంకా పరిశోధనా దశలోనే ఉండింది, జోనస్ సాల్క్ పోలియో టీకా (నిర్జీవరూపంలో సూది ద్వారా తీసుకునే టీకా) మార్కెట్లోకి వచ్చిన అయిదేళ్ల తర్వాత గాని ఇతడి టీకా సిద్ధం కాలేదు. కొప్రోవ్‌స్కీ యొక్క దుర్బలపరిచే టీకా‌ని స్విట్జర్లండ్ ఆల్బినో ఎలుకల మెదళ్లలో ప్రవేశపెట్టడం ద్వారా ఇది పలు పరీక్షలతో సిద్ధం చేయబడింది. ఏడవ దశనాటికి, టీకా నిరోధకం నాడీకణాన్ని సోకలేదు లేదా పక్షవాతానికి దారితీయలేదు. మరికొన్ని పరీక్షల తర్వాత, ఈ టీకా‌ని మానవ ఉపయోగానికి సురక్షితమైనదిగా ప్రకటించబడింది.[13][14] 1950 ఫిబ్రవరి 27న, కొప్రోవ్‌స్కీ సజీవ, దుర్బల పరిచే టీకా‌ని తొలసారిగా, న్యూయార్క్‌ రాష్ట్రంలోని లెచ్‌వర్త్‌కి చెందిన ఎనిమిదేళ్ల బాలుడిపై పరీక్షించారు. ఈ బాలుడు ఎలాంటి దుష్ప్రభావాల బారిన పడలేదు మరియు కొప్రోవ్‌స్కీ మరొక 19 మంది పిల్లలపై తన టీకా ఎక్కించడంద్వారా పరిశోధనను విస్తరించాడు.[13][15]

రెండు పోలియో టీకా‌ల అభివృద్ది మొట్టమొదటి ఆధునిక సామూహిక టీకాలకు దారితీసింది. పలు మధ్యపశ్చిమ రాష్ట్రాలతోపాటు అమిష్‌లో ఈ వ్యాధి వ్యాపించడంతో, యునైటెడ్ స్టేట్స్‌లో ప్రాణాంతక వైరస్ యొక్క సాంక్రమిక బదలాయింపు ద్వారా సంభవించిన చిట్టచివరి పారలైటిక్ పోలియోమైఎలిటిస్ కేసు 1979లో నమోదైంది.[16] పోలియోని నిర్మూలించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, UNICEF, మరియు ది రోటరీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి ప్రయత్నం 1988లో మొదలైంది. ఇది ప్రధానంగా అల్బర్ట్ సబిన్ రూపొందించిన నోటితో తీసుకునే పోలియో టీకా‌పైనే ఎక్కువగా ఆధారపడింది.[17] 1994 నాటికి ఈ వ్యాధి అమెరికాఖండంలో పూర్తిగా నిర్మూలించబడింది.[18] 2000 నాటికి చైనా, ఆస్ట్రేలియాతోపాటుగా 36 పాశ్చాత్య పసిఫిక్ దేశాలలో పోలియో నిర్మూలించబడినట్లు అధికారికంగా ప్రకటించబడింది.[19][20] పోలియో నుంచి బయటపడినట్లు యూరప్ 2002లో ప్రకటించింది.[21] 2008 నాటికి పోలియో నాలుగు దేశాలలో మాత్రమే సాంక్రమిక వ్యాధిగా కొనసాగుతోంది: నైజీరియా, ఇండియా, పాకిస్తాన్, మరియు ఆప్ఘనిస్తాన్‌.[5] పోలియో వైరస్ వ్యాప్తి ప్రపంచంలో చాలావరకు అరికట్టబడినప్పటికీ, పోలియోవైరస్ డోస్ సరఫరా మాత్రం కొనసాగుతూ, ఇంతకుముందే పోలియో రహిత ప్రాంతాలలోకి ప్రాణాంతక పోలియో వైరస్ మళ్లీ వ్యాపించే ప్రమాదాన్ని గుర్తుకు తెస్తూ ఉంది. పోలియోవైరస్ ఎగుమతి కావడం సంబవించినట్లయితే, పోలియోమైఎలిటిస్ చెలరేగవచ్చు ప్రత్యేకించి టీకామందు తక్కువగా తీసుకున్న, పారిశుధ్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇది చెలరేగవచ్చు. దీని ఫలితంగా, అత్యధిక స్థాయిలో టీకామందు సరఫరాను కొనసాగిస్తూనే ఉండాలి.[18]

క్రియాశూన్య టీకామందు[మార్చు]

సాల్క్‌తో పాటు పోలియో టీకాల నిర్వహణ, 1957లో పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో ఇతడు ఇతడి బృందం టీకామందును కనిపెట్టింది.

మొట్టమొదటి సమర్ధవంతమైన పోలియో టీకా 1952లో పిట్స్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన జోనస్ సాల్క్ వృద్ధి పర్చాడు. అయితే దీనికి సంవత్సరాలుగా కఠోర పరీక్షలు అవసరమయ్యాయి. టీకామందు పట్ల ప్రజల్లో ఓర్పును పెంపొందించడానికి, సాల్క్ 1953 మార్చి 26న కొంతమంది పెద్దలు పిల్లలతో కూడిన బృందంపై విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు నివేదించడానికి CBS రేడియోని సందర్సించాడు; రెండు ోజుల తర్వాత ఈ పరీక్షా ఫలితాలను JAMAలో ప్రచురించబడ్డాయి.[22]

సాల్క్ టీకా లేదా క్రియాశూన్య పోలియోవైరస్ టీకా (IPV), మూడు ప్రాణాంతకమైన హానికరమైన వైరస్‌లపై ఆధారపడింది, అవి, మహోనీ (టైప్ 1 పోలియోవైరస్), MEF-1 (టైప్ 2 పోలియోవైరస్), మరియు సౌకెట్ట్ (టైప్ 3 పోలియోవైరస్), ఇవి ఒక రకం కోతి మూత్రపిండం కణ సంస్కృతి (వెరోసెల్ లైన్‌లో పెరుగుతాయి) తర్వాత అవి ఫార్మాలిన్‌తో క్రియాశూన్యమవుతాయి.[6] సూదితో వేయబడే సాల్క్ టీకా IgG- రక్తనాళంలో రోగనిరోధకతను సూచిస్తుంది, ఇది విరెమియా నుంచి పోలియో ఇన్పెక్షన్‌ కాకుండా కాపాడుతుంది మరియు మోటార్ న్యూట్రాన్‌లను పరిరక్షిస్తుంది, ఆవిధంగా బల్బర్ పోలియో మరియు పోస్ట్-పోలియో సిండ్రోమ్ ప్రమాదాన్ని తొలగిస్తుంది.

1954లో, ఈ టీకా‌ని ఆర్సనెల్ ఎలిమెంటరీ స్కూల్ మరియు వాట్సన్ హోమ్ ఫర్ చిల్డ్రన్ పిట్స్‌బర్గ్, పెన్సిల్వేనియాలలో పరీక్షించబడింది. సాల్క్ రూపొందించి టీకా తర్వాత థామస్ ఫ్రాన్సిస్ నేతృత్వంలో ఫ్రాన్సిస్ ఫీల్డ్ ట్రయల్ పేరిట జరిగిన పరీక్షలో ఉపయోగించబడింది; ఇది చరిత్రలో అతి పెద్ద వైద్య ప్రయోగంగా నిలిచిపోయింది. మెక్‌లీన్, వర్జీనియా[23] లోని, ఫ్రాంక్లిన్ షెర్మన్ ఎలిమెంటరీ స్కూల్లో 4,000 మంది చిన్నపిల్లలకు ఒక పరీక్షను పెట్టారు. ఇది మెయిన్ నుండి కాలిఫోర్నియా వరకూ గల 44 రాష్ట్రాలలోని 1.8 మిలియన్లమంది పిల్లలందరికీ కలిపి పెట్టిన పరీక్షలో భాగం.[24] దీనివల్ల జరిగిన అధ్యయనం ప్రకారం, సుమారుగా 440,000 మంది పిల్లలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు వ్యాధినిరోధక టీకాను సూదిమందు రూపంలో తీసుకున్నారు. 210,000 మంది పిల్లలు ఏదో కంటి తుడుపుగా హానికరంకాని వర్థన యానకమున్న మందును వేసుకున్నారు. మరో 1.2 మిలియన్ మంది పిల్లలు వ్యాధి నిరోధక టీకాలేవీ తీసుకోకుండా నియంత్రిత సమూహంగా ఉన్నారు. భవిష్యత్తులో వారికి పోలియో సోకే అవకాశం ఉండొచ్చు.[13] ఈ క్షేత్రస్థాయి ఫలితాలను ఏప్రిల్ 12, 1955లో విడుదల చేసారు (ఆరోజు ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్ పదవ వర్ధంతి; చూడు పక్షవాత సంబంధ జబ్బుతో ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్ బాధపడడం). సాల్క్ తయారుచేసిన టీకా, పివి1(పోలియోవైరస్ రకం 1) కన్నా 60 - 70%, పివి2, పివి3కన్నా 90%, బల్బార్ పోలియో కన్నా 94% ప్రభావశీలంగా పని చేసింది.[25] సాల్క్ టీకాకు 1955లో లైసెన్స్ మంజూరయ్యాక, టీకాలిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంటువ్యాధులకు వ్యాధి నిరోధకతను అందించే కార్యక్రమాన్ని అమెరికాలో మార్చ్ ఆఫ్ డైమ్స్ ప్రారంభించాడు. దీనివలన 1957నాటికి పోలియో కేసులు 5600కు తగ్గిపోయాయి.[26] 1961లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 161 కేసులు మాత్రమే నమోదయ్యాయి.[27]

ఒక సోమాలి బాలుడికి క్రియాశూన్యమైన పోలియో వైరస్ టీకామందును ఎక్కించారు (మొగదీషు, 1993)

అదనపు శక్తి కలిగిన ఐపివికి అమెరికాలో, 1987 నవంబర్‌లో లైసెన్స్ ఇచ్చారు. అదే ప్రస్తుతం ఆమోదింపబడిన పోలియోకు టీకాగా కొనసాగుతున్నది.[16] పిల్లలు పుట్టిన కాసేపటికి పోలియో టీకా మొదటి మోతాదు ఇస్తారు, దీన్నే 1 -2 నెలలలో కూడా ఇవ్వచ్చు, రెండవ మోతాదును 4 నెలల వయసులో ఇస్తారు.[16] మూడో మోతాదును ఎప్పుడివ్వాలన్నది టీకా తయారీపద్ధతి ననసరించి ఉంటుంది. అయితే అది 6-18నెలల వయసు లోపల ఇవ్వాల్సి ఉంటుంది.[28] అదనపు టీకాను 4 నుండి 6 సంవత్సరాల వయసు లోపల ఇవ్వాలి. మొత్తం, ఈ నాలుగు మోతాదులను పిల్లలు పాఠశాలలో చేరేలోపల పూర్తి చేయాలి.[29] కొన్ని దేశాలలో కౌమారదశకు చేరుకున్నాక కూడా ఐదవ వ్యాధినిరోధక టీకాను కూడా ఇస్తున్నారు.[28] కౌమారదశలో(18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ) ఇచ్చే టీకాలు అంతగా అవసరం లేనివి, సిఫారసు చేయబడనివి. ఎందుకంటే కౌమార దశకు చేరుకున్న తర్వాత వారికి సహజంగానే వ్యాధినిరోధక శక్తి చేకూరుతుంది. ఆ దశలో ప్రాణాంతక పోలియో వైరస్ బారిన పడడానికి కొద్దిపాటి అవకాశాలు మాత్రమే ఉంటాయి.[16]

2002లో, పోలియో నివారణ కోసం పంచరక్షక (5-భాగాలు) కలిసిన వ్యాధి నిరోధక టీకాను (దీనినే పెడియారిక్స్ అంటారు) అమెరికా ఆమోదించింది. ఇది కంఠవాపు, ధనుర్వాతం, కణరహిత కోరింతదగ్గు టీకాలు, DTaP చిన్నపిల్లలకు ఇచ్చే హైపటైటిస్ బి నివారణ టీకా మోతాదులను కూడా కలిగి ఉంటుంది.[16] ఇంగ్లాండులో ఇచ్చే IPVలో కంఠవాపు, కోరింతదగ్గు, ధనుర్వాతం, హెమోఫిలస్ ఇన్‌ఫ్లుయంజా టైప్ బి టీకాలన్నీ కలిసివున్నాయి.[28] ప్రస్తుతం వినియోగంలో ఉన్న IPVని, రెండు మోతాదులు తీసుకున్నవారిలో, 90% లేదా అంతకన్నా ఎక్కువమందికి మూడు రకాల పోలియో వైరస్ (IPV) లను తట్టుకోగలిగిన ప్రతిరక్షకాలు అభివృద్ధి అయ్యాయి. మూడు మోతాదులు తీసుకున్నవారిలో 99% మందికి ఈ వ్యాధినిరోధక శక్తి చేకూరింది. IPV వలన చేకూరే వ్యాధినిరోధకశక్తి ఎంత కాలం ఉంటుందో నిర్దిష్టంగా తెలియదు. అయితే అన్ని మోతాదులనూ తీసుకున్న వారిలో ఇది చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఒక అంచనా.[30]

నోటి ద్వారా ఇచ్చే వ్యాధినిరోధక టీకా[మార్చు]

ఈ 1963నాటి పోస్టర్ CDC’స నేషనల్ సింబల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ని ప్రదర్శిస్తుంది, "వెల్లెబీ" ప్రజలు నోటిద్వారా పోలియో టీకామందును అందుకునేలా ప్రోత్సహిస్తోంది.

నోటిద్వారా తీసుకునే వ్యాధినిరోధక టీకా(OPV) సజీవయుత శక్తివిహీన టీకా, మానవేతర కణాల నుండి తీసుకున్న వైరస్ ను, ఉప-శారీరక ధర్మం కలిగిన ఉష్ణోగ్రతలో ఉంచడం వలన దీన్ని తయారు చేస్తారు. ఇలా చేయడం వలన తక్షణమే వాటి జన్యు సమూహంలో ఉత్పరివర్తనాలు ఏర్పడతాయి.[31] నోటిద్వారా తీసుకునే పోలియో వ్యాధినిరోధక టీకాను అనేక బృందాలు తయారుచేసాయి. వీటిలో ఒక బృందానికి నాయకుడు ఆల్ బర్ట్ సాబిన్. మరో బృందానికి హిల్లరీ కోప్రోవ్ స్కి, ఎచ్.ఆర్.కాక్స్ నాయకత్వం వహించారు. వారు శక్తివిహీనం చేసిన వ్యాధికారక వైరస్ లనుండి టీకాను విడివిడిగా తయారు చేసారు. జాతీయ ఆరోగ్య సంస్థ 1958లో ఈ రకమైన సజీవయుత టీకాలపై ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈ టీకాలు ఎలా నిరోధకతను అందిస్తాయో జాగ్రత్తగా మదింపు చేసింది. కోతులపై వీటిని పరీక్షించినపుడు, అవి నాడీ సంబంధం వ్యాధులను తక్కువ స్థాయికి నిలుపుదల చేయగలిగాయి. ఈ ఫలితాలనాధారంగా చేసుకుని సబిన్ బృందం తయారు చేసిన టీకారకాలను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసినందుకు ఎంపిక చేసారు.[13]

సబిన్ 1 రకంలో 57 న్యూక్లియోటైడ్ ప్రతిక్షేపకాలు జరిగి, వాటివల్ల అది తన మాతృక (మొహనీ సెరోటైప్) కంటే భిన్నంగా మారింది. సాబిన్ 2 రకంలో 2 న్యూక్లియోటైడ్ ప్రతిక్షేపకాలు, సాబిన్ 3 రకంలో 10 ప్రతిక్షేపకాలు జరగడం వల్ల అవి శక్తి విహీనమయ్యాయి.[6] సబిన్ టీకాలన్నింటిలోనూ వ్యాధికారక వైరస్‌ను శక్తివిహీనం చేసే కారకం ఒక్కటే. ఇది రైబోసోయ్ అంతర్గత ప్రవేశ ప్రాంతంలో (లేదా IRES) [32] ఉత్పరి వర్తనం చెందించి స్టెమ్ లూప్ నిర్మాణంలో మార్పులు కలుగజేస్తాయి. అంతేగాక వైరస్ ఆతిధేయ కణంలో ఉండగానే ఇది, దాని యొక్క ఆర్ ఎన్ ఎ మూసను మార్పు చేసి పోలియో కారక వైరస్‌ను శక్తి విహీనం చేస్తుంది.[33] శక్తివిహీనం చేయబడిన పోలియోవైరస్‌లు ప్రేగులో తమసంఖ్యను బాగావృద్ధి చేసుకోగలవు. వాటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ అవి నాడీ వ్యవస్థకు చెందిన కణజాలంలో మాత్రం తమ సంఖ్యను బాగా వృద్ధి చేసుకోలేకపోయాయి. నోటిద్వారా తీసుకొనే టీకాను నిర్వహించడం తేలికని రుజువయింది. సూక్ష్మజీవరహితం చేసిన సిరంజిల అవసరం ఇక్కడ లేనందువల్ల మూకుమ్మడిగా టీకాలనిచ్చే కార్యక్రమానికి ఇది బాగా సరిపోయింది. OPV టీకాలు సాల్క్ టీకాలకంటే దీర్ఘకాలిక వ్యాధినిరోధకతను కూడా ఇస్తాయి.

1961లో 1, 2 ఏక ప్రతిరక్షక రకాలకు(ఎంఒపివి) లైసెన్స్ వచ్చింది. 1962 లో 3 MOPVకి లైసెన్స్ వచ్చింది. 1963లో త్రయ ప్రతిరక్షక రకానికి (TOPV) లైసెన్స్ వచ్చింది. ఇది అతి త్వరగా అమెరికాలోనూ, ఇతర ప్రపంచ దేశాలలోనూ ఎంపిక చేసిన టీకా అయింది. అంతగా ప్రభావం చూపని టీకాల రకాలన్నింటి స్థానాన్నీ ఇది ఆక్రమించింది.[8] సామూహిక టీకా కార్యక్రమ రెండవ దశలో ఊహింప శక్యంకాని విధంగా పోలియో కేసులను తగ్గిపోయాయి. 1962 , 1965 మధ్య కాలంలో ఆమెరికాలో నూరు మిలియన్లు (దాదాపుగా అప్పటి జనాభాలో 56%) మంది సాబిన్ టీకాలను తీసుకున్నారు. దీని ఫలితంగా పోలియో కేసులు తుదముట్టించినట్టుగా తగ్గిపోయాయి. ఇది సాల్క్ టీకాలు తగ్గించినదానికన్నా చాలా ఎక్కువ.[34]

OPV -నోటిద్వారా తీసుకునే పోలియో వ్యాధి నిరోధక టీకా-ను చిన్న చిన్న సీసాలలో సరఫరా చేస్తారు. దీనిలో 10 -20 మోతాదుల టీకా ఉంటుంది. నోటిద్వారా తీసుకునే ఒక్కొక్క మోతాదులో(సాధారణంగా దీనిలో రెండు చుక్కల మందు ఉంటుంది), సబిన్ 1 రకంలో 1,000,000 అంటువ్యాధికారక యూనిట్లు(PV 1 కన్నా ప్రభావశీలం), సబిన్ 2 రకంలో 1,00,000 అంటువ్యాధి కారక యూనిట్లు, సబిన్ 3లో 600,000 అంటువ్యాధికారక యూనిట్లు ఉంటాయి. టీకాలో కొద్ది మొత్తంలో వ్యాధినిరోధక ఔషధాలయిన— నియోమైసిన్, స్ట్రెప్టోమైసిన్ ఉంటాయి. అయితే నిల్వకారకాలు మాత్రం వుండవు.[35] ఒక మోతాదు OPV, మూడు రకాల పోలియో కారక క్రిములకు 50% వరకు వ్యాధినిరోధకత కలిగిస్తుంది.[16] టీకాను మూడు మోతాదులు తీసుకున్నట్లయితే, మూడు రకాల పోలియో కారక వైరస్‌ల నుండి 95% వరకు వ్యాధినిరోధకత కలుగుతుంది. ఈ టీకా మందు పేగులకు అమోఘమైన వ్యాధి నిరోధకత కలగజేస్తుంది. పోలియో వైరస్ చొరబడే మొదటిచోటు పేగులు. ఈ వైరస్ పేగులలో అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి ఈ టీకా వైరస్ వ్యాప్తిని బాగా అరికడుతుంది.[29] మలం ద్వారా బయటకు విసర్జింపబడిన సజీవ వైరస్‌ను టీకాలలో ఉపయోగిస్తారు. రోగగ్రస్తుల మలం ద్వారా బయటకు విసర్జింపబడిన పోలియో క్రిములు, చుట్టు పక్కల ఉండే వారందరికీ వ్యాపిస్తాయి. నోటిద్వారా పోలియో టీకాని తీసుకోవడంవల్ల , ప్రత్యక్షంగా టీకా తీసుకోకపోయినప్పటికీ వ్యాధి నుండి నిరోధకత లభిస్తుంది. OPV కంటే తక్కువ గ్రాస్ట్రోఇంటెస్టినల్ రోగ నిరోధకతని IPV కలిగిస్తుంది, ఇంకా నాడీ వ్యవస్థలో ప్రవేశించకుండా విషక్రిములను నివారించే చర్యల చేత ప్రాధమికంగా పనిచేస్తుంది. ప్రాణాంతక పోలియో విషక్రిమి లేని ప్రాంతాల్లో, క్రియాశీలకం కాని పోలియో టీకామందునే తగిన టీకా మందుగా వాడవచ్చు.[29] పోలియో సంఘటనలు ఎక్కువున్న ప్రాంతాల్లో, మరియు ఆశించిన ఫలితాల నివ్వడం మరియు టీకా మందు తీవ్రమైన రూపంలో వికటించటంల మధ్య ఒక విభిన్న సంబంధిత ప్రమాదం ఉన్నచోట, సజీవ టీకా మందునే ఇప్పటికీ వాడుతున్నారు. సజీవ వైరస్ రవాణా చేయుట మరియు నిల్వ చేయుటకు ఖచ్చితమైన అవసరాలు కలిగి ఉంటాయి, కొన్ని ఉష్ణ మరియు మారుమూల ప్రాంతాల్లో అదే సమస్యగా ఉంటుంది. ఇతర సజీవ-విషక్రిమి టీకా మందులతో కలిసి, OPVచే ప్రారంభింపబడే రోగ నిరోధకత దాదాపు జీవిత కాలపుది.[30]

ఇయట్రోజెనిక్ (టీకామందు-ప్రేరేపించు) పోలియో[మార్చు]

నోటి పోలియో టీకామందు (OPV) యొక్క ఒక ప్రధాన వ్యవహారం ఏమిటంటే నాడీ సంబంధ అంటువ్యాధి చేరే మరియు పక్షవాతానికి కారణమయ్యే రూపానికి తిరిగి సంక్రమిస్తుందని వెల్లడైన దాని సామర్ధ్యం.[36] టీకామందు-నుండి ఉత్పాదితమైన పోలియో వైరస్ (VDPV) చేత కలిగే పక్షవాతం సహా క్లినికల్ రోగాలను, విశృంఖల పోలియో విషక్రిమి చేత కలిగే వాటి నుండి విడదీయలేం.[37] ఇది అరుదైన సంఘటనగా విశ్వసింపబడుతోంది, అయితే టీకా-అనుబంధ పారాలైటిక్ పోలియో మైలిటీస్ (VAPP) యొక్క రోగ విస్ఫోటనం నమోదయ్యింది, మరియు OPVతో తక్కువగా భర్తీ చేసిన ప్రాంతాల్లో సంభవించే ప్రవృత్తి కలిగి ఉంది, ఎందుకంటే OPV స్వయంగా సంబంధిత రోగ విస్ఫోటన శ్రమ నుండి రక్షితమైనదని భావింపబడుతుంది.[38][39]

జర్మనీలోని బాన్‌లో 1967 టీకా మందు కేంపెయిన్ సందర్భంగా ఓరల్ పోలియో టీకా‌కు చక్కెర క్యూబ్‌లను కలిపారు.

ప్రాణాంతక పోలియో అదృశ్యమైపోవటంతో, దేశాలు నోటి టీకా వాడకం నుండి వెనుకటి ఇంజక్షన్ టీకాకు పరివర్తన చెందాయి ఎందుకంటే OPV కారణంగా ఇయట్రోజెనిక్ పోలియో (VAPP) యొక్క ప్రత్యక్ష ప్రమాదం, సబ్ క్లినికల్ OPV పరివర్తన ద్వారా రోగ నిరోధకం యొక్క పరోక్ష ప్రయోజనం కంటే ప్రాధాన్యత మించి ఉన్నది గనక. IPV వాడినప్పుడు, తిరిగి సంక్రమించటం సాధ్యం కాదు కానీ విశృంఖల పోలియో విషక్రిమి లేదా తిరిగి సంక్రమించిన OPVకి గురి కావటంతో క్లినికల్ అంటువ్యాధి యొక్క చిన్న ప్రమాదం మిగిలే ఉంటుంది. 1950ల మధ్యలో విస్తారంగా పోలియో టీకామందును వాడటంతో, పెక్కు పారిశ్రామిక దేశాలలో పోలియో మైలిటీస్ యొక్క సంఘటనలు వేగంగా తగ్గుతూ వచ్చాయి. 2000లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మరియు 2004లో UKలో OPV వాడకం ఆపివేయబడింది, అయితే ప్రపంచవ్యాప్తంగా దాని వాడకం కొనసాగుతూనే ఉంది.[16][28]

ప్రాంతాన్ని బట్టి టీకామందు-సంబంధిత పారాలైటిక్ పోలియోమైలిటీస్ (VAPP) యొక్క రేటు మారుతూ ఉంటుంది కానీ సాధారణంగా 750,000 మంది టీకామందు గ్రహీతలలో సగటున ఒక కేసు ఉంటుంది.[40] పెద్దలలో కంటే పిల్లలలో VAPP ఎక్కువగా సంభవించగల అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి లేని పిల్లల్లో, VAPP యొక్క ప్రమాదం దాదాపుగా 7,000 రెట్లు అధికంగా ఉంటుంది, ప్రత్యేకించి B-లింఫోసైట్ [[అపసవ్యత (ఉదాః అగమ్మాగ్లోబులినెమియా మరియు హైపొగమ్మగ్లోబులినెమియా గల వ్యక్తికి, అది సురక్షిత ప్రతిరక్షక పదార్థం యొక్క సంయోగాన్ని తగ్గిస్తుంది.[37]]] ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకామందులు ఉత్పాదించే పోలియో ప్రమాదం కంటే టీకామందుల ప్రయోజనాలని మిన్నగా పరిగణిస్తుంది. మొత్తం జనాభాని రోగనిరోధపూరితులుగా చేయడానికి పలుమార్లు అధిక నాణ్యత గల టీకామందుల వాడకంతో టీకామందులు ఉత్పాదించే పోలియో విస్పోటనం చెందడాన్ని ఆపవచ్చు.[41]

బెలారస్ (1965–66), కెనడా (1966–68), ఈజిప్ట్ (1983–1993), హిస్పానియోల (2000–2001), ఫిలిప్పీన్స్ (2001), మడగాస్కర్ (2001–2002),[42] మరియు హైతీ (2002) వంటి రాజకీయ ఘర్షణలు మరియు దారిద్ర్యం టీకామందుల కృషిని ఆటంకపరిచే చోట్ల VAPP విస్ఫోటనం స్వతంత్రంగా సంభవించింది.[43] 2006లో చైనాలో టీకామందు-ఉత్పాదిత పోలియో విషక్రిమి విస్ఫోటనం ఒకటి సంభవించింది.[44] కంబోడియా (2005–2006), మియన్మార్ (2006–2007), ఇరాన్ (1995, 2005–2007), సిరియా, కువైట్ మరియు ఈజిప్టులలో కేసులు నమోదయ్యాయి.[45] 2005 నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉత్తర నైజీరియాలో సజీవ నోటి పోలియో టీకామందుతో మార్పిడి చేత ఏర్పడిన టీకామందు కారణ పోలియోని గుర్తించింది.[46]

కాలుష్య ప్రమాదం[మార్చు]

1960లో, పోలియో విషక్రిమి టీకామందు తయారీలో ఉపయోగించే రెసస్ కోతి మూత్రపిండ కణాలు SV40 విషక్రిమి (సైమియన్ విషక్రిమి-40)తో కలిసి అంటు రోగమైందని లెక్కగట్టబడింది.[47] 1960లో SV40 కూడా కనుగొనబడింది మరియు అది కోతులలో సహజంగా అంటురోగం కలిగించే విషక్రిమి. 1961లో, SV40 ఎలుకలలో కణితులు కలిగిస్తుందని కనుగొనబడింది.[48] ఇటీవల, మానవులలో కొన్ని నిర్ధిష్ట రకాల కేన్సర్లలో విషక్రిమి కనుగొనబడింది, ఉదాహరణకు మెదడు మరియు ఎముక కణితులు, మెసొథెలియోమాలు మరియు కొన్ని రకాల నాన్-హాడ్జికిన్స్ లింఫోమా.[49][50] ఏదేమైనా, SV40 కేన్సర్‌ని కలిగిస్తుందని నిర్ధారణ కాలేదు.[51]

1955 నుండి 1963ల మధ్య వాడకంలో, పోలియో టీకామందు ఇంజక్షన్ (IPV) రూపంలో ఉంచిన నిల్వలలో SV40 ఉండటం కనుగొన్నారు.[47] OPV రూపంలో అది కనబడలేదు.[47] 1955 నుండి 1963 మధ్యలో 98 మిలియన్లకు పైగా అమెరికనులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోలియో టీకామందు తీసుకొనగా, అందులో కొంతభాగం SV40తో కలుషితం అయినప్పుడు, 10-30 మిలియన్ల అమెరికనులు SV40లో కలుషితమైన టీకామందు మోతాదు తీసుకున్నారని అంచనా వెయ్యబడింది.[47] తదుపరి విశ్లేషణలు పాత సోవియట్ కూటమి దేశాలు 1980 వరకూ తయారు చేసిన టీకామందులు, యూఎస్‌ఎస్‌ఆర్, చైనా, జపాన్ మరియు పెక్కు ఆఫ్రికా దేశాలలో వాడినవి కలుషితమై ఉండవచ్చని సూచించబడింది; అంటే వందల మిలియన్ల మంది SV40కు గురయ్యారని అర్థం.[52]

1998లో నేషనల్ క్యాన్సర్ ఇన్సిట్యూట్ SEER సంస్థల సారాంశపు ఆధారాల నుండి తీసుకున్న కేన్సర్ కేసుల సమాచారాన్ని ఉపయోగించి, ఒక విస్తారమైన అధ్యయానాన్ని చేపట్టింది. ఆ అధ్యయనం నుండి ప్రచురింపబడిన ఆవిష్కరణలు, SV40 కలిగి ఉన్న టీకామందును తీసుకున్న వ్యక్తులలో కేన్సర్ పెరిగిన సంఘటనలు లేవని తెలియచేసాయి.[53] 1957 చివరిలో స్వీడన్లో మరొక విస్తార అధ్యయనం 700,000 పైగా తగినంతగా కలుషితమైన పోలియో టీకామందును గ్రహించిన స్వతంత్ర వ్యక్తులను పరీక్షించింది; ఆ అధ్యయనం మరోసారి SV40 కలిగి ఉన్న పోలియో టీకామందు గ్రహించిన వ్యక్తులకూ మరియు తీసుకొని వ్యక్తులకూ మధ్య కేన్సర్ పెరిగిన సంఘటనలు లేవని తెలియ చేసింది.[54] మానవులలో SV40 కేన్సర్‌ని కలిగిస్తుందా లేదా అన్న ప్రశ్న వివాదాస్పదంగా మిగిలి పోయినప్పటికీ, మానవ కండరాలలో SV40ను కనుగొనేందుకు మెరుగుపరచిన నిర్ధారణా పరీక్షలను వివాదాల పరిష్కారానికై అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది.[51]

నోటి పోలియో టీకామందును అభివృద్ధిపరచే పోటీలో విస్తార పరిమాణంలో పెక్కుమానవ ప్రయత్నాలు చేపట్టబడ్డాయి. 1958 నాటికి, నేషనల్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సాబిన్ నిరోధకాలను వాడి తయారు చేసిన OPV అత్యంత సురక్షితమైనదని అంచనాకు వచ్చింది.[13] ఏదేమైనా 1957 మరియు 1960ల మధ్య హిలరీ కొప్రొవిస్కీ తన టీకామందును ప్రపంచవ్యాప్తంగా నిర్వహించటాన్ని కొనసాగించాడు. ఆఫ్రికాలో, బెల్జియన్ ప్రాంతాల్లో దాదాపుగా ఒక మిలియన్ ప్రజలకు టీకామందులు నిర్వహించబడ్డాయి, ఇప్పుడు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా మరియు బురుండిలో కూడా టీకా‌లు ఉపయోగించారు.[55][56] ఈ మానవ ప్రయత్నాల ఫలితాలు వివాదాస్పదమయ్యాయి,[57] మరియు టీకా మందు చింపాంజీల నుండి మానవులకు SIVను సంక్రమణం చేయవలసిన తప్పనిసరి పరిస్థితులను సృష్టిస్తోందనీ, HIV AIDSను కలిగిస్తోందనీ 1990లలో వివాదాలు రేగాయి. ఏదేమైనా ఈ వాదాలన్నీ ఖండించబడ్డాయి.[55] 2004 నాటికి, ఆఫ్రికాలో పోలియోమైలిటీస్ కేసులు ఖండపు పశ్చిమ భాగానికి చెందిన ఏకాకి ప్రాంతాలలో కేవలం స్వల్ప సంఖ్యకు తగ్గిపోయాయి, మిగిలిన చోట్ల చెదురుమదురు కేసులున్నాయి. ఏదేమైనా, ఇటీవల టీకామందు ప్రచారాలకు వ్యతిరేకత పుట్టింది.[58][59] తరచుగా టీకామందు వంధ్యత్వాన్ని ప్రేరేపిస్తుందన్న భయాలకు సంబంధించి ఉంటోంది.[60] నైజీరియా మరియు పెక్కు ఇతర ఆఫ్రికన్ దేశాలలో స్థానిక ప్రజలు తమ పిల్లలు పోలియో టీకామందు గ్రహించటాన్ని నిరాకరించినందు వల్లనే రోగం తిరిగి తలఎత్తుతోందని అంటువ్యాధి నిపుణులులు విశ్వసిస్తారు.[61]

సూచనలు[మార్చు]

 1. "A Science Odyssey: People and Discoveries". PBS. 1998. Retrieved 2008-11-29. 
 2. 2.0 2.1 Fine P, Carneiro I (15 November 1999). "Transmissibility and persistence of oral polio vaccine viruses: implications for the global poliomyelitis eradication initiative". Am J Epidemiol 150 (10): 1001–21. PMID 10568615. 
 3. Aylward RB (2006). "Eradicating polio: today's challenges and tomorrow's legacy". Annals of Tropical Medicine and Parasitology 100 (5-6): 401–13. doi:10.1179/136485906X97354. PMID 16899145. Retrieved 2009-01-02. 
 4. Schonberger L, Kaplan J, Kim-Farley R, Moore M, Eddins D, Hatch M (1984). "Control of paralytic poliomyelitis in the United States". Rev. Infect. Dis. 6 Suppl 2: S424–6. PMID 6740085. 
 5. 5.0 5.1 Centers for Disease Control and Prevention (CDC) (October 2006). "Update on vaccine-derived polioviruses". MMWR Morb. Mortal. Wkly. Rep. 55 (40): 1093–7. PMID 17035927. 
 6. 6.0 6.1 6.2 6.3 Kew O, Sutter R, de Gourville E, Dowdle W, Pallansch M (2005). "Vaccine-derived polioviruses and the endgame strategy for global polio eradication". Annu Rev Microbiol 59: 587–635. doi:10.1146/annurev.micro.58.030603.123625. PMID 16153180. 
 7. "Wild Poliovirus Weekly Update". Global Polio Eradication Initiative. 2008-11-25. Archived from the original on 2008-06-16. Retrieved 2008-11-29. 
 8. 8.0 8.1 Pearce J (2004). "Salk and Sabin: poliomyelitis immunisation". J Neurol Neurosurg Psychiatry 75 (11): 1552. doi:10.1136/jnnp.2003.028530. PMC 1738787. PMID 15489385. 
 9. Rainsberger M (2005-06-27). "More than a March of Dimes". The University of Texas at Austin. Retrieved 2008-11-29. 
 10. Enders JF, Weller TH, Robbins FC (January 1949). "Cultivation of the Lansing Strain of Poliomyelitis Virus in Cultures of Various Human Embryonic Tissues". Science (journal) 109 (2822): 85–87. doi:10.1126/science.109.2822.85. PMID 17794160. 
 11. "The Nobel Prize in Physiology or Medicine 1954". The Nobel Foundation. Retrieved 2008-11-29. 
 12. Hammon W, Coriell L, Wehrle P, Stokes J (1953). "Evaluation of Red Cross gamma globulin as a prophylactic agent for poliomyelitis. IV. Final report of results based on clinical diagnoses". J Am Med Assoc 151 (15): 1272–85. PMID 13034471. 
 13. 13.0 13.1 13.2 13.3 13.4 "Competition to develop an oral vaccine". Conquering Polio. Sanofi Pasteur SA. 2007-02-02. Archived from the original on 2007-10-16. 
 14. "Public Health Weekly Reports for OCTOBER 10, 1947". Public Health Rep 62 (41): 1467–1498. October 1947. PMC 1995293. PMID 19316151. 
 15. Koprowski, Hilary (15 October 2010). "Interview with Hilary Koprowski, sourced at History of Vaccines website". College of Physicians of Philadelphia. Retrieved 15 October 2010. 
 16. 16.0 16.1 16.2 16.3 16.4 16.5 16.6 Atkinson W, Hamborsky J, McIntyre L, Wolfe S, eds. (2008). Epidemiology and Prevention of Vaccine-Preventable Diseases (The Pink Book) (PDF) (10th ed. (2nd printing) ed.). Washington, D.C.: Public Health Foundation. Retrieved 2008-11-29. 
 17. Mastny, Lisa (1999-01-25). "Eradicating Polio: A Model for International Cooperation". Worldwatch Institute. Retrieved 2008-11-29. 
 18. 18.0 18.1 Centers for Disease Control and Prevention (CDC) (1994). "International Notes Certification of Poliomyelitis Eradication – the Americas, 1994". Morbidity and Mortality Weekly Report (Centers for Disease Control and Prevention) 43 (39): 720–722. PMID 7522302. 
 19. , (2001). "General News. Major Milestone reached in Global Polio Eradication: Western Pacific Region is certified Polio-Free" (PDF). Health Educ Res 16 (1): 109. doi:10.1093/her/16.1.109. 
 20. D'Souza R, Kennett M, Watson C (2002). "Australia declared polio free". Commun Dis Intell 26 (2): 253–60. PMID 12206379. 
 21. "Europe achieves historic milestone as Region is declared polio-free" (Press release). European Region of the World Health Organization. 2002-06-21. Retrieved 2008-08-23. 
 22. Offit, Paul A. (2007). The Cutter Incident: How America's First Polio Vaccine Led to the Growing Vaccine Crisis. Yale University Press. p. 38. ISBN 0300126050. 
 23. డేవిడ్ ఒషిన్‌స్కీ "మిరకిల్ వర్కర్స్," అమెరికన్ హెరిటేజ్ , వింటర్ 2010.
 24. "Polio Victory Remembered as March of Dimes Marks 50th Anniversary of Salk Vaccine Field Trials". News Desk. 2004-04-26. Retrieved 2008-11-29. 
 25. Smith, Jane S. (1990). Patenting the Sun: Polio and the Salk Vaccine. William Morrow & Co. ISBN 0-688-09494-5. 
 26. Sorem A, Sass EJ, Gottfried G (1996). Polio's legacy: an oral history. Washington, D.C: University Press of America. ISBN 0-7618-0144-8. 
 27. Hinman A (1984). "Landmark perspective: Mass vaccination against polio". JAMA 251 (22): 2994–6. doi:10.1001/jama.251.22.2994. PMID 6371280. 
 28. 28.0 28.1 28.2 28.3 Joint Committee on Vaccination and Immunisation, David Salisbury (Editor), Mary Ramsay (Editor), Karen Noakes (Editor) (2006). "26: Poliomyelitis". Immunisation Against Infectious Disease (PDF). Edinburgh: Stationery Office. pp. 313–29. ISBN 0-11-322528-8. 
 29. 29.0 29.1 29.2 "Poliomyelitis prevention: recommendations for use of inactivated poliovirus vaccine and live oral poliovirus vaccine. American Academy of Pediatrics Committee on Infectious Diseases". Pediatrics 99 (2): 300–5. 1997. doi:10.1542/peds.99.2.300. PMID 9024465. 
 30. 30.0 30.1 Robertson, Susan. "Module 6: Poliomyelitis" (PDF). The Immunological Basis for Immunization Series. World Health Organization (Geneva, Switzerland). Retrieved 2008-11-29. 
 31. Sabin A, Ramos-Alvarez M, Alvarez-Amezquita J et al. (1960). "Live, orally given poliovirus vaccine. Effects of rapid mass immunization on population under conditions of massive enteric infection with other viruses". JAMA 173: 1521–6. PMID 14440553. 
 32. Ochs K, Zeller A, Saleh L et al. (January 2003). "Impaired binding of standard initiation factors mediates poliovirus translation attenuation". J. Virol. 77 (1): 115–22. doi:10.1128/JVI.77.1.115-122.2003. PMC 140626. PMID 12477816. 
 33. Gromeier M, Bossert B, Arita M, Nomoto A, Wimmer E (February 1999). "Dual stem loops within the poliovirus internal ribosomal entry site control neurovirulence". J. Virol. 73 (2): 958–64. PMC 103915. PMID 9882296. 
 34. Smallman-Raynor, Matthew (2006). Poliomyelitis: A World Geography: Emergence to Eradication. Oxford University Press, USA. ISBN 0-19-924474-X. 
 35. Poliomyelitis Eradication: Field Guide. Washington: Pan American Health Organization. 2006. ISBN 92-75-11607-5. 
 36. Shimizu H, Thorley B, Paladin FJ et al. (December 2004). "Circulation of type 1 vaccine-derived poliovirus in the Philippines in 2001". J. Virol. 78 (24): 13512–21. doi:10.1128/JVI.78.24.13512-13521.2004. PMC 533948. PMID 15564462. 
 37. 37.0 37.1 Cono J, Alexander LN (2002). "Chapter 10: Poliomyelitis" (PDF). Vaccine-Preventable Disease Surveillance Manual (3rd ed. ed.). 
 38. Kew O et al. (2002). "Outbreak of poliomyelitis in Hispaniola associated with circulating type 1 vaccine-derived poliovirus.". Science 296 (5566): 356–9. doi:10.1126/science.1068284. PMID 11896235. 
 39. Yang CF, Naguib T, Yang SJ et al. (August 2003). "Circulation of endemic type 2 vaccine-derived poliovirus in Egypt from 1983 to 1993". J. Virol. 77 (15): 8366–77. doi:10.1128/JVI.77.15.8366-8377.2003. PMC 165252. PMID 12857906. 
 40. Racaniello V (2006). "One hundred years of poliovirus pathogenesis". Virology 344 (1): 9–16. doi:10.1016/j.virol.2005.09.015. PMID 16364730. 
 41. "What is vaccine-derived polio?". WHO. 2007-10-08. Retrieved 2008-11-29. 
 42. Kew O, Wright P, Agol V et al. (2004). "Circulating vaccine-derived polioviruses: current state of knowledge". Bull World Health Organ 82 (1): 16–23. PMC 2585883. PMID 15106296. 
 43. Fox, Maggie (2002-03-15). "Polio in Haiti linked to incomplete vaccinations: Virus can mutate and kill". National Post (Canada). Archived from the original on 2002-06-03. Retrieved 2008-11-29. 
 44. Liang X, Zhang Y, Xu W et al. (2006). "An outbreak of poliomyelitis caused by type 1 vaccine-derived poliovirus in China". J Infect Dis 194 (5): 545–51. doi:10.1086/506359. PMID 16897650. 
 45. Centers for Disease Control and Prevention (CDC) (September 2007). "Update on vaccine-derived polioviruses--worldwide, January 2006-August 2007". MMWR Morb. Mortal. Wkly. Rep. 56 (38): 996–1001. PMID 17898693. 
 46. "Mutant polio virus spreads in Nigeria". CBS News. August 14, 2009. Retrieved 2009-08-16. 
 47. 47.0 47.1 47.2 47.3 "Simian Virus 40 (SV40), Polio Vaccine, and Cancer". Vaccine Safety. Centers for Disease Control. 2004-04-22. Retrieved 2010-12-28. 
 48. Eddy B, Borman G, Berkeley W, Young R (1961). "Tumors induced in hamsters by injection of rhesus monkey kidney cell extracts". Proc Soc Exp Biol Med 107: 191–7. PMID 13725644. 
 49. Carbone M (1999). "Simian virus 40 and human tumors: It is time to study mechanisms". J Cell Biochem 76 (2): 189–93. doi:10.1002/(SICI)1097-4644(20000201)76:2<189::AID-JCB3>3.0.CO;2-J. PMID 10618636. 
 50. Vilchez R, Kozinetz C, Arrington A, Madden C, Butel J (2003). "Simian virus 40 in human cancers". Am J Med 114 (8): 675–84. doi:10.1016/S0002-9343(03)00087-1. PMID 12798456. 
 51. 51.0 51.1 Engels E (2005). "Cancer risk associated with receipt of vaccines contaminated with simian virus 40: epidemiologic research" (PDF). Expert Rev Vaccines 4 (2): 197–206. doi:10.1586/14760584.4.2.197. PMID 15889993. 
 52. Bookchin D (2004-07-07). "Vaccine scandal revives cancer fear". New Scientist. Archived from the original on 2004-07-20. Retrieved 2008-11-29. 
 53. Strickler H, Rosenberg P, Devesa S, Hertel J, Fraumeni J, Goedert J (1998). "Contamination of poliovirus vaccines with simian virus 40 (1955-1963) and subsequent cancer rates". JAMA 279 (4): 292–5. doi:10.1001/jama.279.4.292. PMID 9450713. 
 54. Olin P, Giesecke J (1998). "Potential exposure to SV40 in polio vaccines used in Sweden during 1957: no impact on cancer incidence rates 1960 to 1993". Dev Biol Stand 94: 227–33. PMID 9776244. 
 55. 55.0 55.1 Plotkin SA (2001). "CHAT oral polio vaccine was not the source of human immunodeficiency virus type 1 group M for humans". Clin. Infect. Dis. 32 (7): 1068–84. doi:10.1086/319612. PMID 11264036. 
 56. Koprowski H (July 1960). "Historical aspects of the development of live virus vaccine in poliomyelitis". Br Med J 2 (5192): 85–91. doi:10.1136/bmj.2.5192.85. PMC 2096806. PMID 14410975. 
 57. Collins, Huntly (2000-11-06). "The Gulp Heard Round the World". Philadelphia Inquirer. pp. Section D, page 1. Archived from the original on 2004-04-05. Retrieved 2008-11-29. 
 58. "Nigeria Muslims oppose polio vaccination". Africa (BBC News). 2002-06-27. Retrieved 2008-11-29. 
 59. Dugger CW, McNeil DG (2006-03-20). "Rumor, Fear and Fatigue Hinder Final Push to End Polio". New York Times. Retrieved 2008-11-29. 
 60. "Anti-polio vaccine Malians jailed". Africa (BBC News). 2005-05-12. Retrieved 2008-11-29. 
 61. Jegede AS (March 2007). "What led to the Nigerian boycott of the polio vaccination campaign?". PLoS Med. 4 (3): e73. doi:10.1371/journal.pmed.0040073. PMC 1831725. PMID 17388657. 

బాహ్య లింకులు[మార్చు]

మూస:Vaccines