ఆవుల పిచ్చయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆవుల పిచ్చయ్య (1919) తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కథా రచయిత.[1]

ఆవుల పిచ్చయ్య
జననంఆవుల పిచ్చయ్య
1919
India నల్గొండ జిల్లా, సూర్యాపేట తెలంగాణ
నివాస ప్రాంతంసూర్యాపేట, తెలంగాణ
వృత్తితెలంగాణ సాయుధ పోరాటయోధుడు మరియు కథా రచయిత

జీవిత విశేషాలు[మార్చు]

ఆవుల పిచ్చయ్య 1919 నల్గొండ జిల్లా లోని సూర్యాపేటలో జన్మించాడు. [2] పెద్ద చదువులు చదవకుండానే చిన్నతనం నుండే అభ్యుదయ భావాలు అలవరుచుకున్న ఆవుల పిచ్చయ్య సమాజంలో దుర్మార్గాన్ని ప్రశ్నిస్తూ కథలు వ్రాసిన గొప్ప రచయిత. అతను తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో పాల్గొని 1947-49 మధ్య జైలు శిక్షను కూడా అనుభవించారు. ఇతను కథలన్నీ మిజాన్ పత్రిక గట్టి ప్రోత్సాహం ఇచ్చి ప్రచురిందించి. గొడ్డి కొమురయ్య మరణ గాథను ఆవుల పిచ్చయ్య "ఊరేగింపులు" కథగా మలిచాడు. దౌరా, చపరాసి దినచర్య, ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగిన జమీందార్ మొదలగు కథలు రాసాడు. [3]

అతను ఉద్యమ కథలు రాశారు. ఆవుల పిచ్చయ్య రాసిన ''ఈతగింజిచ్చి తాటిగింజలాగిన జమీందార్‌'' ''ఊరేగింపులు'', ''దౌరా'' కథలు 1946లో మీజాన్‌ పత్రికలో అచ్చయ్యాయి.[4] అంతగా, చదువుకోని ఆవుల పిచ్చయ్య రాసిన కథల్ని మీజాన్ ప్రచురించింది.[5] సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న సాహిత్యకారుడు ఆవుల పిచ్చయ్య కథల్ని అచ్చు రూపంలోకి తెచ్చినవాడు సంగిశెట్టి శ్రీనివాస్.[6]

కథా సంపుటాలు[మార్చు]

 • ఆవుల పిచ్చయ్య కథలు

కథలు[మార్చు]

 • ఈతగింజ
 • ఊరేగింపులు
 • చపరాసీ దినచర్య
 • దౌరా
 • వెట్టిచాకలి దినచర్య

మూలాలు[మార్చు]

 1. "అనుపమ అక్షర కృషీవలురు తెలంగాణ తేజాలు".
 2. ఆవుల పిచ్చయ్య. "రచయిత: ఆవుల పిచ్చయ్య". kathanilayam.com. కథా నిలయం. Retrieved 15 October 2017.
 3. "తెలంగాణ కథ - సాహిత్య ప్రస్థానం 2 వ భాగం" (PDF).
 4. "శత వసంతాల నల్లగొండ జిల్లా కథా స్రవంతి".
 5. "కథలకు దిక్సూచి సుజాత – సంగిశెట్టి శ్రీనివాస్".
 6. "తర్జుమా కావాలి: సంగిశెట్టి".