ఆశిష్ దేశ్‌ముఖ్
ఆశిష్ దేశ్‌ముఖ్ | |||
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | *సునీల్ కేదార్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | *సావనెర్ | ||
పదవీ కాలం 2014 – 2019 | |||
తరువాత | *అనిల్ దేశ్‌ముఖ్ | ||
నియోజకవర్గం | *కటోల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగ్‌పూర్, మహారాష్ట్ర, భారతదేశం | 1974 డిసెంబరు 11||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ |
| ||
ఇతర రాజకీయ పార్టీలు | *భారత జాతీయ కాంగ్రెస్ (2018-2023) | ||
తల్లిదండ్రులు | *రంజీత్ దేశ్‌ముఖ్, రూప దేశ్‌ముఖ్ | ||
జీవిత భాగస్వామి | *ఆయుశ్రీ ఆశిష్ దేశ్‌ముఖ్ | ||
సంతానం | *హృదయ్ & జిగర్ | ||
పూర్వ విద్యార్థి | *శ్రీ రామదేవబాబా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ | ||
వృత్తి | *రాజకీయ నాయకుడు
|
ఆశిష్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు కటోల్, సావనెర్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఆశిష్ దేశ్‌ముఖ్ భారతీయ జనతా పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి డిసెంబరు 2013లో ప్రత్యేక విదర్భ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు.[1] ఆయన 2014 ఎన్నికలలో కటోల్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి అనిల్ దేశ్‌ముఖ్ పై 5,557 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన ఆ తరువాత అక్టోబర్ 12, 2018లో మహారాష్ట్రలో ముఖ్యంగా విదర్భలో నిరుద్యోగం, రైతులు, దళితులు, మైనారిటీల దుస్థితి వంటి సమస్యలను పరిష్కరించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమవడంతో బీజేపీ పార్టీకి రాజీనామా చేశాడు.[3]
ఆశిష్ దేశ్‌ముఖ్ కాంగ్రెస్ పార్టీలో 2019 శాసనసభ ఎన్నికలలో నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ చేతిలో 49,344 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, మహారాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలేను విమర్శించినందుకు కాంగ్రెస్ పార్టీ అనిల్ దేశ్‌ముఖ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసిన తర్వాత 2023 మే 22న ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.[5]
ఆశిష్ దేశ్‌ముఖ్ 2023 జూన్ 18న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరి,[6] బిజెపి ఒబిసి మోర్చా అధ్యక్షుడయ్యాడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో సావనెర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనూజ సునీల్ కేదార్‌పై 26,401 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Youth leader Deshmukh's fast for separate Vidarbha state enters sixth day". Indian Express. 2013-12-11. Retrieved 8 June 2015.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ Vartha Bharathi (12 October 2019). "Ashish Deshmukh quits BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ The Indian Express (15 June 2023). "Expelled from Congress, Ashish Deshmukh is all set to rejoin BJP after 5 years" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ ETV Bharat News (18 June 2023). "Ashish Deshmukh Join BJP: माजी आमदार आशिष देशमुख यांची आज भाजपमध्ये घरवापसी; 'या' मंत्र्यांच्या उपस्थितीत झाला पक्षप्रवेश". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.
- ↑ Election Commission of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Savner". Archived from the original on 6 December 2024. Retrieved 6 December 2024.