Jump to content

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్

వికీపీడియా నుండి
తుది వినియోగదారు నుండి 3/2 ISP ల వరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎంపికలు

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) అంటే అంతర్జాలం (ఇంటర్నెట్) లో ప్రవేశించడానికి, వాడుకోవడానికి, పాల్గొనడానికి అవకాశం కల్పించే సంస్థ. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పలు రకాలుగా ఉండవచ్చు. వాణిజ్యపరమైనవి, లాభాపేక్షరహితమైనవి, ప్రైవేటు వ్యక్తుల చేతిలోనివి అయి ఉండవచ్చు. అంతర్జాల ప్రవేశం, విహరించడం, డొమైన్ పేరు నమోదు, వెబ్ హోస్టింగ్, యూజ్ నెట్ సర్వీసు లాంటి సేవలు ఈ సంస్థలు ప్రధానంగా అందిస్తుంటాయి. అంతర్జాలంలో లభించే ఏ సేవ వినియోగించుకోవలన్నీ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఒక ప్రవేశ ద్వారం లాంటివి.[1]

ఉదాహరణకు విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ భారతదేశంలో గల ఒక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడరు.

చరిత్ర

[మార్చు]

అంతర్జాలం (మొదట్లో ఆర్పానెట్ - ARPAnet) ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు, కొన్ని విశ్వవిద్యాలయాల్లోని విభాగాలకు వారధిగా ఉండేందుకు అభివృద్ధిచేయబడింది. ఇతర సంస్థలు నేరుగా బ్యాక్ బోన్ కు అనుసంధానమై కానీ, అంతర్జాలానికి అనుసంధానమైన ఇతర సంస్థల ద్వారా ఏర్పాట్లు చేసుకుని గానీ, UUCP లాంటి డయల్ అప్ ఉపకరణాలను ఉపయోగించి గానీ అంతర్జాలాన్ని వాడుకుంటారు. 1980 దశాబ్దం చివరకు వచ్చేసరికి అంతర్జాలాన్ని సాధారణ ప్రజలు, వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకునేందుకు కొన్ని విధానాలు ఏర్పాటు అయ్యాయి. వరల్డ్ వైడ్ వెబ్ అందుబాటులోకి వచ్చిన కొద్దికాలం తర్వాత[2] 1991 సంవత్సరంలో కొన్ని నియంత్రణలు ఎత్తివేశారు.[3]

1980 దశకంలోనే కంప్యూసర్వ్ (CompuServ), అమెరికా ఆన్లైన్ (AOL) లాంటి కంపెనీలు అంతర్జాలాన్ని ఈమెయిలు వాడకం లాంటి నియంత్రిత విధానాల ద్వారా చేరుకోవడానికి అవకాశం కల్పించాయి. కానీ సాధారణ ప్రజలు అంతర్జాలాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి సాధ్యం కాలేదు. 1989 లో ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో కొన్ని తొలితరం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఏర్పడి, నెలవారీ కొంత రుసుము చెల్లించి అంతర్జాలాన్ని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు అవకాశం కల్పించాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "What is an Internet Service Provider?". WhatIsMyIPAddress.com (in ఇంగ్లీష్). Retrieved 2020-05-30.
  2. "Web history timeline". 2014-03-11. Retrieved 21 September 2015.
  3. Outreach: The Internet Archived 2014-01-18 at the Wayback Machine, U.S. National Science Foundation, "In March 1991, the NSFNET acceptable use policy was altered to allow commercial traffic."
  4. Clarke, Roger. "Origins and Nature of the Internet in Australia". Retrieved 21 January 2014.