ఐబిఎం

వికీపీడియా నుండి
(ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్
IBM
గతంలోకంప్యూటింగ్-టాబ్యులేటింగ్-రికార్డింగ్ (1911–1924)
రకంపబ్లిక్
ISINISINUS4592001014
పరిశ్రమసమాచార సాంకేతికత
పూర్వీకులుBundy Manufacturing Company
Computing Scale Company of America
International Time Recording Company
Tabulating Machine Company
కంప్యూటింగ్-టాబ్యులేటింగ్-రికార్డింగ్
స్థాపనజూన్ 16, 1911; 113 సంవత్సరాల క్రితం (1911-06-16) (as Computing-Tabulating-Recording Company)
Endicott, New York, U.S.[1]
స్థాపకుడుGeorge Winthrop Fairchild
Charles Ranlett Flint
Herman Hollerith
ప్రధాన కార్యాలయం1 ఆర్చర్డ్ రోడ్,
ఆర్మాంక్, న్యూయార్క్
,
అమెరికా
సేవ చేసే ప్రాంతము
177 దేశాలు
కీలక వ్యక్తులు
ఉత్పత్తులుఆటోమేషన్
రోబోటిక్స్
కృత్రిమ మేధస్సు
క్లౌడ్ కంప్యూటింగ్
కన్సల్టింగ్
బ్లాక్‌చెయిన్
కంప్యూటర్ హార్డ్‌వేర్
సాఫ్ట్‌వేర్
క్వాంటం కంప్యూటింగ్
బ్రాండ్లు
సేవలు
రెవెన్యూIncrease US$61.860 billion (2023)
Increase US$8.690 billion (2023)
Increase US$7.502 billion (2023)
Total assets Increase US$135.241 billion (2023)
Total equityIncrease US$22.613 billion (2023)
ఉద్యోగుల సంఖ్య
282,200 (December 2023)
అనుబంధ సంస్థలుList of subsidiaries
వెబ్‌సైట్www.ibm.com Edit this on Wikidata
Footnotes / references
[5]

ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (IBM) ఒక అమెరికన్ బహుళజాతి సంస్థ. దీనినే బిగ్ బ్లూ అనే ముద్దుపేరుతో కూడా పిలుస్తారు.[6] దీని ప్రధాన కార్యాలయం ఆర్మాంక్, న్యూయార్క్ లో ఉంది. ఇది 175 కి పైగా దేశాలలో పనిచేస్తుంది.[7][8] పబ్లిక్ స్టాక్ మార్కెట్ లో నమోదు అయి ఉన్న కంపెనీ.[9][10] ఐబిఎం ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక పరిశోధనా సంస్థ. దీనికి సుమారు డజను దేశాలకు పైగా 19 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. 1993 నుంచి 2021 దాకా సుమారు 29 సంవత్సరాల పాటు అత్యధిక అమెరికన్ పేటెంట్లు కలిగిఉన్న సంస్థ.

ఈ సంస్థ 1911లో కంప్యూటింగ్-టాబ్యులేటింగ్-రికార్డింగ్ (CPR) అనే పేరుతో ప్రారంభమైంది. 1924 లో దీనిని ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ అని పేరు మార్చారు. 1960, 70 దశకాల్లో సిస్టం 360 ఆధారిక మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేయడం ద్వారా కంప్యూటింగ్ పరికరాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. అప్పట్లో అమెరికాలో 80 శాతం, ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం కంప్యూటర్లను ఈ సంస్థే తయారు చేసేది.[11]

1981 లో మొదటిసారిగా ఐబిఎంపర్సనల్ కంప్యూటర్ పేరుతో మైక్రోకంప్యూటర్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది మైక్రోసాఫ్ట్ సంస్థ అభివృద్ధి చేసిన డాస్ ఆపరేటింగ్ సిస్టం సహాయంతో పనిచేసేది. ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ తయారు చేసిన సాఫ్ట్‌వేరు వ్యక్తిగత కంప్యూటర్ల మార్కెట్‌ను శాసిస్తుండటం గమనార్హం.[12]

మూలాలు

[మార్చు]
  1. "Certificate of Incorporation of Computing-Tabulating-Recording-Co", Appendix to Hearings Before the Committee on Patents, House of Representatives, Seventy-Fourth Congress, on H. R. 4523, Part III, United States Government Printing Office, 1935 [Incorporation paperwork filed June 16, 1911], archived from the original on August 3, 2020, retrieved July 18, 2019
  2. "IBM Is Blowing Up Its Annual Performance Review". Fortune. February 1, 2016. Archived from the original on October 29, 2020. Retrieved July 22, 2016.
  3. "IBM – Arvind Krishna – Chief Executive Officer". www.ibm.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on March 8, 2022. Retrieved March 8, 2022.
  4. "IBM Newsroom - Gary Cohn". IBM Newsroom (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved March 8, 2022.
  5. "US SEC: Form 10-K IBM". U.S. Securities and Exchange Commission. 26 February 2024.
  6. "IBM100 - The Making of International Business Machines". www-03.ibm.com (in అమెరికన్ ఇంగ్లీష్). March 7, 2012. Archived from the original on October 5, 2018. Retrieved December 30, 2022.
  7. "Trust and responsibility. Earned and practiced daily". IBM Impact (in అమెరికన్ ఇంగ్లీష్). June 27, 2019. Retrieved December 30, 2022.
  8. "10-K". 10-K. Archived from the original on December 5, 2019. Retrieved June 1, 2019.
  9. "Dow Jones Industrial Average". SlickCharts. Retrieved 3 October 2024.
  10. "IBM Overview". Yahoo! Finance. Retrieved 3 October 2024.
  11. "IBM | Founding, History, & Products | Britannica". www.britannica.com (in ఇంగ్లీష్). Retrieved December 30, 2022.
  12. Alfred, Randy. "Aug. 12, 1981: IBM Gets Personal With 5150 PC". Wired (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 1059-1028. Retrieved 2024-11-19.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐబిఎం&oldid=4361346" నుండి వెలికితీశారు