ఇంటిలిజెంట్
ఇంటిలిజెంట్ 2018 ఫిబ్రవరి 9న విడుదలైన తెలుగు చిత్రం.[1][2]
కథ
[మార్చు]విజన్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ అధినేత నందకిషోర్ (నాజర్) అనాథలకు, పేదవాళ్లకు సహాయపడుతుంటాడు. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులను కూడా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. నందకిషోర్ సహాయంతో చదువుకుని... ఆయన కంపెనీలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదిస్తాడు తేజ (సాయిధరమ్ తేజ్). తన స్నేహితులు (రాహుల్ రామకృష్ణ, సప్తగిరి, నల్లవేణు)లతో కలిసి, నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ ఉండే తేజు జీవితంలోకి ఓ అమ్మాయి (లావణ్య త్రిపాఠి) ప్రవేశిస్తుంది . ముందు తేజ అంటే ఇష్టపడకపోయినా.. అమ్మాయిలంటే అతనికున్న గౌరవాన్ని చూసి అతన్ని ఇష్టపడుతుంది. అదే సమయంలో నందకిషోర్ తన సంస్థ ఉద్యోగులకు ఇస్తున్న ప్రోత్సాహకాలు చూసి.. నందకిషోర్‌ను దెబ్బ కొట్టి.. సంస్థను సొంతం చేసుకోవాలనుకుంటారు ప్రత్యర్థి వర్గం. అందులో భాగంగా మాఫియా నాయకుడు విక్కీ భాయ్(రాహుల్ దేవ్), అతని తమ్ముడు (దేవ్ గిల్)ల సహాయం తీసుకుంటారు. విక్కీ బృందం నందకిషోర్‌ను బెదిరించినా లొంగడు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలవాలనుకుంటాడు. అయితే అనుకోకుండా తన సంస్థ విజన్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌ను విక్కీకి రాసేసి ఆత్మహత్య చేసుకుంటాడు నందకిషోర్. అదే సమయంలో తేజపై దాడి జరగుతుంది. అసలు నంద కిషోర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? అసలు అది ఆత్మహత్యా? హత్యా? చివరకు తనకు అండగా నిలబడ్డ నందకిషోర్ కుటుంబం కోసం తేజ ఎలాంటి సాహసం చేస్తాడు? అనే విషయాలు మిగిలిన కథలో భాగం.
తారాగణం
[మార్చు]- సాయి ధరమ్ తేజ్
- లావణ్య త్రిపాఠి
- నాజర్
- బ్రహ్మానందం
- పోసాని కృష్ణమురళి
- ఆకుల శివ
- కాశీ విశ్వనాథ్
- ఆశిష్ విద్యార్థి
- షాయాజీ షిండే
- రాహుల్‌దేవ్
- దేవ్‌గిల్
- వినీత్‌కుమార్
- జె.పి. పృథ్వీ
- కాదంబరి కిరణ్
- విద్యుల్లేఖా రామన్
- సప్తగిరి
- తాగుబోతు రమేష్
- భద్రం
పాటల జాబితా
[మార్చు]- లెట్స్ డో, రచన: చంద్రబోస్, గానం. సాకేత్ కొమండురి, శ్రీకృష్ణ
- చమక్ చమక్ చాం , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎస్ పి. చరణ్, హరిణి ఇవటూరి
- నా సెల్ ఫోన్, రచన: వరికుప్పల యాదగిరి , గానం. మనీషా ఈరాబతిని , జస్ప్రీత్ జాస్
- కళ కళ కళా మందిర్, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం. గీతా మాధురి, నకాష్ అజీజ్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, మాటలు: శివ ఆకుల
- ఛాయాగ్రహణం: ఎస్.వి. విశ్వేశ్వర్
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- కూర్పు: గౌతంరాజు
- కళ: బ్రహ్మ కడలి
- నిర్మాణ సంస్థ: సి.కె. ఎంటర్టైన్మెంట్స్
- సహనిర్మాతలు: సి.వి.రావు, నాగరాజ పత్సా
- నిర్మాత: సి.కళ్యాణ్
- కథనం, దర్శకత్వం: వి. వి. వినాయక్[3]
మూలాలు
[మార్చు]- ↑ "Sai Dharam Tej unveils his first look from 'Intelligent'". times of india.
- ↑ "Sai Dharam Tej Intelligent first look released : VV Vinayak, Lavanya Tripathi". the fine express. Archived from the original on 2018-02-01. Retrieved 2018-02-09.
- ↑ మన తెలంగాణ, సినిమా (27 January 2018). "ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు వి.వి. వినాయక్". Archived from the original on 22 June 2020. Retrieved 22 June 2020.