ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
Main(Administrative)Building IIT-Roorkee.JPG
ప్రధాన కార్యాలయ భవనం
పూర్వపు నామములు
రూర్కీ విశ్వవిద్యాలయం (1948-2001), ధామ్సన్ సివిల్ ఇంజనీరింగ్ కళాశాల (1853-1948), రూర్కీ సివిల్ ఇంజనీరింగ్ కళాశాల (1847-1853)
నినాదం"श्रमं विना न किमपि साध्यम्"
ఆంగ్లంలో నినాదం
Nothing Is Possible Without Hard Work
రకంPublic
స్థాపితం1847
చైర్మన్అనలిజిత్ సింగ్
డైరక్టరుప్రదీప్తా బెనర్జీ
Deputy Directorడి.కె పాల్
విద్యాసంబంధ సిబ్బంది
342
నిర్వహణా సిబ్బంది
1220
విద్యార్థులు4137
స్థానంరూర్కీ, ఉత్తరాఖండ్, భారతదేశం
కాంపస్పట్టణం
జాలగూడుwww.iitr.ac.in
150px

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ ( ఇంగ్లీషు Indian Institute of Technology (IIT), Roorkee, హిందీ भारतीय प्रौद्योगिकी संस्थान रुड़की) ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఉంది. ఆసియాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాల ఇదే. 1847లో స్థాపించబడిన ఈ సంస్థ, 1949లో విశ్వవిద్యాలయ హోదాని పొంది రూర్కీ విశ్వవిద్యాలయంగా మారింది. 2001లో దీనికి ఐఐటీ హోదా ఇవ్వబడింది. ఇందులో ఇంజనీరింగ్, మానవ, సామజిక శాస్త్రాలకు చెందిన 18 విభాగాలు ఉన్నాయి.

చరిత్ర[మార్చు]

విశ్వవిద్యాలయం యొక్క 150వ వార్షికోత్సవం సందర్భంగా తపాలా శాఖ విడుదల చేసిన స్టాంపు

1845 సంవత్సరంలో స్థానిక యువతకి ఇంజనీరింగ్ పనులకోసం ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఇది మొదలైంది.[1] 1847 సంవత్సరంలో అధికారికంగా ప్రారంభమైంది.[2] 1854 సంవత్సరంలో, కళశాల వ్యవస్థాపకులు కెఫ్టినెంట్ జనరల్ సర్ జేమ్స్ థామ్సన్ ఫెరుమీద "థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్"గా మార్చబడింది[1]. ఈ కాశాలనుండి పాసైన మొదటి భారతీయుడు, 1852లో పాసైన రాయ్ బహుదూర్ కన్హైయా లాల్.

మొదట్లో, ఇంజనీరింగ్ క్లాసులు కేవలం యూరోపియన్లకి మాత్రమే ఉండేవి. అప్పర్ సబార్డినేట్ క్లాసుల్లో యూరోపియన్లతో బాటు భారతీయులు, లోయర్ సబార్డినేట్ క్లాసుల్లో కేవలం భారతీయులు చేర్చుకునేవారు. ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థికీ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ లో ఉద్యోగం లభించేది. పాసైన విద్యార్థులు గంగా నదీ కాలువల, నీటిపారుదలా వ్యవస్థల నిర్వహణలోనూ, భాక్రానంగల్, ఈజిప్టులోని ఆస్వాన్ వంటి డ్యాంల నిర్మాణంలోనూ, చండీగఢ్ నగర నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు.

1934-43 మధ్య కాలంలో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ కూడా థామ్సన్ కాలేజీలో ట్రైనింగ్ పొందారు. 1943 తర్వాత స్కూల్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ రూర్కీలో ఏర్పరిచినపుడు కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు. 1948లో స్కూల్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్, పూణేకి మార్చబడింది[3]. అటుపైన 1948 సంవత్సరంలో యూనివర్శిటీ హోదా పొంది రూర్కీ విశ్వద్యాలయం గా మారింది.

2001 సెప్టెంబరు 21న, భారత ప్రభుత్వం ఏడో ఐఐటీగా ప్రకటించింది.

విద్య[మార్చు]

ఐఐటీ రూర్కీ ఇంజనీరింగ్, టెక్నాలజీ, వాడుక విజ్ఞానం, నిర్వహణలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలని అందిస్తోంది. మొత్తంగా 11 అండర్ గ్రాడ్యుయేట్ కార్యక్రమాలు, 5 డ్యుయల్ డిగ్రీలు, 3 ఇంటిగ్రేటెడ్ ఎం.టెక్ డిగ్రీలు, 3 ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ డిగ్రీలు, 61 పోస్ట్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాలు, అనేక పి.హెచ్.డీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

బి.టెక్, బి.ఆర్క్, ఇంటిగ్రేటెడ్ కార్యక్రమాలలో ప్రవేశం ఐఐటీ-సంయుక్త ప్రవేశ పరీక్ష ద్వారా లభిస్తుంది. ఈ పరీక్ష దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలలో నిర్వహిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఇంజనీరింగ్) కార్యక్రమాలలోకి ప్రవేశం GATE స్కోరు ఆధారితంగా జరుగుతుంది. అయితే, కొన్ని విభాగాలు గేట్ స్కోరుకి పరిగణలోకి తీసుకున్నా, దరఖాస్తు చేసినవారిని ఇంటర్వ్యూ చేసిన తర్వాతే ప్రవేశం కల్పిస్తాయి. మౌలిక శాస్త్రాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి "జామ్" పరీక్ష రాయాల్సి ఉంటుంది. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో ప్రవేశం కూడా "జామ్"ద్వారానే జరుగుతుంది.సంస్థ అందించే విద్యాకార్యక్రమాలలో "నిర్వహణ" కూడా ఉంది. దీనిలో ప్రవేశం సామాన్య ప్రవేశ పరీక్షద్వారా లభిస్తుంది.

2007లో సంస్థ ప్రచురించిన గణాంకాల ప్రకారం, మొత్తం 4137 విద్యార్థులు వివిధ కార్యక్రమాలలో విద్యనభ్యసిస్తున్నారు. అంతేగాక, అనేక దేశీ, విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహనా జ్ఞాపికలను ఏర్పరుచుకున్నది.

విభాగాలు[మార్చు]

విభాగాలు, కేంద్రాలు[మార్చు]

మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
 • ఇంజనీరింగ్ మరియు అనువర్తిత శాస్త్ర విభాగాలు
  • ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్
  • బయోటెక్నాలజీ
  • కెమికల్ ఇంజనీరింగ్
  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎర్త్ క్వేక్ ఇంజనీరింగ్
  • భూవిజ్ఞానం
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్
  • హైడ్రాలజీ
  • మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
  • మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్
  • పేపర్ టెక్నాలజీ
  • వాటర్ రిసోర్సె డెవెలప్ మెంట్ అండ్ మేనేజ్మెంట్
 • శాస్త్రాలు
  • రసాయనశాస్త్రం
  • గణితశాస్త్రం
  • భౌతిక శాస్త్రం
 • వ్యాపారం
  • మేనేజ్మెంట్ స్టడీస్
 • మానవ శాస్త్రాలు
  • మానవ, సామాజిక శాస్త్రాలు

కేంద్రాలు[మార్చు]

మహాత్మా గాంధీ కేంద్రీయ గ్రంథాలయం
స్థానిక కంప్యూటర్ కేంద్రం
 • విద్యా కేంద్రాలు
  • ప్రత్యామ్నాయ జలశక్తి కేంద్రం
 • విద్యా సహాయ కేంద్రాలు
  • మహాత్మా గాంధీ కేంద్రీయ గ్రంథాలయం
  • నానోటెక్నాలజీ కేంద్రం
  • రవాణా వ్యవస్థల కేంద్రం
  • ఆపదా నివారణ మరియు నిర్వహణల కేంద్రం
  • విద్య కొనసాగింపు కేంద్రం
  • ఇన్ఫర్మేషన్ సూపర్ హైవే కేంద్రం
  • స్థానిక కంప్యూటర్ కేంద్రం
  • స్థానిక ఉపకరణాల కేంద్రం
  • బౌద్ధిక ఆస్తి హక్కుల సెల్
  • నాణ్యతాభివృద్ధి కార్యక్రమం
  • TIFAC Core
 • సహాయ సేవా కేంద్రాలు
  • ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సెల్
  • స్థానిక ఆసుపత్రి

పరిశోధనలు[మార్చు]

సంస్థలో జరుగుతున్న పరిశోధనలు విభాగస్థాయిలోగానీ, ప్రాయోజిత పరిశోధన మరియు పారిశ్రామిక కన్సల్టెన్సీ యొక్క కేంద్ర కార్యాలయ పరిధిలోగానీ జరుగుతూ ఉంటాయి. ఈ పరిశోధనలకి అవసరమైన నిధులని భారత ప్రభుత్వంలోని అనేక విభాగాలుతో బాటుగా, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధనా సంస్థలు అందిస్తున్నాయి. శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ వంటి పరిశోధనా సంస్థలు, ఈ సంస్థకి పరిశోధనా ప్రాజెక్టులని అప్పచెబుతూ ఉంటాయి. అనేక పరిశోధనా సంస్థలతో అవగాహనా జ్ఞాపికలను కలిగి ఉంది.

ఆవరణ[మార్చు]

ఐఐటీ రూర్కీ ప్రధాన ఆవరణ రూర్కీ పట్టణంలో 365 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని సహారన్ పూర్ లో 25 ఎకరాల ఉప ఆవరణలో పాలిమర్ సైన్స్, ప్రాసెన్ ఇంజనీరింగ్ మరియు పేపర్ టెక్నాలజీ విభాగాలు ఉన్నాయి. ఇవి కాక ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నొయిడాలోని, నాలెడ్జి పార్క్ - 2 వద్ద మరో పది ఎకరాల ఉప ఆవరణ ఉంది.

వసతి భవనాలు[మార్చు]

ఐఐటీ విద్యార్థుల్లో ఎక్కువమంది వేర్వేరు ప్రాంతాలనుండి వచ్చినవారవ్వడం వల్ల వసతి భవనాల్లో ఉంటారు. సంస్థ మొత్తమ్మీద 16 వసతి భవనాలున్నాయి. వాటిలో కొన్ని

 • ఆజాద్ భవన్ (బాలురు)
 • రవీంద్ర భవన్ (బాలురు)
 • కాట్లే భవన్ (బాలురు)
 • గంగా భవన్ (బాలురు)
 • రాజేంద్ర భవన్ (బాలురు)
 • గోవింద భవన్ (బాలురు)
 • రాధాకృష్ణన్ భవన్ (బాలురు)
 • రాజీవ్ భవన్ (బాలురు)
 • మాలవీయ భవన్ (బాలురు)
 • కస్తూరిబా భవన్ (బాలికలు)
 • సరోజినీ భవన్ (బాలికలు)
 • ఇందిరా భవన్ (బాలికలు)

ఇవి కాక పెళ్ళైనవారికి 6 వసతి భవనాలు ఉన్నాయి.

పూర్వ విద్యార్థులు[మార్చు]

సంస్థ నుండి బయటకి వచ్చిన వారిలో ఎంతోమంది దేశ సాంకేతిక అభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషించారు. ఈ ఐఐటీ పూర్వవిద్యార్థుల్లో 10 మంది పద్మభూషణ్ గ్రహీతలు, 25 శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం గ్రహీతలు ఉన్నారు. మరికొందరు ప్రముఖులు.

 • సర్ గంగారామ్ - ప్రముఖ సమాజసేవకుడు. పంజాబ్ లో అనేక నిర్మాణాలలో పాలుపంచుకోవడం వలన ఆధునిక లాహోర్ పితగా పిలవబడుతున్నాడు.
 • ప్రదీప్ బైజాయ్ - భారతీయ దూరసంచార నియంత్రణా సంఘం (TRAI) మాజీ ఛైర్మన్
 • నవీన్ జైన్ - ఇంటెలియస్ వ్యవస్థాపకుడు మరియు సీయీవో. మూన్ స్పేస్, ఇన్ఫోస్పేస్ ల వ్యవస్థాపకుడు

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 రూర్కీ పట్టణం The Imperial Gazetteer of India, v. 21, p. 325.
 2. "IIT-Roorkee section at the website of Uttarakhand Government". National Informatics Centre.
 3. "CME marks 50 eventful years". The Indian Express. September 15, 1998.