ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
తిరుపతి
भारतीय प्रौद्योगिकी संस्थान तिरुपति
రకంవిద్య మరియు పరిశోధనల సంస్థ
స్థాపితం2015
అండర్ గ్రాడ్యుయేట్లు120
స్థానంతిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
Coordinates: 13°37′52″N 79°28′25″E / 13.63111°N 79.47361°E / 13.63111; 79.47361
కాంపస్ప్రధాన ఆవరణ - మేరలపాక వద్ద, తాత్కాలిక ఆవరణ - కృష్ణతేజ విద్యాసంస్థలు
సంక్షిప్తనామంఐఐటి తిరుపతి
జాలగూడుwww.iittp.ac.in

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి (ఐఐటి తిరుపతి), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో ఏర్పరచబడిన స్వయంప్రతిపత్తి సాంకేతిక విద్యాసంస్థ. భారతదేశం ప్రభుత్వం చేత జాతీయ ప్రాధాన్యతా సంస్థగా గుర్తింపు పొందినది. తిరుపతి నగరంలోని చదలవాడ నగర్ లో ఉన్న కృష్ణతేజ విద్యాసంస్థలలో ఉన్న తాత్కాలిక ప్రాంగణంలో, 2015 ఆగస్టు 5 నుండి తన కార్యకలాపాలను ప్రారంభించింది. [1]2015-16 విద్యాసంవత్సరంలో, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగు విద్యలలో 30 సీట్లతో బి.టెక్ కోర్సులను చేపట్టింది. [2]


ఐఐటి తిరుపతి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌ పర్యవేక్షణలో ఉన్నది. ఈ పర్యవేక్షణ ప్రణాళికలో భాగంగా, ఐఐటి మద్రాస్ నుండి అధ్యాపకుల బృందం, ఐఐటి తిరుపతిలో విద్యాబోధన సాగిస్తుంది.

ప్రాంగణం[మార్చు]

ఐఐటి-తిరుపతి తాత్కాలికంగా, తిరుపతిలోని చదలవాడ విద్యాసంస్థల ప్రాంగణంలో ప్రారంభమైనప్పటికీ, శాశ్వత ఆవరణ రేణిగుంట,శ్రీకాళహస్తి మధ్యనున్న ఏర్పేడులో ఏర్పాటు చేయబడుతున్నది. బాలురకు వసతి, అలిపిరి వద్దనున్న, 21 సెంచరీ గురుకుల్ వద్ద, బాలిక వసతి, సంస్థ యొక్క తాత్కాలిక ఆవరణలోను ఏర్పరచబడింది. ప్రధాన ఆవరణకి స్థలసేకరణ పూర్తి అయినది. ప్రధాన ఆవరణకి దగ్గరలో అనేక జపాను కంపెనీలు తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సమీపంలోని తిరుపతి విమానాశ్రయం కూడా అంతర్జాతీయ విమానాశ్రయం కాబోతున్నది.

విద్య[మార్చు]

ఐఐటి-తిరుపతి లో జాతీయస్థాయిలో జరిగే ఐఐటీ సంయుక్త ప్రవేశ పరీక్ష (IIT-JEE)ద్వారా విద్యార్థులు, 10+2 అనంతరం చేరతారు. ఐఐటి తిరుపతి 4 ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్నది. [3]

మూలాలు[మార్చు]

  1. "IIT Tirupati all set to begin classes from Aug. 5". Cite web requires |website= (help)
  2. "IIT Madras Mentors Two New IITs – IIT Palakkad and IIT Tirupati". Cite web requires |website= (help)
  3. "Tirupati and Palakkad IITs ready to roll from August". Cite web requires |website= (help)