Jump to content

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాయచూర్

అక్షాంశ రేఖాంశాలు: 16°12′N 77°22′E / 16.2°N 77.37°E / 16.2; 77.37
వికీపీడియా నుండి
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాయచూర్
రకంఐఐఐటీ
స్థాపితం2019
మాతృ సంస్థ
ఐఐటీ హైదరాబాద్
డైరక్టరుప్రొ. బూదరాజు శ్రీనివాస మూర్తి (మెంటర్)
విద్యార్థులు56
చిరునామఐఐటీ హైదరాబాద్, సంగారెడ్డి, తెలంగాణ, భారతదేశం
16°12′N 77°22′E / 16.2°N 77.37°E / 16.2; 77.37

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాయచూర్ (ఐఐఐటీ రాయచూర్, ట్రిపుల్ ఐటీ రాయచూర్) అనేది కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ సాంకేతిక, పరిశోధన విశ్వవిద్యాలయం. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, కర్నాటక ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ సంస్థ ఏర్పాటుచేయబడింది.

చరిత్ర

[మార్చు]

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 2019లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం నమూనాలో భాగంగా ఈ ఐఐఐటీ రాయచూర్‌ను స్థాపించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాస్ (సవరణ) బిల్లు, 2020 ప్రకారం భారత ప్రభుత్వంచే జాతీయ ప్రాధాన్యతా విద్యాసంస్థల జాబితా హోదాను పొందింది. 2020 మార్చి 20న లోక్‌సభలో, 2020 సెప్టెంబరు 22 రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది.[1][2] ఐఐఐటీ రాయచూర్ 2019 జూలై 26న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్) లో తాత్కాలిక క్యాంపస్ నుండి పనిచేయడం ప్రారంభించింది. బూదరాజు శ్రీనివాస మూర్తి మెంటర్ డైరెక్టర్‌గా, ఐఐఐటీ హైదరాబాద్ మెంటార్ ఇన్‌స్టిట్యూట్‌గా ఉన్నాడు.[3]

ప్రాంగణం

[మార్చు]

అన్ని అకడమిక్, కరిక్యులర్ కార్యకలాపాలు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో జరుగుతాయి. విద్యార్థులు ఐఐటీ హైదరాబాద్‌లోని హాస్టళ్ళలో ఉంటున్నారు.[4]

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాయచూర్‌లో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి 60 ఎకరాల స్థలాన్ని ఇచ్చింది. ఐఐఐటీ రాయచూర్ కోసం మాస్టర్ ప్లాన్, అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఫ్యాకల్టీ & స్టాఫ్ హౌసింగ్, స్టూడెంట్ హాస్టల్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సంబంధిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం సమగ్ర ఆర్కిటెక్చరల్ డిజైన్ ప్యాకేజీ కోసం ఆర్కిటెక్ట్ నియామకానికి సంస్థ టెండర్‌ను ఆహ్వానించింది.[5]

విద్య

[మార్చు]

విద్యా కార్యక్రమాలు

[మార్చు]

ఐఐఐటీ రాయచూర్ 30 మంది విద్యార్థులతో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బిటెక్ కోర్సును అందిస్తోంది.[6] మొదటి సంవత్సరం నుండి అధునాతన కోర్సులకు ప్రాధాన్యతలో కూడిన పాఠ్యాంశాలను కలిగి ఉంది. కంప్యూటర్ సైన్స్ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సమానంగా విద్యార్థులకు అధునాతన విద్యను అందిస్తోంది.

ప్రవేశం

[మార్చు]

ఉమ్మడి ప్రవేశ పరీక్ష మెయిన్స్ ద్వారా ఇక్కడి బిటెక్ కోర్సులోని 30 సీట్లకు అడ్మిషన్లు జరుగుతాయి.

విద్యార్థి జీవితం

[మార్చు]

ఐఐఐటీ రాయచూర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలకోసం క్లబ్‌లు ఉన్నాయి. విద్యాపరమైన అభివృద్ధితోపాటు విద్యార్థులలో సాంస్కృతిక అభివృద్ధిని పెంచే లక్ష్యంతో వీటిని ఏర్పాటుచేశారు.

మూలాలు

[మార్చు]
  1. "Parliament passes IIIT amendment bill, giving national importance tag to five new institutes". The Times of India. 2020-09-22. ISSN 0971-8257. Archived from the original on 2022-09-01. Retrieved 2023-02-04.
  2. "IIIT Laws (Amendment) Bill 2020 passed in Rajya Sabha; know about the bill". The Indian Express (in ఇంగ్లీష్). 2020-09-22. Retrieved 2023-02-02.
  3. "Indian institute of information technology, (IIIT), Raichur - Courses, Fees, Placements & Apply".
  4. https://collegedunia.com/college/60079-indian-institute-of-information-technology-iiit-raichur
  5. "Indian Institute of Information Technology [IIIT], Raichur: Courses, Fees, Placements".
  6. "IIIT Raichur: Courses, Fees, Placements, Ranking 2022".