ఇందు రాజ్ నర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇందురాజ్ నర్వాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2020
ముందు శ్రీ కృష్ణ హుడా
నియోజకవర్గం బరోడా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
నివాసం హర్యానా
వృత్తి రాజకీయ నాయకుడు

ఇందు రాజ్ నర్వాల్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో బరోడా నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఇందు రాజ్ నర్వాల్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 హర్యానా శాసనసభ ఎన్నికల్లో బరోడా నుండి గెలిచిన శ్రీ కృష్ణ హుడా అనారోగ్యంతో మరణించడంతో ఆ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యోగేశ్వర్ దత్‌పై 10566 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

ఇందురాజ్ నర్వాల్ 2024 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కపూర్ సింగ్ నర్వాల్‌పై 5642 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. The Hindu (10 November 2020). "Baroda bypoll: BJP's Yogeshwar Dutt defeated by Congress nominee" (in Indian English). Archived from the original on 1 July 2024. Retrieved 1 July 2024.
  3. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Baroda". Retrieved 31 October 2024.