ఇంద్రాయి దేవత ఆలయం - ఇంద్రవెల్లి
ఇంద్రాయి దేవత ఆలయం ఇంద్రవెల్లి | |
---|---|
భౌగోళికాంశాలు : | 19°13′N 78°28′E / 19.21°N 78.46°E |
పేరు | |
ఇతర పేర్లు: | ఇంద్రాయి దేవత ఆలయం |
ప్రధాన పేరు : | ఇంద్రాయి దేవత ఆలయం ఇంద్రవెల్లి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ |
దేవనాగరి : | इंद्रायी देवता देवस्थान इद्रवेली आदिलाबाद तेलंगाना । |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | ఆదిలాబాద్ జిల్లా |
ప్రదేశం: | ఇంద్రవెల్లి, |
ఆలయ వివరాలు | |
ప్రధాన దేవత: | ఇంద్రాయి |
ముఖ్య_ఉత్సవాలు: | ఇంద్రాయి,నాగోబా జాతర సందర్భంగా |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | దక్షిణ భారత దేశ ఆదివాసీ దేవాలయం |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 01 |
ఇంద్రాయి దేవత - ఇంద్రవెల్లి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా ,ఇంద్రవెల్లి మండల కేంద్రములో ఉంది.ఇంద్రాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఇంద్రాయి దేవత పేరు మీదుగా ఇంద్రవెల్లి గా పేరు వచ్చిందని అంటారు[1][2].
స్థల పురాణం
[మార్చు]ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రములో ఉన్న ఇంద్రాయి దేవత ఆలయం చాలా పురాతన మైన దేవాలయం.పూర్వం మెస్రం వంశస్థులు నాగోబా జాతర సందర్భంగా గంగా జలం కోసం గోదావరి కి వెళ్ళి పాదయాత్రగా వస్తున్న క్రమంలో మెస్రం వంశస్థులకు తెలియకుండానే భోజనాలు ఏర్పాటు చేసి పెట్టిందట ఇంద్రాయి. ఐతే ప్రతి సారి తమకు కనబడకుండా భోజనాలు ఎవరు చేసి పెడుతున్నారని సందేహం వచ్చి మాటువేసి కుర్చున్నారట మెస్రం వంశసానికి చెందిన పడియోర్ . అన్నం పెడుతున్న ఇంద్రాయిని పట్టుకొని ఆమె ముక్కు కోస్తాడట. ఐతే అంతలోనే ఆశ్చర్యానికి లోనయ్యాన భక్తులు ముక్కకోయబడి ఉన్న ఇంద్రాయి దేవత విగ్రహం బోర్లబోక్కల పడి ఉండటం ను చూసి ఆమె ఒక దేవతగా భావించి ఆమెకు పూజలు చేయడం మొదలు పెట్తారట. అప్పటి నుంచి ఈ ఇంద్రాయి దేవతకు వెనుక భాగంలో బోనాలు నైవేద్యం తయారు చేసి అమ్మవారిని ఆరాధిస్తుంటారు మెస్రం వంశస్థులు అని దిని వెనుక దాగి ఉన్న కథ[3].
విశేషం
[మార్చు]ఆదివాసీలు తమ ఆరాధ్య దైవంగా భావించే ఇంద్రాయి దేవతకు నాగోబా జాతరకు విడదీయరాని సంబంధం ఉంది. ఈ ఇంద్రవెల్లి గ్రామంలో కొలువై ఉన్న ఇంద్రాయి దేవతను మెస్రం వంశస్థులు గంగా జలాలతో పాదయాత్ర చేస్తు ఈ ఇంద్రాయి దేవతను దర్శించుకొని పూజలు చేయడం ఆనవాయితీ. ఇచ్చట అందరూ సహపంక్తి భోజనాలు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
ప్రత్యేక పూజలు
[మార్చు]ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నుంచి బయలు దేరిన మెస్రం వంశీయులు ఇంద్రాయి దేవత ఆలయానికి చేరుకుని తమతో తెచ్చిన పవిత్ర గంగా జలాన్ని ఇంద్రాయి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తమ సాంప్రదాయ బద్ధంగా కలశాన్ని ఏర్పాటు చేసి [4] మహారాజ్ కొరెంగా యశ్వంత్ రావు, ఆలయ పూజారి చహకటి సూర్యారావు ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేక పూజలు చేసి పిండి వంటలు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.ఈ సందర్భంగా మెస్రం తెగకు చెందిన పురుషులు, మహిళలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి అచటి నుండి కాలినడకన బయలుదేరుతారు[5].
దేవత కథ
[మార్చు]ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పిట్ట బొంగరం గ్రామానికి చెందిన మెస్రం సక్కుబాయి ఇంద్రవెల్లి ఇంద్రాయి దేవత కథలు చాలాౠ చక్కగా పాడటంతో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారు ఈమెను వీరి బృందాన్ని ఎంపిక చేసి పాటలు పాడడానికి అవకాశం లభించింది. ఈమె ఇప్పటి వరకు ఆకాశవాణి లో ఇంద్రాయి దేవత కథ ఆరవ భాగం 11డిసెంబర్ 2024 నా పాడి వినిపించడం జరిగింది.
మూలాలు
[మార్చు]- ↑ Desam, A. B. P. (2023-01-18). "ఇంద్రవెల్లి ఇంద్రాదేవికి మెస్రం వంశీయుల ప్రత్యేక పూజలు". telugu.abplive.com. Retrieved 2024-12-12.
- ↑ "ఇంద్రాయి ఆలయం చేరుకున్న మెస్రం వంశీయులు". EENADU. Retrieved 2024-12-12.
- ↑ "ఇంద్రాయి దేవతను వారే ఎందుకు పూజిస్తారో తెలుసా." News18 తెలుగు. 2024-02-06. Retrieved 2024-12-12.
- ↑ "సంప్రదాయబద్ధంగా ఇంద్రాయి దేవత కలశం ఏర్పాటు". EENADU. Retrieved 2024-12-12.
- ↑ ABN (2023-01-03). "పిట్లబొంగరంలో కలశానికి పూజలు". Andhrajyothy Telugu News. Retrieved 2024-12-12.