ఇగువాజు జలపాతం
Jump to navigation
Jump to search
ఇగువాజు జలపాతం | |
---|---|
ప్రదేశం | అర్జెంటీనా: మిసియోనెస్ ప్రాదేశిక ప్రాంతం బ్రెజిల్: పరనా రాష్ట్రం |
అక్షాంశరేఖాంశాలు | 25°41′12″S 54°26′41″W / 25.68667°S 54.44472°W |
రకం | పెద్ద జలపాతం |
మొత్తం ఎత్తు | 60–82 మీటర్లు (197–269 అ.)[1] |
బిందువుల సంఖ్య | 275[1] |
పొడవైన బిందువు | 82 మీటర్లు (269 అ.)[1] |
మొత్తం వెడల్పు | 2.7 కిలోమీటర్లు (1.7 మై.)[1] |
నీటి ప్రవాహం | ఇగువాజు నది |
సగటు ప్రవాహరేటు | 1,756 m3/s (62,010 cu ft/s)[1] |
ఇగువాజు జలపాతం (Iguazu Falls) అనేది అర్జెంటీనాలో 80%, బ్రెజిల్లో 20% ఉన్న భారీ జలపాతాల వరుస. ఇగువాజు నది పరానా పీఠభూమి నుండి దూకేటపుడు ఇగువాజు జలపాతం ఏర్పడింది. ఇక్కడి నుండి 23 కి.మీ. దూరంలో ఇది పరనా నదిలో కలుస్తుంది. ఇది దాదాపు 275 పాయలు కలిగిన జలపాతాల వరుస. ఇవి 82 మీటర్లు, 64 మీటర్ల మధ్య ఎత్తుతో ఉంటాయి. ఈ జలపాతం ఇగువాజు నదిని ఎగువ, దిగువ భాగాలుగా విభజించింది.
పాయలన్నీ కలిపితే, ఈ ఇగువాజు ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం అవుతుంది. [2] ఇది అత్యంత ప్రసిద్ధ జలపాతాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాదిగా సందర్శకులను ఆకర్షిస్తుంది.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;Britannica
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ Dominic Couzens (2008), Top 100 Birding Sites of the World, University of California Press, p. 228, ISBN 978-0-52-025932-4