ఇన్శాట్-1B ఉపగ్రహం
మిషన్ రకం | Communications |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
COSPAR ID | 1983-089B |
SATCAT no. | 14318 |
మిషన్ వ్యవధి | 7 years |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
అంతరిక్ష నౌక రకం | INSAT-1 |
తయారీదారుడు | Ford Aerospace |
లాంచ్ ద్రవ్యరాశి | 1,152 కిలోగ్రాములు (2,540 పౌ.) |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 30 August 1983, 06:32:00 UTC[1] |
రాకెట్ | Space Shuttle Challenger STS-8 / PAM-D |
లాంచ్ సైట్ | Kennedy LC-39A |
కాంట్రాక్టర్ | NASA |
మోహరించిన తేదీ | 31 August 1983, 07:48 | UTC
మిషన్ ముగింపు | |
పారవేయడం | Decommissioned |
డియాక్టివేట్ చేయబడింది | August 1993 |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Geocentric |
రెజిమ్ | Geostationary |
రేఖాంశం | 74° east (1983-92) 93° east (1992-93) |
సెమీ మేజర్ ఆక్సిస్ | 42,164.88 కిలోమీటర్లు (26,200.04 మై.) |
విపరీతత్వం | 0.0012393 |
Perigee altitude | 35,741 కిలోమీటర్లు (22,208 మై.) |
Apogee altitude | 35,846 కిలోమీటర్లు (22,274 మై.) |
వాలు | 14.69 degrees |
వ్యవధి | 23.93 hours |
ఎపోచ్ | 14 November 2013, 15:52:38 UTC[2] |
ఇన్శాట్-1B (INSAT-1B) భారతదేశపు సమాచార ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని ఇండియన్ నేషనల్ శాటలైట్ సిస్టం ద్వారా జరుపుతున్న జరుపుతున్న ఉపగ్రహల ప్రయోగంలో భాగంగా అంతరిక్షములో ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహాన్ని 30ఆగస్టు 1983న 06:32:00 ( UTCసమయం) కు భూస్థిరకక్ష్యలో,74 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టారు.[3] ఈ ఉపగ్రహం ముందుగా నిర్ణయించిన విధంగా 7 సంవత్సరాలు సేవలు అందించిన తరువాత, దీని స్థానంలో INSAT-D ఉపగ్రహాన్ని ప్రయోగించి, దీనిని పక్కనిరర్ధక కక్ష్యలో పెట్టారు.ఈ ఉపగ్రహాన్ని తిరిగి 1992లో 92 డిగ్రీల అక్షాంశంలో గుర్తించారు.దీనిని ఆగస్టు 1993లో నిరర్ధకం చేసారు.[3]
ఉపగ్రహ వివరాలు
[మార్చు]ఈ ఉపగ్రహాన్నిఫోర్డ్ ఏరోస్పేస్‌వారు నిర్మించారు. ఈ ఉపగ్రహనిర్వహణ బాధ్యత ఇస్రోవారిది.INSAT-1శ్రేణి వరుస ఉపగ్రహాలనిర్మాణంలో భాగంగా INSAT-1B ఉపగ్రహం నిర్మింపబడి, ప్రయోగింప బడింది.ప్రయోగ సమయంలో ఉపగ్రహం బరువు 152 కిలోగ్రాములు (2,540 పౌండ్లు) ఉపగ్రహ జీవితకాలం 7 సంవత్సరాలు.INSAT-1B ఉపగ్రహంలో పండ్రెండు C-band ట్రాన్స్‌పాండరులను, మూడు S-band ట్రాన్స్‌పాండరులను అమర్చారు.విద్యుతు ఉత్పత్తికై ఒక సౌరఫలకను అమర్చారు. ఉపగ్రహం యొక్క అసౌష్టవనిర్మాణం వలన ఏర్పడు రేడియేసన్ టార్క్యును కౌంటరు బాలెన్సు చెయ్యుటకు ఇక స్థిరీకరణ బూమ్‌ను ఏర్పాటు చేసారు.[4] ఉపగ్రహ చోదకానికై ఒక R-4D-11 అపోజీ మోటరును అమర్చారు. ఈ ఉపగ్రహన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన తరువాత, భూస్థిరకక్ష్యలో, నిర్దిష్ట కక్ష్యలోకి వెళ్ళుటకు స్వంతచోదక వ్యవస్థను (own propulsion system) కలిగిఉన్నది.
ఉపగ్రహ ప్రయోగం
[మార్చు]ఈ ఉపగ్రహాన్ని స్పేస్‌షటిల్ చాలెంజరు (STS మిసను ప్రయోగసందర్భంగా) ద్వారా అంతరిక్షముకి పంపారు.సెటిల్ చాలెంజరు 30 ఆగస్టు 1983, 07:48 (UTC) గంటలకు కెన్నడి అంతరిక్షకేంద్రంలోని లాంచ్ కాంప్లెక్స్39A నుండి అంతరిక్షములోకి పంపబడినది[5].31ఆగస్టు,1983, 07:48 (UTC) గంటలకు కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించింది. ఈ ఉపగ్రహం భూస్థిరకక్ష్యలో, నిర్దిష్ట కక్ష్యలోకి వెళ్ళుటకు స్వంతచోదక వ్యవస్థను (own propulsion system) కలిగిఉన్నది.ఉపగ్రహం యొక్క అంతర్జాతీయడేసిగ్నటరు సంఖ్య1983-089B, జాబితా సంఖ్య14318.[6]
ప్రయోగానంతర పరిణామాలు
[మార్చు]ప్రయోగానంతరం సౌరపలకాలను విచ్చుకొనేలా చెయ్యడంలో సమస్య ఎదురైనప్పటికి1983, సెప్టెంబరునెల మద్యకాలంలో సౌరపలకను తెరచుకొనేలా చెయ్యగలిగారు.[5] 1992లో 93°రేఖాంశం లోకి ఉపగ్రహాన్ని పంపేవరకు, ఈ ఉపగ్రహం అత్యధిక జీవితకాలం 74° డిగ్రీల రేఖాంశంమీద ప్రదక్షిణచేసింది.ఆగస్టు 1993లో ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించడం నిలిపివేసి, భూసమస్థితి కక్ష్యకు పైనున్న నిరర్ధకకక్ష్య (graveyard orbit) లో ఈ ఉపగ్రహాన్ని ఉంచారు. అంతరిక్షములో14 నవంబరు 2013నాటికి, ఈ ఉపగ్రహం నిరర్ధకకక్ష్యలో 35,741 కిలోమీటర్ల పెరిజీ,35,846కిలోమీటర్లఅపోజీతో 14.69డిగ్రీల ఏటవాలుతో23.93 గంటల ప్రదక్షిణకాలంతో తిరుగుచుఉండినది.
మూలాలు
[మార్చు]- ↑ McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 16 November 2013.
- ↑ "INSAT 1B Satellite details 1983-089B NORAD 14318". N2YO. 14 November 2013. Retrieved 16 November 2013.
- ↑ 3.0 3.1 Krebs, Gunter. "Insat 1A, 1B, 1C, 1D". Gunter's Space Page. Retrieved 16 November 2013.
- ↑ Harland, David M; Lorenz, Ralph D. (2005). Space Systems Failures (2006 ed.). Chichester: Springer-Praxis. pp. 302–3. ISBN 0-387-21519-0.
- ↑ 5.0 5.1 "INSAT-1B". isro.gov.in. Archived from the original on 2022-09-28. Retrieved 2015-09-07.
- ↑ McDowell, Jonathan. "Satellite Catalog". Jonathan's Space Page. Retrieved 16 November 2013.