ఇయాన్ స్మిత్ (దక్షిణాఫ్రికా క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇయాన్ స్మిత్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వివియన్ ఇయాన్ స్మిత్
పుట్టిన తేదీ(1925-02-23)1925 ఫిబ్రవరి 23
మరణించిన తేదీ2015 ఆగస్టు 25(2015-08-25) (వయసు 90)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1947 7 June - England తో
చివరి టెస్టు1957 23 December - Australia తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test First-class
మ్యాచ్‌లు 9 97
చేసిన పరుగులు 39 547
బ్యాటింగు సగటు 3.89 10.32
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 11* 37
వేసిన బంతులు 1,655 22,088
వికెట్లు 12 365
బౌలింగు సగటు 64.08 22.55
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 26
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 8
అత్యుత్తమ బౌలింగు 4/143 9/88
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 37/–
మూలం: CricketArchive, 2022 13 November

వివియన్ ఇయాన్ స్మిత్ (1925, ఫిబ్రవరి 23 - 2015 ఆగస్టు 25) దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్.[1] దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తరపున 1947 నుండి 1957 వరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

జననం[మార్చు]

వివియన్ ఇయాన్ స్మిత్ 1925, ఫిబ్రవరి 23న నాటల్‌లోని డర్బన్‌లో జన్మించాడు. హిల్టన్ కళాశాలలో చదువుకున్నాడు.

క్రికెట్ రంగం[మార్చు]

స్మిత్ కుడిచేతి లెగ్-బ్రేక్ బౌలర్ గా, లోయర్-ఆర్డర్ కుడిచేతి బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1947లో ఇంగ్లాండ్‌లో తన అరంగేట్రం చేశాడు, సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడాడు.[2] 1949-50లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు, 1955లో ఇంగ్లాండ్‌లో ఒక టెస్టు, 1957-58లో దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు.[3] అరంగేట్రంలో, 1947లో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో 46 పరుగులకు 3 వికెట్లు, 143 పరుగులకు 4 వికెట్లు తీసుకున్నాడు.[4] తర్వాతి ఎనిమిది టెస్టులు ఐదు వికెట్లు మాత్రమే సాధించాడు. 1945-46 నుండి 1957-58 వరకు నాటల్ తరపున ఆడాడు. 1946–47లో బోర్డర్‌పై 88 పరుగులకు 9 వికెట్లు (మ్యాచ్‌లో 194 పరుగులకు 12)తో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించాడు.[5]

మరణం[మార్చు]

స్మిత్ 2015 ఆగస్టు 25న మరణించాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Ian Smith Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-22.
  2. "ENG vs SA, South Africa tour of England 1947, 1st Test at Nottingham, June 07 - 11, 1947 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-22.
  3. "SA vs AUS, Australia tour of South Africa 1957/58, 1st Test at Johannesburg, December 23 - 28, 1957 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-22.
  4. England v South Africa, Nottingham 1947
  5. Natal v Border 1946–47
  6. "Former SA legspinner Ian Smith dies at 90". ESPN. 26 August 2015. Retrieved 26 August 2015.

బాహ్య లింకులు[మార్చు]