ఇరోమ్ చాను షర్మిల
ఇరోమ్ చాను షర్మిల | |
---|---|
జననం | |
వృత్తి | కవి, పౌర హక్కుల , రాజకీయ కార్యకర్త |
జీవిత భాగస్వామి | డెస్మండ్ ఆంథోనీ బెల్లార్నిన్ కౌటిన్హో |
తల్లిదండ్రులు | ఇరోమ్ సి నందా (తండ్రి) ఇరోమ్ ఒంగ్బీ సఖి (తల్లి) |
ఇరోమ్ చాను షర్మిల (జననం: మార్చి 14, 1972), ఈమె కవి, పౌర హక్కుల, రాజకీయ కార్యకర్త.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఈమె 1972, మార్చి 2 న ఇరోమ్ ఒంగ్బీ సఖి, ఇరోమ్ సి నందా దంపతులకు మణిపూర్ రాష్ట్రంలోని, ఇంఫాల్ నగరంలోని కోంగ్‌పాల్ గ్రామంలో జన్మించింది.
వ్యక్తిగత ఙివితం
[మార్చు]ఈమె ఆగష్టు 17, 2017 న బ్రిటిష్ భాగస్వామి డెస్మండ్ ఆంథోనీ బెల్లార్నిన్ కౌటిన్హోను కొడైకెనాల్, తమిళనాడు లోని ఒక హిల్ స్టేషన్ లో వివాహం చేసుకున్నారు. ఈమె మే 12, 2019 న ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చింది.[2]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈమె నవంబర్ 5, 2000 న సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం, 1958, ఈ చట్టం ఏడు రాష్ట్రాలకు వర్తిస్తుంది. వారెంట్ లేకుండా ఆస్తులను శోధించడానికి, ఒక వ్యక్తి రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని సహేతుకమైన అనుమానం వస్తే వారిని అరెస్టు చేయడానికి భద్రతా దళాలకు పూర్తి అధికారాలను ఇస్తుంది. ఈ చట్టాన్ని నిర్మూలించడం కోసం నిరాహార దీక్షను ప్రారంభించింది. ఈ దీక్ష 16 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈమె ఈ దీక్షను 500 వారాలకు పైగా ఆహారం, నీటిని తిరస్కరించి ప్రపంచంలోనే అతి పొడవైన నిరాహారదీక్ష చేసిన మహిళగా పేరుకెక్కింది. ఈమె ఈ దీక్షను ఆగస్టు 9, 2016 న ముగించింది.[3]
2016లో పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్ పార్టీని స్థాపించింది.
మూలాలు
[మార్చు]- ↑ Mehrotra, Deepti Priya (2012). "The Making of an Activist". Burning Bright: Irom Sharmila and the Struggle for Peace in Manipur. Penguin Books India. ISBN 9788184751536.
- ↑ Staff Reporter (18 August 2017). "Irom Sharmila marries in Kodaikanal, sans family and fanfare". The Hindu. Archived from the original on 12 నవంబరు 2020. Retrieved 7 November 2019.
- ↑ Andhrajyothy (4 March 2017). "20 యేళ్ల తర్వాత మళ్లీ ఓటేసిన ఉక్కుమహిళ!". Archived from the original on 2 February 2022. Retrieved 2 February 2022.