ఉక్కు సత్యాగ్రహం
ఉక్కు సత్యాగ్రహం | |
---|---|
పాటలు | గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ |
దర్శకత్వం | పి.సత్యారెడ్డి |
రచన | పి.సత్యారెడ్డి |
నిర్మాత | పి.సత్యారెడ్డి |
తారాగణం | గద్దర్ పి.సత్యారెడ్డి పల్సర్‌బైక్ ఝాన్సీ కరణం ధర్మశ్రీ |
కూర్పు | మేనగ శ్రీను |
సంగీతం | శ్రీకోటి |
నిర్మాణ సంస్థ | జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 29 నవంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఉక్కు సత్యాగ్రహం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం ఆధారంగా తీసిన తెలుగు సినిమా. జనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పి.సత్యారెడ్డి దర్శకత్వం వహించి నిర్మించాడు. గద్దర్, పి.సత్యారెడ్డి, పల్సర్‌బైక్ ఝాన్సీ, కరణం ధర్మశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను 2024, నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఇది గద్దర్ నటించిన చివరి సినిమా.[1][2][3]
కథ
[మార్చు]ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతుంటాయి, ప్రైవేటీకరణ ఆపేందుకు నాయకులు, ఉద్యమకారులు ఉద్యమాలు చేస్తుంటారు. ఈ క్రమంలో సత్యారెడ్డి ఉద్యమం కోసం వచ్చి ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తారు. ఈ ఉద్యమాన్ని ఆపడానికి పోలీసాఫీసర్ (పల్సర్‌బైక్ ఝాన్సీ) వస్తుంది. కానీ ఉద్యమం గురించి సత్యారెడ్డి ద్వారా తెలుసుకున్న ఆమె వీళ్లకు సపోర్ట్ చేయడంతో కొంతమంది నాయకులు ఆమెను కిడ్నాప్ చేసి, ఆ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తుంటారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు అడ్డగిస్తున్నారు? ప్రైవేటీకరణ చేయడం కోసం ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి? ఈ సినిమాలో గద్దర్ పాత్ర ఏమిటి అనేదే మిగతా సినిమా కథ.[4][5]
నటీనటులు
[మార్చు]- గద్దర్[6]
- పి.సత్యారెడ్డి
- పల్సర్‌బైక్ ఝాన్సీ
- కరణం ధర్మశ్రీ
- ఎం.వి.వి.సత్యనారాయణ
- ప్రసన్నకుమార్
- వెన్నెల
మూలాలు
[మార్చు]- ↑ NT News (27 November 2024). "ఉక్కు ఉద్యమ చిత్రం". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ News18 తెలుగు (26 November 2024). "'ఉక్కు సత్యాగ్రహం' రిలీజ్ డేట్ లాక్.. విడుదల ఎప్పుడంటే..?". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (27 November 2024). "గద్దర్ నటించిన చివరి చిత్రం ఈనెల 29న రిలీజ్ ఫిక్స్". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Zee News Telugu (29 November 2024). "గద్దర్ చివరి చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం' చిత్రం ఎలా ఉంది.. ప్రేక్షకులను మెప్పించిందా..!". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ Sakshi (29 November 2024). "'ఉక్కు సత్యాగ్రహం' మూవీ రివ్యూ". Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.
- ↑ The Hindu (29 November 2023). "Gaddar's last movie, 'Ukku Satyagraham', to hit screen in five languages in mid-December" (in Indian English). Archived from the original on 2 December 2024. Retrieved 2 December 2024.