ఉట్టి
ఉట్టి (బహువచనం: ఉట్లు) అంటే త్రాళ్ళతో అల్లిన ఒక సాధనం. ఇది పైకప్పునుండి వ్రేలాడుతుంది. పల్లెలలో ఇదివరకు పాలు, పెరుగు వంటి వాటిని పిల్లుల నుండి రక్షణగా పైకప్పునుండి ఉట్టిలో వ్రేలాడ దీసేవారు. వీనిని ఇప్పుడు చిన్నికృష్ణుని కేలెండర్లలో ఎక్కువగా చూస్తున్నాము.
నిఘంటు అర్థాలు
[మార్చు]- పిడతలు లోనగునవి యుంచుటకై దారములతోనల్లి వ్రేలఁగట్టెడి యంత్ర విశేషము, శిక్యము.[1]
- చిక్కము, కావడి మట్టు, చింతపండు గుంజును అంటియుండెడు పీఁచు.[2]
- కుండలు మొదలైనవి వేలాడగట్టటానికి అల్లిన చిక్కం.[3]
- పాత్రలుంచుకొనుటకై ఇంట వ్రేలగట్టబడిన చిక్కము.[4]
ఉట్ల పండుగ
[మార్చు]శ్రీకృష్ణుని జన్మదినమైన అష్టమి రోజున జరుపుకునే కృష్ణాష్టమి పండుగను ఉట్ల పండుగ అని కూడా అంటారు. ఈ పండుగ రోజున వీధుల్లో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతుంటారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ అంటారు. చిన్న తనంలో కృష్ణుడు చిలిపి పనులు చేస్తుండేవాడు. స్నేహితులతో కలసి అల్లరి పనులు చేసేవాడు. వెన్న దొంగిలించి తింటుండేవాడు. వెన్నదొంగ కృష్ణుడి బాధ పడలేక విసుగు చెందిన గోపికలు.. అతనికి అందకుండా ఇళ్లలో ఎత్తులో వెన్నకుండలను ఉట్టిపై పెట్టేవారు. ఐనా బాలకృష్ణుడు ఉట్టి కుండలను అందుకుని వెన్న దొంగిలించి తినేవాడు. అలా ఆ వెన్నదొంగను గుర్తు చేసుకోవడానికే కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడతారు.[5]
సామెతలు
[మార్చు]- అందరూ మంచివారే ఉట్టి మీద ఉన్న పాల కుండలో పాలు ఏమయ్యాయి?
మూలాలు
[మార్చు]- ↑ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- ↑ ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
- ↑ తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978
- ↑ తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
- ↑ "tradition of dahi handi breaking | V6 Velugu" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-07-07.[permanent dead link]