Jump to content

ఉదయ్‌పూర్ అంబామాత దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 24°35′07″N 73°40′41″E / 24.58528°N 73.67806°E / 24.58528; 73.67806
వికీపీడియా నుండి
ఉదయ్‌పూర్ అంబామాత
ఉదయ్‌పూర్ అంబామాత దేవాలయం is located in Rajasthan
ఉదయ్‌పూర్ అంబామాత దేవాలయం
Location in Udaipur
భౌగోళికం
భౌగోళికాంశాలు24°35′07″N 73°40′41″E / 24.58528°N 73.67806°E / 24.58528; 73.67806
దేశంభారతదేశం
రాష్ట్రంరాజస్థాన్
జిల్లాఉదయ్‌పూర్ జిల్లా
స్థలంఉదయపూర్
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీవిక్రమాదిత్య శకం 1721

అంబామాత దేవాలయం, రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరం మధ్యలో ఉన్న హిందూ దేవాలయం.[1] గుజరాత్‌రాష్ట్రంలోని అంబామాత దేవత ఆజ్ఞ మేరకు ఉదయ్‌పూర్ మహారాణా రాజ్ సింగ్ ఈ దేవాలయాన్ని నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం.[2]

నిర్మాణం

[మార్చు]

పొడవైన కాంపౌండ్ వాల్ లోపల 20 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్ మీద అంబామాత దేవాలయం నిర్మించబడింది. దేవాలయానికి ముందర ఎనిమిది మెట్లు ఉన్నాయి. కాంపౌండ్ వాల్ ప్రధాన ద్వారం పైన "నక్కర్ ఖానా" ఇరువైపులా బంగారు సింహం విగ్రహాలు ఉన్నాయి. నక్కర్ ఖానాకు పశ్చిమాన తూర్పు ముఖంగా ప్రధాన దేవాలయం ఉంది. ఈ దేవాలయం తెల్లని రాతితో నిర్మించబడింది.

చరిత్ర

[మార్చు]

1652-1680 మధ్యకాలంలో ఉదయ్‌పూర్ ను పాలించిన మహారాణా రాజ్ సింగ్ కు వచ్చిన తీవ్రమైన కంటి సమస్యను, ఆస్థాన వైద్యలు కూడా నయంచేయలేకపోవడంతో గుజరాత్‌లోని అర్బుదంచ కొండల్లోని అంబికా మాత దేవాలయాన్ని సందర్శించాలనుకున్నాడు. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, రాజ్ సింగ్ కలలో దేవతను కనిపించి తానే స్వయంగా మేవార్‌కు వస్తున్నానని తెలిపింది. కలలో తెలిపిన వివరాలు ఆధారంగా అంబామాత దేవత విగ్రహాంకోసం త్రవ్వకాలు జరుపగా, భూమిలో నుండి అంబామాత విగ్రహం బయటకువచ్చింది. ఆ వెంటనే మహారాణా కూడా అతని అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్నాడు. ఆ ప్రదేశంలోనే మహారాణా దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించగా, విక్రమాదిత్య శకం 1721లో పూర్తయింది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Famous Temples In and Around Udaipur". udaipurblog.com. UdaipurBlog. 28 June 2013. Archived from the original on 2015-09-17. Retrieved 2022-09-25.
  2. "Famous Temples In and Around Udaipur". udaipurblog.com. UdaipurBlog. 28 June 2013. Archived from the original on 2015-09-17. Retrieved 2022-09-25.
  3. "History of Ambamata Temple". udaipurtimes.com/. UdaipurTimes.com. Archived from the original on 2016-03-31. Retrieved 2022-09-25.