ఉన్నత సాంకేతిక వాహనం (రాకెట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉన్నత సాంకేతిక వాహనం
ISRO Advanced Technology Vehicle shape-01 (rotated).jpg
విధి స్క్రామ్‌జెట్ ఇంజను పరీక్షా వేదిక
తయారీదారు ఇస్రో
దేశము భారతదేశం
పరిమాణము
ఎత్తు 9.10 మీ. (29.9 అ.)
వ్యాసము 0.56 మీ. (1.8 అ.)
ద్రవ్యరాశి 3,000 కి.గ్రా. (6,600 పౌ.)[1]
దశలు 2
సంబంధిత రాకెట్లు
కుటుంబం రోహిణి-560
ప్రయోగ చరిత్ర
స్థితి Active
ప్రయోగ స్థలాలు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
మొత్తం ప్రయోగాలు 2
విజయాలు 2
తొలి ప్రయోగం 2010 మార్చి 3[1]
చివరి ప్రయోగం 28 August 2016[2]

ఉన్నత సాంకేతిక వాహనం (ఏటీవీ -Advanced Technology Vehicle) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అభివృద్ధి చేస్తున్న కొత్త తరం సౌండింగు రాకెట్టు. ఇది రెండు దశల, ఘన ఇంధన చోదిత వాహనం. ఇది పూర్తిగా రోహిణి రాకెట్ కుటుంబంలోని ఆర్‌హెచ్-560 పై ఆధారపడి తయారుచేసినది. ఇస్రో అభివృద్ధి చేస్తున్న స్క్రామ్‌జెట్ ఇంజన్ను పరీక్షించేందుకు ఈ రాకెట్టును వాడుతారు. ఇప్పటి వరకు ఈ రాకెట్టును రెండు సార్లు ప్రయోగించారు.

పరీక్షా ప్రయోగాలు[మార్చు]

మొదటి ప్రయోగం[మార్చు]

ఉన్నత సాంకేతిక వాహనం మొదటి పరీక్షా ప్రయోగం 2010 మార్చి 3 న చేసారు. దాన్ని ATV-D01 అని పిలిచారు. ఒక డమ్మీ స్క్రామ్‌జెట్ ఇంజనును రెండవ దశకు తగిలించుకుని ఈ వాహనం ప్రయాణించింది. ఇస్రో అప్పటివరకు ప్రయోగించిన సౌండింగు రాకెట్లలో అదే అత్యంత బరువైనది. ప్రయోగ వేదిక నుండి గాల్లోకి లేచే సమయంలో దాని బరువు 3 టన్నులు. తన ప్రయాణం ద్వారా స్క్రామ్‌జెట్ ఇంజను మండడానికి అవసరమైన వేగాన్ని, గతిశీల పీడనాన్నీ కలగజేయడమే ఈ ప్రయోగ లక్ష్యం. ఈ ప్రయోగం విజయవంతమైంది. మ్యాక్ 6+0.5 వేగాన్ని, 80 + 35 KPa పీడనాన్నీ సాధించి, ఆ పరిస్థితిని 7 సెకండ్ల పాటు కొనసాగించింది. ఈ పరిస్థితులు స్క్రామ్‌జెట్ ఇంజన్ను పరీక్షించేందుకు అనువైనవి కాబట్టి ప్రయోగం విజయవంతమైందని ఇస్రో తెలిపింది[3].

రెండవ ప్రయోగం[మార్చు]

రెండవ ప్రయోగం 2016 ఆగస్టు 28 న చేసారు. దీన్ని ATV-02 అని అన్నారు. ఈసారి రెండు పనిచేసే స్క్రామ్‌జెట్‌ ఇంజన్లను వాహనం రెండవ దశకు తగిలించి ప్రయోగించారు. 3277 కిలోల బరువున్న ఈ రాకెట్టు ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం 6 గంటలకు జరిగింది. రాకెట్టు తగు వేగాన్ని, పీడనాన్నీ సాధించాక, స్క్రామ్‌జెట్ ఇంజన్లను మండించారు. అవి 5 సెకండ్ల పాటు పనిచేసాయి. ప్రయోగించిన సుమారు 300 సెకండ్ల తరువాత వాహనం బంగాళాఖాతంలో శ్రీహరికోటకు 320 కి.మీ. దూరంలో దిగింది.

ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగంతో సూపర్‌సోనిక్ వేగాల వద్ద ఇంజను ప్రజ్వలనం, సూపర్‌సోనిక్ వేగాల వద్ద మంట జ్వలిస్తూనే ఉండడం, గాలిని పీల్చుకునే మెకానిజం, ఇంధన ఇంజెక్షను వ్యవస్థల పనితీరు విజయవంతంగా ప్రదర్శించబడింది[4].

స్క్రామ్‌జెట్ ఇంజన్ను విజయవంతంగా ఫ్లైట్ టెస్ట్ చేసిన నాలుగు దేశాల్లో భారత్ ఒకటి.

మూలాలు వనరులు[మార్చు]

  1. 1.0 1.1 Mukunth, Vasudevan (13 July 2016). "ISRO Plans Scramjet Engine Test Atop Its Heaviest Sounding Rocket in July". The Wire. Retrieved 13 July 2016. CS1 maint: discouraged parameter (link)
  2. "Successful Flight Testing of ISRO's Scramjet Engine Technology Demonstrator". Indian Space Research Organisation. 28 August 2016. Retrieved 10 September 2016. CS1 maint: discouraged parameter (link)
  3. విజయవంతమైన ప్రయోగం - ఇస్రో
  4. విజయవంతమైన స్క్రామ్‌జెట్ ఇంజనుప్రయోగం