Jump to content

ఉపగ్రహ వాహక నౌక

వికీపీడియా నుండి
(ఉపగ్రహ ప్రక్షేపణ యానం నుండి దారిమార్పు చెందింది)
ఉపగ్రహ వాహక నౌక

ఎస్‌ఎల్‌వి - ఉపగ్రహ ప్రయోగ వాహనం
ఫంక్షన్ Small carrier rocket
తయారీదారు ఇస్రో
మూలమైన దేశం  భారతదేశం
పరిమాణం
ఎత్తు 22 మీటర్లు (72 అ.)
వ్యాసము 1 మీటరు (3.3 అ.)
ద్రవ్యరాశి 17,000 కిలోగ్రాములు (37,000 పౌ.)
సామర్థ్యం
Payload to
400కి.మీ ల భూ నిమ్న కక్ష్య
40 కిలోగ్రాములు (88 పౌ.)
సంబంధిత రాకెట్లు
ఉత్పన్నాలు ఎఎస్‌ఎల్‌వి, పిఎస్‌ఎల్‌వి
ప్రయోగాల చరిత్ర
స్థితి విశ్రాంత
ప్రయోగ ప్రాంతములు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం
మొత్తం ప్రయోగాలు 4
తర్వాతి 2
వైఫల్యాలు 1
పాక్షిక వైఫల్యాలు 1
మొదటి ఫ్లైట్ 1979 ఆగస్టు 10
చివరి ఫ్లైట్ 1983 ఏప్రిల్ 17
గుర్తింపదగిన పేలోడ్లు రోహిణి
మొదటి దశ
ఇంజన్లు 1 solid
ఒత్తిడి 502.6 కిలోnewtons (113,000 lbf)
విశిష్ట ప్రచోదనం 253 సె
మండే కాలం 49 సె
ఇంధనం Solid
రెండవ దశ
ఇంజన్లు 1 solid
ఒత్తిడి 267 కిలోnewtons (60,000 lbf)
విశిష్ట ప్రచోదనం 267 సె
మండే కాలం 40 సె
ఇంధనం Solid
మూడవ దశ
ఇంజన్లు 1 solid
ఒత్తిడి 90.7 కిలోnewtons (20,400 lbf)
విశిష్ట ప్రచోదనం 277 సె
మండే కాలం 45 సె
ఇంధనం Solid
నాల్గవ దశ
ఇంజన్లు 1 solid
ఒత్తిడి 26.83 కిలోnewtons (6,030 lbf)
విశిష్ట ప్రచోదనం 283 సె
మండే కాలం 33 సె
ఇంధనం Solid

ఉపగ్రహ వాహక నౌక (ఎస్‌ఎల్‌వి-3), కృత్రిమ ఉపగ్రహాలను ప్రయోగించే వాహక నౌక. స్వదేశీ వాహక నౌకా పరిజ్ఞానాన్ని అభివృధ్ధి చేసేందుకు, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ, 1970లలో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఈ రాకెట్టును తయారు చేసారు. ఈ ప్రాజెక్టు అధిపతిగా ఎ.పి.జె అబ్దుల్ కలాం ఉండేవాడు. SLV నిర్దేశిత లక్ష్యం 400 కి.మీ ఎత్తు. దాని పేలోడు సామర్థ్యం 40 కేజీలు. [1]

ఇది ఘన ఇంధనంతో నడిచే మోటరు గల, నాలుగు దశల రాకెట్టు. SLV/SLV-3 యొక్క మొదటి ప్రయోగం 1979 ఆగస్టు 10 న శ్రీహరికోట నుండి జరిగింది. ఘన ఇంధనంతో పనిచేసే నాలుగు దశల ఈ రాకెట్టు బరువు 17 టన్నులు, ఎత్తు 22 మీటర్లు, పేలోడ్ బరువు 40కిలోలు[1] SLV యొక్క చివరి ప్రయోగం, 1983 ఏప్రిల్ 17 న జరిగింది. తర్వాతి తరానికి చెందిన ASLV నిర్మాణానికి SLV-3 ప్రధాన భూమికని ఏర్పరచింది. [1]

ప్రక్షేపణల చిట్టా

[మార్చు]

నాలుగు SLV ప్రయోగాలూ, షార్ లోని ఒకే ప్రయోగ వేదిక (Launch pad) నుండి జరిగాయి. చివరి SLV ప్రయోగం తరువాత ఆ ప్రయోగ వేదికను వదిలి వేసారు.

ప్రయోగం ప్రక్షేపణ తేదీ పేలోడ్ పేలోడ్ ద్రవ్యరాశి ఫలితం విశేషాలు
D1[2] 1979 ఆగస్టు 10 రోహిణి టెక్నాలజీ పేలోడ్ (RTP)[3] 35 కేజీ విఫలం[4] వాల్వులలోని లోపం, తప్పుడు విశ్లేషణ మూలంగా ప్రయోగానికి 317 సెకన్ల తర్వాత బంగాళాఖాతం కూలిపోయింది.
D2 [2] 1980 జూలై 18 రోహిణి RS-1 35 కేజీ సఫలం
D3 [2] 1981 మే 31 రోహిణి RS-D1 38 కేజీ విఫలం[4] అంచనాలకు విరుద్ధంగా అత్యంత అస్థిరమైన క్రింది కక్ష్యలోకి ఉపగ్రహం ప్రక్షేపింపబడింది. 9 రోజుల తర్వాత ఉపగ్రహం కక్ష్యనుండి కిందికి ఒరిగి పోయింది.[4]
D4 [2] 1983 ఏప్రిల్ 17 రోహిణి RS-D2 41.5 కేజీ సఫలం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "SLV". isro.gov.in. Archived from the original on 2017-05-29. Retrieved 2015-09-05.
  2. 2.0 2.1 2.2 2.3 "SLV, ASLV, PSLV and GSLV launch history". Spacecraft Encyclopedia. Retrieved March 12, 2013.
  3. "RTP". ISRO. Archived from the original on 17 మార్చి 2011. Retrieved 9 July 2013.
  4. 4.0 4.1 4.2 "India (SLV/ASLV/PSLV/GSLV) Flight History by Variant/Year (1979-2010)". Archived from the original on 2014-10-11. Retrieved March 12, 2013.