Jump to content

ఉరూజ్ ముంతాజ్

వికీపీడియా నుండి
ఉరూజ్ ముంతాజ్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఉరూజ్ ముంతాజ్ ఖాన్
పుట్టిన తేదీ (1985-10-01) 1985 అక్టోబరు 1 (వయసు 39)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 20)2004 మార్చి 15 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 36)2004 మార్చి 21 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2010 మే 26 - ఐర్లాండ్ తో
తొలి T20I (క్యాప్ 11)2009 మే 25 - ఐర్లాండ్ తో
చివరి T20I2010 మే 10 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2005/06Karachi
2009/10Zarai Taraqiati Bank Limited
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మలిఎ
మ్యాచ్‌లు 1 38 9 54
చేసిన పరుగులు 0 502 87 784
బ్యాటింగు సగటు 0.00 14.34 13.42 16.33
100లు/50లు 0/0 0/1 0/0 0/3
అత్యుత్తమ స్కోరు 0 57 26* 60
వేసిన బంతులు 198 1,085 177 1,531
వికెట్లు 2 36 6 55
బౌలింగు సగటు 48.50 24.38 21.16 21.56
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/24 5/33 2/14 5/20
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 13/– 3/– 21/–
మూలం: CricketArchive, 2021 డిసెంబరు 10

ఉరూజ్ ముంతాజ్ ఖాన్ (జననం 1985, అక్టోబరు 1) పాకిస్తాన్ క్రికెట్ వ్యాఖ్యాత, టెలివిజన్ హోస్ట్, దంతవైద్యురాలు, మాజీ క్రికెటర్.[1][2] ఆల్ రౌండర్‌గా కుడిచేతి లెగ్ బ్రేక్ బౌలింగ్, కుడిచేతి బ్యాటింగ్ రాణించింది. 2004 - 2010 మధ్యకాలంలో ఒక టెస్టు మ్యాచ్, 38 వన్ డే ఇంటర్నేషనల్స్, తొమ్మిది ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ లో ఆడింది.[3] కరాచీ, జరాయ్ తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[4]

ప్రారంభ జీవితం, విద్య

[మార్చు]

1985, అక్టోబరు 1న కరాచీలో జన్మించింది. ఫాతిమా జిన్నా డెంటల్ కళాశాల నుండి పట్టభద్రురాలైంది. షెఫీల్డ్ యూనివర్సిటీ నుండి రిస్టోరేటివ్ డెంటిస్ట్రీలో మాస్టర్ ఆఫ్ మెడిసిన్ చేసింది.[5]

క్రికెట్ రంగం

[మార్చు]

ఆల్ రౌండర్‌గా పాకిస్తాన్ జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ఆడింది. ఆసియా XI క్రికెట్ జట్టులో ఆడింది. ఒక టెస్ట్ మ్యాచ్, 38 వన్డేలు, తొమ్మిది ట్వంటీ 20 మ్యాచ్‌లలో పాల్గొన్నది. 2010, మే 10న న్యూజిలాండ్ మహిళలతో జరిగిన సిరీస్‌లో పాల్గొంది. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2009 లో జట్టుకు కెప్టెన్‌గా కూడా ఆడింది.[6] 2010లో, క్రికెట్‌లోని అన్నిరకాల ఫార్మాట్ల నుండి రిటైరైంది.[2]

2019 మార్చిలో, ఆల్ ఉమెన్ సెలక్షన్ ప్యానెల్‌కు అధిపతిగా నియమితురాలయింది.[7] 2019 ఏప్రిల్ లో, దక్షిణాఫ్రికా పర్యటన కోసం పాకిస్థాన్ మహిళల జట్టుకు ఎంపికచేసే కమిటీలో ఉంది.[8] 2020 అక్టోబరులో, పురుషుల వన్డే క్రికెట్ మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా సేవలందించిన మొదటి పాకిస్థానీ మహిళా వ్యాఖ్యాతగా నిలిచింది.[9]

మూలాలు

[మార్చు]
  1. "PSL 2020: Waqar Younis, Urooj Mumtaz to reportedly join commentary panel". www.geosuper.tv.
  2. 2.0 2.1 Hasan, Shazia (March 31, 2019). "CRICKET: LEADING FROM THE FRONT". DAWN.COM.
  3. "Player Profile: Urooj Mumtaz". ESPNcricinfo. Retrieved 10 December 2021.
  4. "Player Profile: Urooj Mumtaz". CricketArchive. Retrieved 10 December 2021.
  5. "Follow your dream and be sincere to yourself and your profession - Dr Urooj Mumtaz". August 27, 2014.
  6. "The changing landscape of women's cricket". International Cricket Council. Retrieved 14 February 2022.
  7. "Urooj Mumtaz to head PCB's all-women selection panel". www.espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 2020-11-18.
  8. "Bismah Maroof to lead Pakistan women in South Africa". ESPN Cricinfo. Retrieved 13 April 2019.
  9. "Urooj Mumtaz becomes first Pakistan woman commentator to officiate in men's ODI". BDCricTime. 2020-10-31. Retrieved 2020-11-18.

బాహ్య లింకులు

[మార్చు]