ఉర్సు
(ఉర్స్ నుండి దారిమార్పు చెందింది)
సూఫీ తత్వము, తరీకా |
---|
పోర్టల్ |
ఉర్సు లేదా ఉరుసు లేదా ఉర్స్ (ఆంగ్లం : Urs) (ఉర్దూ: عرس ) సూఫీ సంతుడి లేదా ఔలియా వారి వర్ధంతి సందర్భంగా జరుపుకునే ఉత్సవం. ప్రధానంగా దర్గాహ్ లలో జరుపుకుంటారు. ఉదాహరణకు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి వారి ఉర్స్. ఈ సాంప్రదాయం ప్రధానంగా దక్షిణాసియా ముస్లింలలో కానవస్తుంది. ఈ ఔలియాల 'విసాల్' (అల్లాహ్ తో చేరడం) ఉర్స్ లేదా కళ్యాణం అని భావిస్తారు.
ఉర్స్ అనే పదానికి మూలం అరబ్బీ పదం, దీని అర్థం 'పెళ్ళి' లేదా 'ఉక్ద్' లేదా 'నికాహ్' అనే అర్థం వస్తుంది.
ఈ ఉర్స్ కార్యక్రమాలలో ప్రధాన ఆకర్షణ ఖవ్వాలీ కార్యక్రమం. దీనినే సమా క్వాని అనీ వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఆయా దర్గాహ్ ల సజ్జాద-నషీన్ లు వ్యవహరిస్తారు.
- ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రధాన ఉరుసులు
- విజయనగరం హజరత్ సయ్యద్ యార్ ముహమ్మద్ ఖాన్ బాబా అలైహి రహ్ మా,హజరత్ హాజి మునవ్వర్ అలిషా ఖాదరి అలైహి రహ్ మా,హజరత్ పీర్ మస్తాన్ అలిషా ఖాసీమి కలీమి అలైహి రహ్ మా,హజరత్ సయ్యద్ ఖాదర్ బాబా
- గిద్దలూరు, ప్రకాశం జిల్లా హజరత్ రాజా హుస్సేన్ పీర్ షా,ఖాదరి కంబల్ పోష్
- భవానీపురం,విజయవాడ బాబాజీ హజరత్ సయ్యద్ అమీనుద్దీన్ చిష్టి, అలైహి రహ్ మా,కృష్ణా బ్యారేజ్ వద్ద,హజరత్ సయ్యద్ అలి హుసేన్ షాః ఖాదరి అలైహి రహ్ మా,పంజా సెంటర్,హజరత్ లోటే సోటే మస్తాన్ వలీ అలైహి రహ్ మా,కృష్ణా బ్యారేజ్ వద్ద, విజయవాడ సయ్యద్ షా ఖాదరి అలైహి రహ్ మా,హజరత్ సయ్యద్ షా ముసాఫిర్ బుకారి
- గుంటూరు హజరత్ షాబా హుస్సేని అలైహి రహ్ మా,హజరత్ సయ్యద్ బర్హానుద్దీన్ అలీషా ఖాద్రీ
- కడప హజరత్ ఖ్వాజా సయ్యద్ షా; అమీనుల్లా మొహమ్మద్ ముహమ్మదుల్ హుశేని ఇష్టియుల్ ఖాదరి ఆస్థాన-ఎ-మగ్దూముల్లాహి,హజరత్ సూఫిసర్ మస్త్ సాని చిల్లాకష్ అరిపుల్లా ముహమ్మద్ ముహమ్మదుల్ హుశేని బడా సొందల్ ఆస్థాన-ఎ-మగ్దూముల్లాహి,ఖాదిముల్ ఫుఖార హజరత్ ఖ్వాజ సయ్యద్ షాః యదుల్లా ముహమ్మద్ ముహమ్మదుల్ హుశైని చిష్టిపుల్ ఖాదరి అస్తాన-ఎ-మఖ్ దుముల్లాహి,హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా ముహమ్మద్ ముహమ్మదుల్ హుశేని ఇష్టియల్ ఖాదరి ఆస్థాన-ఎ-మగ్ధూముల్లాహి
- పొన్నాడ, తూగో॥జిల్లా హజరత్ బషీర్ బీబీ అలైహి రహ్ మా
- నరశింగపల్లి, విశాఖ జిల్లా హజరత్ కాలేషా వలి బాబా అలైహి రహ్ మా
- కొత్తలంక, తూగో॥జిల్లా హజరత్ అహ్మద్ ఆలీషా ఖాదరి అలైహి రహ్ మా
- కసుమూరు, నెల్లూరు జిల్లా హజరత్ కరీముల్లా షా ఖాదరి అలైహి రహ్ మా
- రహ్మతాబాద్ (ఎ.ఎస్.పేట) నెల్లూరు జిల్లా హజరత్ ఖ్వాజా నాయబ్-ఎ-రసూల్ అలైహి రహ్ మా
- గిద్దలూరు, ప్రకాశం జిల్లా దస్తగీర్ మహాత్ములవారి గంధము
- అక్కయపాలెం, విశాఖపట్నం. హజరత్ బాబా పహాడ్ వాలె అలైహి రహ్ మా,హజరత్ ఇస్హాక్ మదిని అలైహి రహ్ మా
- బెల్లంకొండ, గుంటూరు జిల్లా హజరత్ తాజూల్ ఖాలి షేక్ మీరా హుస్సేన్ ఖాలీ బాబా
- పెనుగొండ హజరత్ బాబా ఫక్రుద్దీన్ అలైహి రహ్ మా,నియాజ్ హజరత్ ఇమామ్ జాఫర్ సాధిక్ (ర.జి)
- కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుఖారీ ఖాద్రీ
- మొహిద్దీన్ పురం,అర్ధవీడు హజరత్ సయ్యద్ జాహెద్
- గాయంపాడు, పెడన మం॥ హజరత్ మౌలా అలి
- ఏలూరు హజరత్ సయ్యద్ బాయజీద్
- పామర్రు హజరత్ జియావుల్ హఖ్ లిముల్లాహ్ముహుబుల్లా చిష్టీ
- మల్లయ్యపాలెం కృష్ణా జిల్లా హజరత్ సాలార్ షా ఖాదరి అలైహి రహ్ మా
- నాంపల్లి, హైదరాబాదు హజరత్ యూసూ ఫైన్, అలైహి రహ్ మా
- నెల్లూరు హజరత్ బారా షహీద్ అలైహి రహ్ మా
ఇవీ చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- A Wedding with the Divine, by Yousuf Saeed
- Urs Ajmer Sharif