ఉల్లిపాయ వడియాలు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఉల్లిపాయ వడియాలు ఒక రకం వడియాలు. వీటిని మినప్పప్పు - ఉల్లిపాయల మిశ్రమంతో తయారు చేస్తారు. గారెలకు చేసే తరహాలో మినప్పప్పును నానబెట్టుకుని పిండిగా రుబ్బుకొని అందులోకి రుబ్బుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని కలిపి ఉండలుగా చేసి, ఎండలో వడియాలుగా పెట్టుకుంటారు. అవసరమయినపుడు నూనెలో వేపుకుని తినవచ్చు.
తయారీకి అవసరమైన పదార్థాలు
[మార్చు]- మినపప్పు పావు కిలో
- ఉల్లిపాయలు 1/2 కిలో
- పచ్చిమిర్చి 5
- జీలకర్ర 1 స్పూన్
- అల్లం చిన్న ముక్క
- ఉప్పు తగినంత
తయారీ విధానము
[మార్చు]మినపప్పు ఐదు గంటల ముందు నానపెట్టుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి అల్లం,పచ్చిమిర్చి మెత్తగా నూరుకోవాలి .మినపప్పు కొంచెం గట్టిగగారెల పిండిలా గ్రైండ్ చెయ్యాలిఅపిండిలో ఉల్లిపాయముక్కలు,ఉప్పు,జీలకర్ర,అల్లం,పచిమిర్చిముద్దకలిపి చిన్న,చిన్న ఉండలుగ వడియాలు పెట్టుకోవాలిబాగా ఎండపెట్టుకోవాలి.[1]
సాహిత్యంలో ప్రస్తావన
[మార్చు]ముళ్ళపూడి వెంకటరమణ తన ఆత్మకథ కోతి కొమ్మచ్చిలో ఈ ఉల్లిపాయ వడియాల గురించి రాసుకున్నారు.
సూచికలు
[మార్చు]- ↑ "తయారీ విధానము". Archived from the original on 2015-10-19. Retrieved 2013-07-24.