ఉష (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉష
(1939 తెలుగు సినిమా)
దర్శకత్వం జి.వెంకటేశ్వరరావు
తారాగణం నీలంరాజు వేంకటశేషయ్య,
పద్మావతి సాలగ్రాం,
మద్దెల నగరాజకుమారి,
నల్లాను కృష్ణమాచార్యులు,
మాలతి
భాష తెలుగు

1938లో పద్మావతి సాలగ్రాం తన కుటుంబంతో మొదటిసారి దక్షిణ భారతదేశ పర్యటనకై వచ్చి మద్రాసులో మకాం పెట్టారు. టి.వి.సుబ్బారావు అనే ఒక కన్నడ సంగీతాభిమాని ఆ కుటుంబాన్ని నీలంరాజు వేంకటశేషయ్యకు పరిచయం చేశాడు. ఆంధ్రపత్రికలో సినిమా పేజీ నిర్వహిస్తూ, చెన్నపురి ఆంధ్రమహాసభ సెక్రటరీగా ఉన్న శేషయ్యకు కొన్ని సంగీత సంస్థలు, గ్రామఫోన్‌ కంపెనీలతో పరిచయాలుండేవి. అతను అవకాశం వున్నచోట ఆమె కచ్చేరీలు పెట్టించారు. అదే సమయంలో ఒంగోలు - చీరాల ప్రాంతవాసులైన ధేనువకొండ సుబ్బారావు, రావుల వెంకటసుబ్బారావు, గాలి వెంకటేశ్వరరావు ప్రభృతులు మద్రాసుకు వచ్చి ఉషా పరిణయం అనే సినిమా తీయాలి అని నిశ్చయించారు. వీరికి నీలంరాజు వేంకటశేషయ్య ఎరిగుండడం మూలాన ఈయనని కూడా తమలో కలుపుకున్నారు. పద్మావతిని తమ సినిమాలో ఉషగా నటింపచేస్తే, ఆ ఆమె కంఠమాధుర్యాన్ని సినిమాను విజయవంతం చేయడానికి వినియోగించుకోవచ్చుననుకున్నారు. కర్ణాటక సంగీతంలో దిట్ట అయిన ధేనువకొండ సుబ్బారావు హరికథా కాలక్షేపాలు చేసి ఆ ప్రాంతంలో చాలా మన్ననలందుకున్నాడు. అతను కర్ణాటక సంగీతం, పద్మావతి సాలిగ్రాం హిందూస్థానీ సంగీతం, రెండూ కలిసి సినిమాకు అఖండ విజయం సాధిస్తాయని విశ్వసించి నీలంరాజు వేంకటశేషయ్య అనిరుద్ధుడిగా, పద్మావతి కథానాయికగా ఉషా పరిణయం సినిమా తీసారు. కానీ ఈ చిత్రం వ్యాపారపరంగా విజయవంతం కాలేదు.[1]

పాటలు, పద్యాలు[మార్చు]

  1. అప్రతిహతము ఆనందమయము అద్వితీయమగు - రాజకుమారి
  2. అల దిక్పాలురనెల్ల గోడ్పడచి బాహా ప్రౌడిచే ( పద్యం ) - దేనువుకొండ సుబ్బారావు
  3. కననెంతో ముదమగుగా సరసంబౌమధుశోభ - పద్మావతి సాలగ్రాం,రాజకుమారి బృందం
  4. ఛీ యికను సయిరింతునా విననికన్ ఘనుడనేవిటుల - వరదా రాధాకృష్ణయ్య
  5. తెరవు గనగా తోచదే ప్రియసఖి వాంఛనేరీతి - రాజకుమారి
  6. ద్వారకా వాస జగదోద్ధారా దయాభరణా కృష్ణ మురారే - దేనువుకొండ సుబ్బారావు
  7. ధన్యాత్ముడ నేనైతిన్ గదా గిరిజాధిపా నీదుకృపచే - వరదా రాధాకృష్ణయ్య
  8. పాహి పరాత్పర పాహి జై జై పాపవిదూర తాపవిదార - బృందం
  9. ప్రేమమయా కుసుమావళిచే మదిలోన పూజసేయ - పద్మావతి సాలిగ్రాం
  10. బృందావనా విహారా మురళీధరామురారే - దేనువుకొండ సుబ్బారావు
  11. బేలమనసా తాల్మిదూలపాడియౌగా - చీరాల బాలకృష్ణమూర్తి
  12. మదిరా మదమో మధురామృతమో యిది - పద్మావతి సాలిగ్రాం, నీలంరాజు
  13. యెటులో తెలియా దయమాలి వినడాయెగా - జి. విశ్వేశ్వరమ్మ
  14. రాధా మానస సంచారా బేధ రహిత మందోద్దారి - దేనువుకొండ సుబ్బారావు
  15. విధి కృతము దాట వశమగునా ఎవరికి నైనన్ - యన్.సి హెచ్. కృష్ణమాచారి
  16. వినగాలేని యరాతి సంస్థుతుల గావింపంగ ( పద్యం ) - వరదా రాధాకృష్ణయ్య
  17. సకల మహాలోకాధారా మాతా దేవీ భవానీ - పద్మావతి సాలిగ్రాం
  18. సుతగాదా తగునా ప్రియా వీతమనోరధగా చేయగనీ - జి. విశ్వేశ్వరమ్మ
  19. సుతుగా గైకొని కాంఛితార్థముల నస్తోకంబుగా ( పద్యం ) - ధర్మవరపు భుజంగరావు
  20. సురుచిరంబగు వికసిత సుమముజేరి ( పద్యం ) - దేనువుకొండ సుబ్బారావు

మూలాలు[మార్చు]

  1. "సగటుమనిషి స్వగతం - స్వాతంత్ర్య సమరోత్సాహి శ్రీ నీలంరాజు". ఆంధ్రప్రభ. 22 Jan 2012. Retrieved 16 February 2015.[permanent dead link]

బయటి లింకులు[మార్చు]