ఊటుకూరి సుబ్బరాయశ్రేష్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊటుకూరి సుబ్బరాయశ్రేష్టి (1894-1935) ఆంధ్ర గ్రంథాలయోధ్యమములోని మొదటితరము ప్రముఖులలో ఒకరు.

జననము - బాల్యము[మార్చు]

ఊటుకూరి సుబ్బరాయశ్రేష్టి 1894 వ సంవత్సరములో ప్రకాశం జిల్లాలో జన్మించారు.

గ్రంధాలయోద్యమములో పాత్ర[మార్చు]

వీరు ప్రకాశం జిల్లా వేటపాలెం నివాసి. 1918 వ సంవత్సరములో హిందూ యువజనసంగంను స్థాపించారు. 1924 లో దీన్ని సారస్వత నికేతనంగా నూతన నామకరణంచేసారు. ఇతనికి బిడ్డలు లేనందున తన యావదాస్తిని ఈ సారస్వత నికేతనానికి అప్పగించి దీన్ని మహోన్నత సంస్థగా తీర్చి దిద్దారు. అయ్యంకి వెంకటరమణయ్య వారికి గ్రంథాలయోధ్యమ కార్యక్రమాలలో ఎంతోసహయపడ్డారు. వీరు నిర్వహించిన అనేక సభలకు తనసొంత ఖర్చుతో జాతీయ స్థాయి నాయకులైన గాంధీజీ, రాజేంద్ర ప్రసాద్, జమ్నాలాల్ బజాజ్ మొదలగు వారిని తమ గ్రంథాలయానికి వచ్చేటట్లు చేసారు.

మూలాలు[మార్చు]

గ్రంథాలయోద్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము: పుట. 57