ఊట్ల స్వర్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊట్ల స్వర్ణ
Vutla Swarna.jpg
జననంఎలబాక గ్రామం, వీణవంక మండలం, కరీంనగర్ జిల్లా
వృత్తిఉద్యమ గీత గాయని
మతంహిందూ

ఊట్ల స్వర్ణ ప్రజా గాయని. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

జీవిత విశేషాలు[మార్చు]

కరీంనగర్ జిల్లా, వీణవంక మండలంలోని ఎలబాక గ్రామంలో జన్మించింది. ఈమె చిన్నతనమంతా తన అక్క ప్రగతిశీల మహిళా సంఘం నేత అయిన జ్యోతి ఇంటిలో గడిచింది. అక్కడే స్వర్ణకు పాటతో తొలి పరిచయం యేర్పడింది. అరుణోదయ కళాకారులతో కలసి జ్యోతి పాటలు పాడుతుంటే స్వర్ణ కూడా గొంతు కలిపేది. అయితే అప్పుడు నేర్చుకున్నవన్ని కూడా చైతన్య గీతాలే కావడం విశేషం. మా టీవీ లో ప్రసారమైన వన్స్‌మోర్ ఫ్లీజ్‌లో పాడే అవకాశం వస్తే అక్కడ కూడా అమ్మ చూడమ్మా బైలెల్లినాదో గోదారమ్మా...గంగమ్మ తైల్లె బైలెల్లినాదో గోదారమ్మా అంటూ చైతన్య గీతమే పాడారు. ఆ చైతన్య గీతాలే ఆమెను గాయకురాలిగా వేదికలెక్కేలా చేశాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కాసోజు శ్రీకాంతచారి ఆత్మబలిదానం తనను కలచివేసిందని చెప్పే స్వర్ణ తెలంగాణ వచ్చేదాకా ఉద్యమ పాటలు తప్ప మరే పాటలు పాడనని నిర్ణయించుకుంది. అన్నట్లుగానే మాట మీద నిలబడింది. తెలంగాణ సమరనాదం, తెలంగాణ రగడా, ఉద్యమాల ఉస్మానియా పేర్లతో స్వయంగా పాటల సీడీలను కూడా రూపొందించింది.

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

యూట్యూబ్‌లో[మార్చు]

'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో- బంగారు తల్లివే ఉయ్యాలో... మా ఇంటి ముంగిట్లో ఉయ్యాలో' అంటూ... యుట్యూబ్‌ లో వినిపించే గొంతు స్వర్ణదే..

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ. "ప్రతిభకు పురస్కారం!". Archived from the original on 9 March 2017. Retrieved 5 April 2017.

వెలుపలి లంకెలు[మార్చు]