ఊర్వశి రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఊర్వశి రాయ్
జననంజాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్
జాతీయతభారతీయురాలు
విద్యఎంబీఎ (ఫైనాన్స్)
వృత్తిసినీ నటి
క్రియాశీలక సంవత్సరాలు2021– ప్రస్తుతం

ఊర్వశి రాయ్, తెలుగు, కన్నడం, హిందీ, పంజాబీ చిత్రాలలో కనిపించే భారతీయ నటి.[1] ఆమె ఎఫ్బిబి ఫెమినా మిస్ ఇండియా టాప్ 15లో స్థానం సంపాదించింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఊర్వశి 1999 అక్టోబరు 27న ఉత్తరప్రదేశ్ లోని జౌన్‌పూర్ లో జన్మించింది, అయితే కోల్‌కాతాలో పెరిగింది. ఆమె బాగా చదువుకున్న వ్యాపార కుటుంబానికి చెందినది. ఆమె శ్రీ శిక్షాయతన్ బాలికల పాఠశాల నుండి, భవానీపూర్ ఎడ్యుకేషన్ సొసైటీ కళాశాల నుండి తన విద్యను పూర్తి చేసింది. ఆమె బెంగళూరులోని రేవా విశ్వవిద్యాలయం నుండి ఫైనాన్స్ లో ఎంబీఏ చేసింది.

కెరీర్

[మార్చు]

ప్రసిద్ధ చండీగఢ్ వైట్ హిల్స్ మ్యూజిక్ పాయల్ నిర్మించిన పంజాబీ పాట "పాయల్" తో ఊర్వశి తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఈ పాటలో ఆకృతి కక్కర్, శివమ్ గ్రోవర్ కూడా ఉన్నారు.[2]

ఆమె తొలి కన్నడ చిత్రం "సావిత్రి" ను పునీత్ రాజ్‍కుమార్ నిర్మించాడు, విజయ్ రాఘవేంద్ర నటించాడు. ఆమె నటనతో కెరీర్ విజయవంతమైన ప్రారంభాన్ని ఇచ్చింది.[3]

ఆ తరువాత ఆమె అలీ రెజా, అరవింద్ కృష్ణ, ప్రతాప్ పోతేన్ మొదలైన వారు నటించిన గ్రేః ది స్పై హూ లవ్డ్ మీ అనే తెలుగు చిత్రంలో గూఢచారిగా ఆకర్షణీయమైన పాత్రను పోషించింది.[4] ఆ తరువాత, ఆమె నరేష్ కుమార్ హెచ్. ఎన్. దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం సౌత్ ఇండియన్ హీరో లో నటించింది, ఇది థియేటర్లలో భారీ సూపర్ హిట్ సాధించింది.[5][6] ఆమె కెనడాలోని ప్రసిద్ధ పంజాబీ గాయకుడు విక్కీతో కలిసి కెనడాలో ఎఎమ్జి ఓఎమ్జి (AMG OMG) అనే పేరుతో కొన్ని పంజాబీ ఆల్బమ్లను కూడా చేసింది.

తరుణ్ తలిహానీతో సహా చాలా మంది డిజైనర్లు, దుస్తుల బ్రాండ్లకు చెందిన ప్రకటనల ప్రచారం చేశారు. ఆమె దుబాయ్ కి చెందిన ఎలైట్ స్కిన్ నేచురల్స్ అనే చర్మ సంరక్షణ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది. ఆమె చెన్నై, బెంగళూరులో టాప్ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్, ముగ్ధా చీరలు, కరియల్లి జ్యువెలరీ వంటి వాణిజ్య ప్రకటనలలోనూ చేసింది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
క్రమ సంఖ్య సంవత్సరం సినిమా పాత్ర భాష గమనిక
1 2023 సావిత్రి పూజ కన్నడ తొలి కన్నడ చిత్రం
2 2023 ది స్పై హూ లవ్డ్ మి ఆరుషి రెడ్డి/శర్మ తెలుగు తొలి తెలుగు చిత్రం
3 2023 సౌత్ ఇండియన్ హీరో స్పూర్తి కన్నడ
4 2023 కౌశిక వర్మ దమయంతి తెలుగు ఊర్వశి రాయ్ గా పేరు [7]

మ్యూజిక్ వీడియోలు

క్రమ సంఖ్య శీర్షిక భాష గమనిక
1 పాయల్ పంజాబీ
2 ఎఎమ్జి ఓఎమ్జి పంజాబీ

మూలాలు

[మార్చు]
  1. "Urvashi Roy Movies: Latest and Upcoming Films of Urvashi Roy| Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 20 August 2024.
  2. "'Grey': Urvashi Rai to play a journalist in Arvind Krishna and Ali Reza starrer". The Times of India. 31 May 2022. ISSN 0971-8257. Retrieved 20 August 2024.
  3. "Vijay Raghavendra joins Shashikanth Gatti's next film, Ringa Ringa Roses". The Times of India. 18 January 2021. ISSN 0971-8257. Retrieved 20 August 2024.
  4. hansindia (27 May 2023). "Grey Movie Review: A watchable thriller with romance dosage". www.thehansindia.com. Retrieved 20 August 2024.
  5. Sharadhaa, A. (22 February 2023). "'South Indian Hero takes you inside the life of a Superstar'". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 20 August 2024.
  6. Service, Express News (9 February 2023). "Naresh Kumar's 'South Indian Hero' gets a release date". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 20 August 2024.
  7. "Popular producer C.Kalyan launches "Padara Padara Vetaku Veladam" song from the movie "Kaushika Verma Damayanti"...!". The Times of India. 12 October 2022. ISSN 0971-8257. Retrieved 20 August 2024.