ఎం.ఎన్.దేశ్‌పాండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మధుసూదన్ నర్‌హర్ దేశ్‌పాండే (1920 నవంబరు 11 - 2008 ఆగస్టు 7), భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, కళా చరిత్రకారుడు, కళా సంరక్షకుడు. అతను 1972 నుండి 1978 వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు.[1][2]

ప్రారంభ జీవితం

[మార్చు]

దేశ్‌పాండే అప్పటి బాంబే ప్రెసిడెన్సీ సతారా జిల్లాలోని రహిమత్‌పూర్ గ్రామంలో దేశస్థ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. పూనాలో పాఠశాల విద్యను అభ్యసించాడు. 1942 లో ఫెర్గూసన్ కళాశాల నుండి ఆనర్స్‌తో పట్టభద్రుడయ్యాడు. " జైన్ కెనానికల్ లిటరేచర్ అండ్ ఆర్కియాలజీ బేస్డ్ ఇండియా కల్చరల్ హిస్టరీ"పై హెచ్‌డి సంకలియా ఆధ్వర్యంలోని డెక్కన్ కాలేజీలోపోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ చేసాడు. అయితే అది పూర్తి కాకముందే, తక్షశిల లోని స్కూల్ ఆఫ్ ఆర్కియాలజీలో ఫీల్డ్ ఆర్కియాలజీలో శిక్షణ పొందేందుకు మార్టిమర్ వీలర్ అతన్ని ఎంపిక చేసాడు.[3]

అతను ఎక్కువగా పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశం లోని అజంతా, ఎల్లోరా, టాబో, నద్సూర్, పిటల్‌ఖోరా, పన్హలాకాజీలలో బౌద్ధ గుహల తవ్వకాలు జరిపాడు.[4] నేటి జల్గావ్ జిల్లాలో ఉన్న బౌద్ధ ప్రదేశాలైన బహల్, టేక్వాడే గురించి కూడా నివేదించాడు. 1958-59 సీజన్‌లో, అతను దైమాబాద్‌లో జరిపిన త్రవ్వకాల్లో ఇది చాల్‌కోలిథిక్ ఎరా స్థావరమని వెల్లడైంది.[5]

పుస్తకాలు & వ్యాసాలు

[మార్చు]
  • The caves of Panhāle-Kājī (ancient Pranālaka): an art historical study of transition from Hinayana, Tantric Vajrayana to Nath Sampradāya (third to fourteenth century A.D.) (in English). New Delhi: Archaeological Survey of India. 1986. ASIN B0006EPMPS. OCLC 923371295. Retrieved 5 February 2021.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • MN Deshpande's Papers, అశోకా యూనివర్సిటీలో
  • "MY TRYST WITH CHINESE ART M. N. Deshpande | IGNCA". ignca.gov.in. Retrieved 2023-12-09.

మూలాలు

[మార్చు]
  1. Rao 1981, p. ix.
  2. "M.N. Deshpande: Archaeologist as miracle worker". Frontline, The Hindu. 1 January 2021.
  3. Nayanjot Lahiri (30 November 2020). Archaeology and the Public Purpose: Writings on and by M.N. Deshpande. Oxford University Press. p. 19. ISBN 9780190993863.
  4. Lahiri, Nayanjot (2021-01-04). "The Public Archaeologist". Open The Magazine (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2023-12-09.
  5. Settar, S.; Korisettar, Ravi (2002). Indian Archaeology in Retrospect: Protohistory, archaeology of the Harrappan civilization (in ఇంగ్లీష్). Indian Council of Historical Research. p. 430. ISBN 978-81-7304-320-8.
  • Rao, M. S. Nagaraja (1981). Madhu: recent research in Indian archaeology and art history: Shri M.N. Deshpande festschrift. Agam Kala Prakashan.