ఎం.ఎస్.శ్రీరాం (సంగీత దర్శకుడు)
స్వరూపం
(ఎం.ఎస్.శ్రీరాం నుండి దారిమార్పు చెందింది)
ఎం. ఎస్. శ్రీరాం చలచిత్రరంగంలో సంగీత దర్శకుడు, ప్రసార ప్రముఖుడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను జమున నాయికగా మంచి రోజు (1977),[2] పెళ్ళి రోజు చిత్రాలకు సంగీత దర్శకత్వం, దర్శకత్వం వహించాడు.[3][4] 1977లో UPSC ద్వారా ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నియమితులై విజయవాడ కేంద్రంలో చేరాడు. రెండేళ్ళ తర్వాత కడప బదిలీ అయ్యాడు. అక్కడ నుండి మదరాసు దూరదర్శన్ కేంద్రానికి బదిలీ అయ్యాడు. అక్కడే అసిస్టెంట్ డైరక్టర్ గా పదోన్నతి పొందారు. అక్కడ పనిచేస్తుండగా హఠాన్మరణం పొందాడు. ఈమని శంకరశాస్త్రిగారు వీరికి మేనమామ. చక్కటి సంగీత కార్యక్రమాల రూపకల్పన చేసిన శ్రీరాం ప్రసార రంగంలో గుర్తింపు పొందినవాడు.
సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు
[మార్చు]- కొండవీటి దొంగ (1958)
- శ్రీ కృష్ణ లీలలు (1958)
- మూఢ నమ్మకాలు (1963)
- పెళ్ళిరోజు (1968)
- వారసురాలు (1973)
- మంచిరోజు (1977)
మూలాలు
[మార్చు]- ↑ ప్రసార ప్రముఖులు, డా.ఆర్. అనంతపద్మనాభరావు, 1996; పేజీ:87.
- ↑ "Manchi Roju (1977), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.
- ↑ "Manchi Roju on Moviebuff.com". Moviebuff.com. Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.
- ↑ "Pelli Roju (పెళ్లి రోజు) 1968". ♫ tunes (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-12-22. Archived from the original on 2020-07-25. Retrieved 2020-07-25.