Jump to content

ఎదిగే ఈము పక్షి పెంపక నిర్వహణ

వికీపీడియా నుండి

ఈము పక్షి పిల్లలు, పెరుగుతున్న కొద్దీ, వాటికి కావలసిన నీటి , ఆహార తొట్టెలు, పరిమాణంలో పెద్దది అవసరమౌతాయి. అలాగే స్థలం కూడా అధికంగా అవసరమౌతుంది. వాటి లింగ నిర్ధారణ చేసి, విడివిడిగా పెంచాలి. అవసరమైతే, కొట్టంలో తగినంత వరి ఊకను వేసి, అది ఎప్పుడూ మంచి స్థితిలో ఎండి పోయినా స్థితిలో ఉంచాలి. ఎదిగే పిల్లలకు యిచ్చే మేతలో, పక్షులు, 34 వారాల వయసు వచ్చే వరకూ గాని, లేక 25 కేజీల శరీర బరువు పెరిగేటంతవరకూ గాని ఆహారం అందించాలి. వాటి ఆహారంలో 10 % ఆకుకూరలు, ముఖ్యంగా వివిధ రకాలైన ఆకు మేతను ఉండేటట్లు చూడాలి. వీని వలన, అది పీచుపదార్థం కలిగిన ఆహారానికి అలవాటుపడతాయి. శుభ్రమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. అవి కోరుకున్నంత ఆహారాన్ని అందించాలి. పెరుగుతున్నంత కాలం, పెంపకశాలలో, ఊకను పరచిన ప్రదేశం పొడిగా ఉండేస్థితికి కొనసాగించాలి. అవసరమైతే, తగినంత పరిమాణంలో వరి ఊకను కొట్టంలో వేయాలి. బయట ప్రాంగణం ఉన్నట్లైతే, 40 అడుగులు x 100 అడుగుల వైశాల్యం గల స్థలాన్ని 40 పక్షుల కోసం కేటాయించాలి. నేల సులభంగా ఎండి పోయేదీ, తేమ లేనిదీ అయి ఉండాలి. చిన్న పక్షులను, ప్రక్కల నుండి లాగి, శరీరాన్ని దగ్గరకు తెచ్చి గట్టిగా పట్టుకోవాలి. వీటిని ఈ విధంగా నియంత్రించాలి. కొంచెం పెద్దవి , పూర్తిగా పెద్దవైన పక్షులను, వాటి రెక్కలను, ప్రక్కల నుండి లాగి, కలిపి పట్టుకుని, మనిషి కాళ్ళ మధ్యకు సమీపంగా తీసుకుని రావాలి. పక్షికి తన్నుకోవడానికి ఆస్కారమివ్వకూడదు. పక్షి ప్రక్కలకి, ముందువైపుకి తన్నుకుంటుంది. అందువలన, జాగ్రత్తగా దగ్గరకు లాగడం, గట్టిగా పట్టుకోవడం చాలఅనసరం. లేకపోతే, పక్షికీ , మనిషికి కూడా హాని జరిగే అవకాశ ముంది. [1]

చేయదగినవి

[మార్చు]
  • పక్షుల సముదాయాన్ని రోజుకి కనీసం ఒక్కసారైనా పర్యవేక్షించి, వాటి చురుకుదనం, ఆహారం , నీటి తొట్టెలను గమనించాలి.
  • కాళ్ళ లోపాలు, ,, రెట్టలను గమనించాలి. జబ్బుతో ఉన్న వాటిని గుర్తించి, వాటిని విడిగా ఉంచాలి.
  • అంతా - లోపల, అంతా - బయట పద్ధతులను పాటించాలి. పెద్ద పక్షుల సమీపంలో వీటిని ఉంచరాదు.

చేయకూడనివి

[మార్చు]
  • పదునైన వస్తువులు, గులక రాళ్ళు వంటి వాటిని పక్షుల సమీపంలో ఉంచరాదు. పక్షులు అల్లరి (కొంటిగా - mischievous) గా ఉంటాయి. అందువలన, వాటికి అందుబాటులో ఉన్న వేటినైనా అవి లాగేస్తూ ఉంటాయి.
  • వేడిగా ఉన్న వాతావరణ పరిస్థితులలో, పక్షులను తాకడం గాని, పట్టుకోవడం గాని చేసి నియంత్రించడం, లేక రోగ నిరోధక టీకాలను యివ్వడం చేయరాదు.
  • రోజు మొత్తం, చల్లటి శుభ్రమైన నీరును అందించాలి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]