ఈము

వికీపీడియా నుండి
(ఈము పక్షుల పెంపకంలో ఆర్థిక లాభాలు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఈము
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Genus:
Species:
D. novaehollandiae
Binomial name
Dromaius novaehollandiae
(Latham, 1790)
The Emu has been recorded in the areas shown in orange.
Synonyms

Dromiceius novaehollandiae

జర్మనీలోని జూమ్ ఎర్లెబ్నిస్వెల్ట్ గెల్సెన్‌కిర్చెన్ వద్ద ఆడ ఈము పిలుపు

ఈము (ఆంగ్లం Emu) ఒకరకమైన ఎగురలేని పక్షులు. ఇవి డ్రోమియస్ ప్రజాతికి చెందినవి. ఇది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి. ఇవి ఇసుక తిన్నెలపై లేదా అడవులలో జీవిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద పక్షి. ఇవి ఏక సంయోగిక పక్షులు. ఈము పక్షులకు చిన్న తల, పొడుగాటి మెడ, శరీరంపై దట్టంగా ఈకలు ఉంటాయి. ఇవి పొడుగాటి కాళ్ళతో 6 అడుగుల ఎత్తు, 45-50 కి.గ్రా. బరువుంటాయి. ఇవి 25-30 సంవత్సరాలు జీవిస్తాయి, శాకాహారులు. ఇవి చాలా వేగంగా పరుగెత్తగలవు. వీటిని మాంసం, నూనె, చర్మం కోసం మనదేశంలో కూడా పెంచుతున్నారు.

ఉపయోగాలు

[మార్చు]
  • ఈము పక్షుల కొవ్వు నుండి ఖరీదైన నూనె తయారుచేస్తారు. ఇది కీళ్ళనొప్పులు, చర్మవ్యాధుల నివారణలో, ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది.
  • ఈము మాంసంలో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది.
  • ఈము చర్మంతో దుస్తులు, చేతి సంచులు, బూట్లు తయారుచేస్తారు.

ఈము పెంపకం

[మార్చు]

ఎమూ పక్షులు రేటైట్ (Ratite - అడుగుభాగం లేని వక్షశల్య జాతి) జాతికి చెందినవి. వీటి మాంసం, గుడ్లు, నూనె, చర్మం, ఈకలు అన్నీ కూడా ఆర్థిక పరమైన విలువ కలిగినవి. ఈ పక్షులు, వివిధ రకాల వాతావరణ శీతోష్ణస్థితులకు త్వరగా అలవాటు పడతాయి. ఎమూ, ఆస్ట్రిచ్ రెండు పక్షులనూ భారతదేశంలో పరిచయం చేసినా, ఎమూ పక్షుల పెంపకానికే ఎక్కువ ప్రాముఖ్యత లభించింది. రేటైట్ జాతికి చెందిన పక్షులకు రెక్కలు పూర్తిగా వృద్ధి చెందవు ఎమూతో పాటు ఆస్ట్రిచ్ (ఉష్ట్ర పక్షి), రియా (అమెరికన్ జాతికి చెందిన ఉష్ట్ర పక్షి) కసోవరి, కివీ పక్షులు, ఈ జాతికి చెందినవి. ప్రపంచంలో చాలచోట్ల, ఎమూ, ఆస్ట్రిచ్ లను వ్యాపారపరంగా, వాటి మాంసం, నూనె, చర్మం, ఈకల కోసం పెంచుతున్నారు. వీటికి, ఆర్థిక పరమైన విలువ చాల ఉంది. ఈ పక్షుల శరీర నిర్మాణం, శారీరక ధర్మాలు, సమశీతోష్ణ మండలి, ఉష్ణమండల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. విస్తృతమైన పెంపక క్షేత్రాలలో (Rancher), తక్కువ వైశాల్యం గల ప్రదేశాలలో కూడా ఈ పక్షులను, అధిక పీచుపదార్థం గల ఆహార మిచ్చి బాగా పెంచవచ్చు. యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా,, చైనా, ఎమూ పెంపకంలో ముందున్నాయి. ఎమూ పక్షులు, భారత దేశ వాతావరణ పరిస్థితులకు చక్కగా ఇమిడి పోయాయి.[1]

ఈము పక్షుల అవయవ లక్షణాలు

[మార్చు]
గడ్డిలో ఆహారం వెతుకుతున్న ఈము
ఈము గుసగుసలాడుతోంది, బుసలు కొట్టడం; ఉబ్బిన గొంతును గమనించండి
ఈము పక్షి
ఈము పక్షి

ఈము పక్షికి, పొడుగు మెడ, చిన్న నున్నని తల, మూడు వేళ్ళు, శరీరంమంతా నిండి ఉన్న ఈకలతో ఉంటుంది. తొలిదశలో (0 – 3 నెలల వయసు వరకూ), పక్షుల శరీరం మీద పోడవైన చారలు ఉండి, క్రమంగా అవి 4 – 12 మాసాల వయసు వచ్చేసరికి గోధుమ రంగు కలయికగ మారతాయి. బాగా ఎదిగిన పక్షులు, నున్నని నీలం రంగు మెడ, శరీరమంతటా రంగు రంగుల చుక్కలున్న ఈకలు కలిగి ఉంటాయి. పూర్తిగా ఎదిగిన పక్షి, సుమారు 6 అడుగుల ఎత్తు, 45 - 60 కేజీల బరువు కలిగి ఉంటుంది. కాళ్ళ పొడవుగా ఉండి, పోలుసులు గల చర్మంతో కప్పబడి ఉండటం వలన, ఎటువంటి గట్టిదైన, ఎండిపోయిన భూములపైన కూడా అవి తట్టుకోగలవు. ఈము పక్షి యొక్క సహజమైన ఆహారం - పురుగులు, మొక్కల లేత ఆకులు, దానిమేత ఇది వివిధ రకాలైన కూరగాయలు, పళ్ళు, కేరట్లు, దోసకాయ, బొప్పాయి మొదలైన వాటిని తింటుంది. ఆడ, మగ పక్షులలో, ఆడపక్షి మగపక్షి కంటే పెద్దది. సంతానోత్పత్తి సమయంలో మగపక్షి చురుగ్గా ఉన్నాకూడ, ఆడ పక్షి, జంటలో ఎక్కువ అధికారికంగా ఉంటుంది. ఈము పక్షులు 30 సంవత్సరాల వయసు వరకూ బ్రతుకుతాయి. 16 సంవత్సరాల కంటే ఎక్కువగానే అవి, గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ పక్షులను గుంపుగా గాని, జంటగా గాని పెంచవచ్చు.[1]

ఈము పక్షుల ఆహారం లేక మేత

[మార్చు]

ఈము పక్షుల తమ సక్రమమైన పెరుగుదలకు, సంచి సంతానోత్పత్తికి, సమతులాహారం అవసరం. ఈ ఆహార అవసరాల గురించి వ్రాసిన విషయాలమీద ఆధారపడి, ఒక పద్ధతి గల పోషకాహార అవసరాలు సూచింపబడ్డాయి.వ్యాపారపరమైన ఎమూ పక్షుల పెంపక కేంద్రాలలో, సంతానోత్పత్తి దశలో ఉన్న ఎమూ జతకు సంవత్సరానికి పెట్టే ఆహారంలో తేడాలు 394 – 632 కేజీలు దాకా ఉంటాయి. సంవత్సర సగటు ఆహారం ఒక జత తీసుకునేది 527 కేజీలు. సంతానోత్పత్తి కాలం కానప్పుడు మేత (ఆహారం) ఖరీదు రు. 6.50 పై, సంతానోత్పత్తి కాలంలో ఆహారం ఖరీదు రు. 7.50 పై.

ఈము పక్షులు గుడ్లను పొదుగుట

[మార్చు]

గది ఉష్ణోగ్రతకు అలవాటైన తరువాత, ఫలవంతమైన ఈము గుడ్లను పొదగడానికి ఏర్పాట్లు చేయాలి. ఒక ట్రేలో సమాంతరంగా గాని ఏటవాలుగా గాని, వరుసలుగా గుడ్లను పెట్టాలి. గుడ్లు పొదిగే స్థలాన్ని (incubator) పూర్తిగా శుభ్రపరిచి, శుద్ధిచేసి సిద్ధంగా ఉంచాలి. మెషీన్ (యంత్రాన్ని) మీట నొక్కి, పొదగడానికి కావలిసిన ఉష్ణోగ్రత సరిగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే డ్రై బల్బే (వేడి బల్బు) ఉష్ణోగ్రత సూమారు 96 - 970 f, వెట్ బల్బ్ (తేమ బల్బు) ఉష్ణోగ్రత సుమారు 78 - 800 f (సుమారు 30 - 40% RH )లుగా ఉండాలి. గుడ్లను ఉంచిన ట్రేను జాగ్రత్తగా ఒక సెట్టర్ (పొదిగే ప్రాంతం)లో ఉంచాలి. ఒకేసారి, ఇన్ క్యూబేటర్ సరైన ఉష్ణగ్రతతో, తేమతో సిద్ధంగా ఉన్నట్లైతే, గుడ్లను పొదగడానికి ఏర్పాటు చేసుకున్న సమయాన్ని, అవసరమైతే దాని జాతి చరిత్రను తెలిపే చీటిని అందులో పెట్టాలి. ఇన్ క్యూబేటర్ లోని ప్రతి 100 క్యూబిక్ అడుగుల స్థలానికి, 20 గ్రాముల పొటాషియం పెర్మాంగవేట్ (Potassium permananganate) + 40 మిల్లీ లీటర్ల ఫార్మలిన్ (Formaline) ను ఉపయోగించి రోగక్రిములను నాశనం చేయాలి. ప్రతిగంటకు, ఒకసారి గుడ్లను తిప్పుతూ, 48వ రోజు వచ్చే దాకా అలా చేస్తూ ఉండాలి. 49వ రోజు తరువాత గుడ్లను అటూ, యిటూ తిప్పడం మానివేసి, కదలికల కోసం గమనిస్తూ ఉండాలి. 52వ రోజుకు పొదగబడే సమయం అయిపోతుంది.

ఈము పక్షి పిల్లల పెంపకం

[మార్చు]

ఈము పక్షి పిల్లలు సుమారు 370 గ్రాముల నుండి 450 గ్రాములు (సుమారు 67% గుడ్డు బరువులో) బరువు, గుడ్డు పరిమాణం (సైజు) పై ఆధారపడి ఉంటాయి. మొదటి 48 - 72 గంటలు, గుడ్డులోని పచ్చసోన శోషణం జరిగి అది పూర్తిగా ఎండి పోయేదాకా, ఎమూ పక్షి పిల్లలు, పోదగబడే స్థలంలోనే నియంత్రించబడతాయి. పక్షి పిల్లలు, రాక ముందే, పెంపక కేంద్రమును (శీల) పరిశుభ్రంగా, వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలతో సమగ్రంగా తయారు చేయాలి. వరిధాన్యపు ఊకను శీల అంతా పంచి, వాటిపై క్రొత్త గోనె సంచులతో గాని, ములక నార బట్టలతో గాని కప్పాలి. మొదటి మూడు వారాలు, ఒక పక్షి పిల్లకు 4 చదరపు అడుగుల చొ||న 24 - 40 పక్షి పిల్లలను పెంచడానికి వీలుగా ఒక పెంపకశాలను అమర్చాలి. మొదటి పదిరోజులు 900 f ఉష్ణోగ్రత, తరువాత, 34 వారాల వరకు 850 f ఉష్ణోగ్రత సమకూర్చాలి. సక్రమమైన ఉష్ణోగ్రతను కల్పించడం ద్వరా పొదగబడిన పిల్లలు ఎటువంటి సమస్యా లేకుండా ఎదుగుతాయి.

ఎదిగే ఈము పక్షి పెంపక నిర్వహణ

[మార్చు]

ఈము పక్షి పిల్లలు, పెరుగుతున్న కొద్దీ, వాటికి కావలసిన నీటి, ఆహార తొట్టెలు, పరిమాణంలో పెద్దది అవసరమౌతాయి. అలాగే స్థలం కూడా అధికంగా అవసరమౌతుంది. వాటి లింగ నిర్ధారణ చేసి, విడివిడిగా పెంచాలి. అవసరమైతే, కొట్టంలో తగినంత వరి ఊకను వేసి, అది ఎప్పుడూ మంచి స్థితిలో ఎండి పోయినా స్థితిలో ఉంచాలి. ఎదిగే పిల్లలకు యిచ్చే మేతలో, పక్షులు, 34 వారాల వయసు వచ్చే వరకూ గాని, లేక 25 కేజీల శరీర బరువు పెరిగేటంతవరకూ గాని ఆహారం అందించాలి. వాటి ఆహారంలో 10 % ఆకుకూరలు, ముఖ్యంగా వివిధ రకాలైన ఆకు మేతను ఉండేటట్లు చూడాలి. వీని వలన, అది పీచుపదార్థం కలిగిన ఆహారానికి అలవాటుపడతాయి. శుభ్రమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలి. అవి కోరుకున్నంత ఆహారాన్ని అందించాలి. పెరుగుతున్నంత కాలం, పెంపకశాలలో, ఊకను పరచిన ప్రదేశం పొడిగా ఉండేస్థితికి కొనసాగించాలి.

ఆరోగ్యపరమైన జాగ్రత్తలు , నిర్వహణ

[మార్చు]

రేటైట్ జాతికి చెందిన ఈము పక్షులు సాధారణంగా, దృఢంగా ఉండి ఎక్కువ కాలం జీవిస్తాయి. (80 జీవితకాలం). మరణాలు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఈము పక్షుల చిన్న పిల్లలలోనూ, ఎదుగుతున్న క్రమంలోనూ సంభవిస్తాయి. పక్షుల పిల్లలకు, ఒక వారం వయసులో (లసోటా - lasota) (R.D) రాణి ఖేత్ జబ్బు కొరశు 4 వారాల వయసులో (lasota booster) (లసోటా బూస్టర్ మోతారులో) టీ కాలను యిప్పించడం, 8, 15,, 40 వారాల వయసులో ముక్తేశ్వరే స్ట్రేయిన్ యివ్వడం వలన అధిక రోగ నిరోధక శక్తి కలుగుతుంది.

ఈము పక్షుల పెంపకంలో ఆర్థిక లాభాలు

[మార్చు]

ఈము పెంపర్ కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం సంతానోత్పత్తి దశలో ఉన్న పక్షుల ఖరీదు చాల ఎక్కువ (61 %) మిగిలిన పెట్టుబడులు, పెంపక కేంద్రం (13 %), గుడ్లను పొదిగే స్థలం (hatchery) (19 %) పై పెట్టబడతాయి. జతకట్టే దిశలో ఉన్న జంట పక్షుల ఆహారానికి, సంవత్సరానికి 3600 రూ. ఖర్చు అంచనా వెయ్యడం జరిగింది. గుడ్డు పొదగడానికి, ఒకరోజు వయుసు కల పక్షి పిల్లకు అయ్యే ఉత్పత్తి ఖర్చు వరుసగా 793 రూ., 1232 రూ. ఏడాది ఆహార సగటు, ఒక జంట పక్షులకు 524 కేజీలుగా లేక్కించబడింది. దాని ఖర్చు 3,578 రూపాయలు. రోజుల వయసులో ఉన్న అమ్మదగిన ఎమూపక్షి పిల్ల ఖరీదు 2500 – 3000 రూపాయలు. మంచి పొదిగే వనరులు (80% మించి), తక్కవ ఆహార ఖర్చు, కనిష్ఠ పక్షిపిల్లల మరణాల వలన (10 % కంటే తక్కువ), ఎమూ పక్షులూ నుండి అధిక లాభాలు అర్జించవచ్చు.

ఈము పక్షుల ఉత్పత్తులు

[మార్చు]

ఈము, ఆస్ట్రిచ్ ల మాంసం, తక్కువ కొవ్వ కలిగి ఉండడంలో, తక్కువ కొలెస్ట్రాల్ కలిగి ఉండడంలో, విలక్షణమైన రుచి వంటి లక్షణాలకు సంబంధించి శ్రేష్ఠమైనది. తోడు భాగం,, కాలిక్రింది భాగంలో ఉండే పెద్దకండరం, ఎమూ పక్షిలోని లాభకరమైన మాంస భాగాలు. ఎమూ చర్మం సున్నితం గానూ, బలం గానూ ఉంటుంది. కాలి చర్మం ఒక విలక్షణమైన పద్ధతిలో ఉంటుంది. అందువలన అది చాల ఖరీదైనది. ఎమూ కొవ్వు నుండి నూనెను ఉత్పత్తి చేస్తారు. దీనికి ఆహారపరంగా, వైద్యపరంగా (anti-inflammatory - వాపులను తగ్గిస్తుంది), అలంకరణ ద్రవ్యంగా మంచి విలువ ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. 1.0 1.1 ప్రగతిపీడియా జాలగూడు[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]